చిత్రం: యానిమల్
తేదీ: డిసెంబర్ 01, 2023
రేటింగ్: 4/5
బాటమ్ లైన్: “Historic high-voltage action thriller ‘Animal’ from the father-son duo.”
తారాగణం: రణబీర్ కపూర్, అనిల్ కపూర్, బాబీ డియోల్, రష్మిక మందన్న, త్రిప్తి దిమ్రీ, చారు శంకర్, బబ్లూ పృథ్వీరాజ్, శక్తి కపూర్ తదితరులు
ఎడిటింగ్: సందీప్ రెడ్డి వంగా
డీఓపి: అమిత్ రాయ్
సంగీతం: JAM8, విశాల్ మిశ్రా, జానీ, మనన్ భరద్వాజ్, శ్రేయాస్ పురాణిక్, హర్షవర్ధన్ రామేశ్వర్, అషిమ్ కెమ్సన్
నిర్మాతలు: భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా, క్రిషన్ కుమార్,
కథ, దర్శకుడు: సందీప్ రెడ్డి వంగా
‘అర్జున్ రెడ్డి’ మొదటి చిత్రంతో స్టార్ దర్శకుడు గా పేరు తెచ్చుకున్న సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణబీర్ కపూర్ & రష్మిక జంట గా నటించిన చిత్రం ‘యానిమల్’. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, సాంగ్స్ భారీ స్థాయిలో అంచనాలు పెంచిన ఈ చిత్రం, ఈ నెల 1న గ్రాండ్ గా థియేటర్లలో విడుదలైనది. ఈ చిత్రం, ఏ మేరకు ప్రేక్షకులని ఆకట్టుకుంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం!!
కథ:
రన్ విజయ్ సింగ్(రణ్‌బీర్ కపూర్) దేశంలోనే అత్యంత ధనవంతుడైన బల్బీర్ సింగ్(అనిల్ కపూర్) వ్యాపారవేత్త ఏకైక కుమారుడు. విజయ్‌కి చిన్నప్పటి నుంచి తండ్రి అంటే ఇష్టం. కాకపోతే, తండ్రి బిజినెస్ లో నిమగ్నమై పెళ్ళాం, పిల్లలతో సమయం గడపడు. ఇదిలా, ఉంటే తన అక్కని స్టూడెంట్స్ ర్యాగింగ్ చేశారని గన్‌తో బెదిరిస్తాడు. ఈ విషయం తెలిసిన తండ్రి ఫారెన్ లో చదివిపిస్తాడు. తండ్రి 60వ బర్త్‌డే సెలబ్రేషన్స్ కోసం ఇంటికి తిరిగి రాగ, బర్త్‌డే సెలబ్రేషన్స్ లో వరుణ్(సిద్ధాంత్ కర్నిక్)బావతో గొడవ పడతాడు. దింతో మళ్లీ తండ్రి & కొడుకు మధ్య దూరం పెరుగుతుంది. అదే టైమ్ లో గీతాంజలి(రష్మిక మందన్నా)ని తన నాన్న కి పరిచయం చేసి, పెళ్లి చేసుకొని విజయ్ అమెరికాకు వెళ్ళిపోతాడు. కొన్నాళ్లకు తండ్రిపై ఏటాక్ జరిగిందని తెలియడంతో ఇండియాకు వస్తాడు. నాన్నను చంపడానికి ప్రయత్నించివారిని చంపుతానని ప్రామిస్ చేస్తాడు. అసలు తన తండ్రిని ఎందుకు చంపాలనుకున్నారు? వాళ్ళని విజయ్ ఎలా కనిపెట్టాడు? తండ్రి కోసం విజయ్ ఏం చేశాడు? అబ్రార్ హక్(బాబీ డియోల్) ఎవరు? చివరకు విజయ్ తన తండ్రిని కాపాడుకున్నాడా? లేదా? అనేది తెలియాలంటే సినిమా థియేటర్ లో చూడాలిసిందే!!
కథనం, విశ్లేషణ:
తండ్రి కోసం ఎంత దూరమైన ప్రయాణం చేయగలిగే సత్తా ఉన్న ఒక ‘సూపర్ ఫాదర్’, కొడుకు ప్రేమ కథే ‘యానిమల్’. ఈ చిత్రం పక్కా ‘రివేంజ్ డ్రామా’. కథను బోల్డ్‌గా, వైలెంట్ గా జోడిస్తునే ఎమోషన్స్ కి పెద్ద పీఠం వేసి తారా స్థాయిలో తెరపై లైవ్లీ గా చూపించాడు.
ఫస్ట్ హాఫ్: తండ్రి బిజినెస్ పనుల్లో ఉండి పిల్లల్ని పట్టించుకోకపోవటం. కనీసం, తన పిల్లలు ఎక్కడ చదువుకున్నారు, ఎలా ఎదిగారు అనేది కూడా తండ్రికి సరిగ్గా తెలియకపోవటం. తండ్రి ప్రేమ కి దూరమై పరిస్థితులు అనుకూలించకపోవడంతో కొన్ని బలమైన సన్నివేశాలు ద్వారా యారొగెంట్ గా మారతాడు. సినిమా మొత్తం సందీప్‌రెడ్డి వంగా స్టైల్లోనే సాగుతుంది. నాన్న పాట చాలా ఎమోషనల్‌గా కనెక్ట్ అవ్వుతుంది. హీరోయిన్ ఎంగేజ్మెంట్ అయ్యాక తన మాటలతో ప్రేమలో పడేసే సీన్ ఆకట్టుకుంటుంది. ఇద్దరి మధ్య సాగే బోల్డ్ సీన్స్ క్యూట్ గా ఉంటాయి. ఇంటర్వెల్ ముందు వచ్చే యాక్షన్ హై ఓల్టేజ్ సీన్ వేరే లెవెల్. సింగ్ ల బంధం వాళ్ళతో సాగే కొన్ని బలమైన సన్నివేశాలు రోమాలు నిక్కబొడుచుకుంటాయి. స్క్రీన్‌ప్లేతో ఫస్టాఫ్‌ని ఇంట్రెస్టింగ్గా మలిచాడు దర్శకుడు.
సెకండాఫ్: కొన్ని సన్నివేశాలు స్లో అనిపిస్తాయి. విజయ్/రణబీర్ తన ప్రవర్తనతో క్రూరంగా బిహేవ్ చేసినప్పటికీ, ‘గీతాంజలి’ భూదేవి లా భరించే సీన్స్ పోట్రైట్ చేసిన విధానం. ఆ తరువాత, ‘జోయా’తో(త్రిప్తి దిమ్రీ) కలిసి చేసే రొమాంటిక్ ఇంటిమేట్ సీన్స్ యూత్ ని షేక్ చేస్తుంది. బాబీ డియోల్ పాత్ర ఎంట్రీ సీన్ థియేటర్ లో విజిల్స్. క్లైమాక్స్‌లో బాబీ డియోల్, రణ్‌బీర్‌కి మధ్య జరిగే యాక్షన్ సీక్వెన్స్ సగటు ప్రేక్షకుడికి వణుకు పుట్టిస్తాయి.
ఈ చిత్రంలో తండ్రి కొడుకుల ప్రేమ, కుటుంబ అనుబంధాలు, భార్య భర్తల బాండింగ్ తో పాటు, హింస, మితిమీరిన శృంగార సన్నివేశాల కారణంగా ఫ్యామిలీ ఆడియెన్స్ కు కాస్త ఇబ్బంది కలుగుతుంది. కాకపోతే, ఇలాంటి సినిమా చాలా అరుదుగా వస్తాయి. ప్రతి ఒక్కరు థియేటర్ లో తప్పకుండా చుడాలిసిన సినిమా డోంట్ మిస్ ఇట్.
నటినటులు పెర్ఫామెన్స్:
హీరో ‘రణబీర్ కపూర్’ తన సినీ కేరీర్ లో ది బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చాడు. కొన్ని సీన్స్ లో ఇచ్చిన వేరియేషన్స్ ఆడియెన్స్ కి మెంటల్ ఎక్కిపోయింది అనే చెప్పాలి. ‘రష్మిక’ సాధారణ మిడిల్ క్లాస్ అమ్మాయిల నటించి కొన్ని సీన్స్ లో డైలాగ్ డెలివెరి చెప్పిన విధానం సూపర్బ్. ‘అనిల్ కపూర్’ ఎంతో సెట్టిల్డ్ పెర్ఫామెన్స్ ఇచ్చారు. ‘బాబీ డియోల్’ విలన్ గా, నటన పరంగా ఈ చిత్రం ఒక మైల్ స్టోన్ గా తన కెరీర్ లో నిలుస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ‘త్రిప్తి దిమ్రీ’ తెర మీద తక్కువే కనిపించినప్పటికీ తన పెర్ఫామెన్స్ డ్రగ్ లాగా ఎక్కుతుంది.
సాంకేతిక విభాగం:
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఊహించనంత పనే చేసాడు. కొన్ని సన్నివేశాలను తారా స్థాయిలో బలమైన ఎమోషన్స్ ని తెరకెక్కించాడు. సినిమాలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలైట్. సంగీత దర్శకుడు అందించిన తెలుగు పాటలు ఓ మేరకు ఆకట్టుకున్నాయి. సినిమాటోగ్రఫీ సినిమాకి అసెట్. ఇక ఎడిటింగ్ విషయానికి వస్తే, సెకండ్ హాఫ్ లో సీన్స్ తగ్గించే అవకాశం ఉన్నప్పటికీ, ఫీల్ పోతుంది అనే ఉద్దేశంతో దర్శకుడు కట్ చేసి ఉండకపోవచ్చు. నిర్మాణ విలువులు రిచ్ గా ఉన్నాయి.
రివ్యూ బై: తిరుమలశెట్టి వెంకటేష్
గమనిక: మేము రాసే రివ్యూలు ఒక వ్యక్తి లేదా సంస్థ కి అనుకూలంగా కానీ, ఒకరిని ఉద్దేశించి రాసింది కాదు. కేవలం, మా రివ్యూర్ అభిప్రాయం మాత్రమే. మీరు పెట్టిన ఎఫర్ట్స్ ప్రశంసనీయం. మీరు అందించిన ఈ చిత్రం థియేటర్ లో సక్సెస్ ఫుల్ గా రన్ అవ్వాలని కోరుకుంటున్నాం.