పాన్ వరల్డ్ హీరో, యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ , కెజిఫ్ దర్శక ధీరుడు ప్రశాంత్ నీల్ కలయికతో రాబోతున్న చిత్రం సలార్ . శృతి హాసన్ కథానాయకి గా చేస్తున్నారు. Hombale Films సంస్థ నిర్మిస్తున్నారు . ప్రపంచ ప్రభాస్ అభిమానులు మొత్తం ఎప్పుడా అంటూ ఎదురుచూస్తున్న తరుణం రానేవచ్చింది. సలార్ మొదటి భాగం సీజ్ ఫైర్ ట్రైలర్ ఈరోజు విడుదల అయ్యింది, అది చూసి ప్రభాస్ అభిమానులే కాదు, యావత్ ప్రపంచం అంత సలార్ గొప్ప విజయం సాధిస్తుంది అని నమ్మకాన్ని వ్యక్తపరుస్తున్నారు . తమ అభిమాన హీరో ని అలాంటి ఒక గొప్ప మాస్ పాత్రలో చూసి అభిమానులు పూనకాలతో ఊగిపోతున్నారు అనే చెప్పాలి. ఈ చిత్రం ట్రైలర్ విశ్లేషణ , మిగతా వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
పాన్ వరల్డ్ స్టార్ గా ఎదిగిన ప్రభాస్ గారికి అంతకు తగ్గ హిట్ ఇంకా పడలేదు. ఎంత గొప్ప పాత్రలు చేస్తున్నా సినిమాలు విజయబాట పట్టట్లేదు . అలంటి తరుణంలో ప్రభాస్ అభిమానులకి దొరికిన ఆశాకిరణం ప్రశాంత్ నీల్. ఈ కన్నడా దర్శకుడు చేసింది రెండు చిత్రాలు అయినా సినిమా ప్రియులకి గుర్తుండిపోయే చిత్రాలని తెరకెక్కించారు. ఆయన నుంచి వచ్చింది కెజిఫ్ సిరీస్ యావత్ భారతావనినే కాదు, ప్రపంచాన్నే కుదిపేసింది. వీళ్ళ ఇద్దరి కలయికతో చిత్రం అనగానే పక్కా మాస్ సినిమా అని అభిమానులు ఫిక్స్ అయ్యారు. ట్రైలర్ కూడా అలానే ఉంది. వరదరాజ మన్నార్ ( పృథ్విరాజ్ సుకుమారన్ ), దేవా (ప్రభాస్ ) ప్రాణ మిత్రులు , తన ప్రాణం మిత్రుడికి ఏ ఆపద వచ్చినా దేవా ఓర్చుకోలేదు. ప్రాణాలు తియ్యటానికి అయినా , ఇవ్వటానికి అయినా వెనుకాడడు. ఇదిలా ఉంటే వీళ్లు నివసించే ప్రాంతం పేరు ఖాంసార్ . అది ఒక బందిపోట్ల ముఠా కోట. అతిభయంకరమైన సంస్థానం అది. దానికి మకుటం లేని రాజు రాజ మన్నార్ (జగపతి బాబు ). ఏ రాజ్యానికైనా కుతంత్రాలు జరిగేది , యుద్ధం ముప్పు ఉండేది అధికారం కోసమే కదా, అలంటి సమస్యే వరదరాజుకి వస్తుంది. తన తండ్రి లేని సమయంలో ఆ రాజ్యంలోని ముఖ్యులే పరాయి దేశం వాళ్ళతో మూకుమ్మడిగా దాడిచేస్తారు. తన ప్రాణ స్నేహితుడు దేవా వచ్చి ఒక సైనిక బలంగా తనని కాపాడటానికి వీరోచిత పోరాటం చేస్తాడు. తన ప్రాణ స్నేహితుడిని కాపాడతాడు.
తన స్నేహానికి తలెత్తే ఒక సమస్య, వరదరాజు మన్నార్ కి కావలసినది తాను సాధించి ఇవ్వటం, ఈ క్రమంలో దేవా చేసిన పోరాటంలో తనకి ఏమయ్యింది. సలార్ ఎవరు, తనకి ఈ సామ్రాజ్యానికి సంబంధం ఏమిటి? ఈ సామ్రాజ్యం భవిష్యత్తు ఎవరి చేతుల్లోకి వెళుతుంది అనేది మిగతా కథ. ప్రశాంత్ నీల్ మీద పెట్టుకున్న ఆశలు అయన నిలబెట్టుకున్నారని అనిపిస్తోంది ట్రైలర్ చూస్తుంటే. ప్రతి షాట్ లో ఒక కొత్త పాత్రని ప్రవేశపెట్టారు. కొంచం కెజిఫ్ చారలు ఉన్నాకూడా, ఎక్కడా కూడా పోలికలు కనిపించేలా లేదు. దర్శకులు ఇదివరుకు చెప్పిన విధంగానే సలార్ కి, కెజిఫ్ కి సంబంధం లేదు అలంటి ఛాయలు ఈ ట్రైలర్లో కనిపించలేదు. అబ్బురపరిచే ఎలేవేషన్ చాలా ఇచ్చారు దర్శకులు.
రవి ఇచ్చిన బాక్గ్రౌండ్ మ్యూజిక్ అద్దిరిపోయింది . ప్రభాస్ ని చూపించిన విధానంని రవి ఇచ్చిన మ్యూజిక్ వేరే రేంజ్ కి తీసుకెళ్లింది. ఛాయాగ్రాహకుడు భువన్ గౌడా చేసిన పనితనం అమోఘం . పోరాట సన్నివేశాలని చిత్రీకరణ ఈ చిత్రానికి ఒక గొప్ప సవాలు అని అనిపిస్తోంది. పోరాట సన్నివేశాలలో కానీ, ప్రభాస్ చెప్పే చిన్నపాటి డైలాగ్స్ కానీ, అదిరిపోయాయి . ఈ చిత్రానికి ఎడిటర్ గా పనిచేసిన ఉజ్వల్ కులకర్ణి ని మెచ్చుకోకుండా ఉండలేము. ఎందుకంటే ఎడిటింగ్ అంత గొప్పగా ఉంది మరి. ఫాన్స్ కి పండగనే అని కచ్చితంగా చెప్పొచ్చు .
ఈ చిత్రంలో హీరోయిన్ గా శృతీ హాసన్ చేస్తున్నారు, రాజ మన్నార్ గా జగపతి బాబు గారు తన నట విశ్వరూపం చూపించబోతున్నారు, ఈశ్వరి రావు గారు ఒక ముఖ్య భూమిక పోషిస్తున్నారు. బహుశా ఆవిడ సలార్ తల్లి అయ్యే అవకాశాలు లేకుండా పోలేదు. ప్రభాస్ గారు పక్కా మాస్ అవతారంలో మెరవబోతున్న. ఈ చిత్రం డిసెంబర్ 22 వ తేదీన రాబవుతోంది అని చిత్రబృందం ఇదివరకే వెల్లడించారు. ఇప్పుడు ట్రైలర్లో కూడా అదే తేదీని తెలిపారు . మొత్తానికి సలారుడు అందరినీ మెప్పించటానికి త్వరలో మన ముందుకు రాబోతున్నాడు. వేచిచూడాలి కత్తులతో తన విళయ తాండవం ఎలా ఉండబోతోందో!