- Advertisement -spot_img
HomeUncategorizedPindam Movie Review: పిండం మూవీ రివ్యూ

Pindam Movie Review: పిండం మూవీ రివ్యూ

- Advertisement -spot_img

చిత్రం: పిండం
రేటింగ్: 2.75/5
బాటమ్ లైన్: భయపెట్టలేకపోయిన, ఆకట్టుకున్న “పిండం”.

నటి నటులు: శ్రీరామ్, ఖుషి రవి, ఈశ్వరీ రావు, అవసరాల శ్రీనివాస్, రవివర్మ తదితరులు….
డీఓపీ: సతీష్ మనోహర్
సంగీతం: కృష్ణ సౌరభ్ సూరంపల్లి
ఎడిటర్: శిరీష్ ప్రసాద్
కథ: సాయికిరణ్ దైదా, కవి సిద్ధార్థ
సహ నిర్మాత: ప్రభు రాజా
సమర్పణ: ఆరోహి దైదా
నిర్మాత: యశ్వంత్ దగ్గుమాటి
బ్యానర్: కళాహి మీడియా
దర్శకుడు: సాయికిరణ్ దైదా

ప్రముఖ హీరో శ్రీరామ్, ఖుషీ రవి జంటగా నటించిన
చిత్రం “పిండం”, ‘ది స్కేరియస్ట్ ఫిల్మ్’ అనేది ఉపశీర్షిక.
ప్రేక్షకులను భయపెట్టడమే లక్ష్యంగా తెలుగులో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాతో ‘సాయికిరణ్ దైదా’ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కళాహి మీడియా బ్యానర్‌పై ‘యశ్వంత్ దగ్గుమాటి’ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ & టీజర్ కి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. ఈ సినిమా డిసెంబర్ 15వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదల కానుంది. ఈ సంద్రభంగా చిత్ర యూనిట్ ‘ప్రీమియర్ షో’ను నిర్వహించారు. మరి, ఈ సినిమా సగటు ప్రేక్షకుడిని ఏ విధంగా ఆకట్టుకోనుందో విశ్లేషుకుడి మాటల్లో తెలుసుకుందాం!!

కథ: 1990 సంవత్సరం శుక్లాపేట్ గ్రామంలో ‘నాయుడమ్మ కుటుంభం’ ఉన్న ఇంటిని యాంటోని(శ్రీరామ్) & మేరీ(ఖుషి రవి) ఫ్యామిలీ కొనుగోలు చేసి (సోఫీ, తార) పిల్లలతో మరియు నానమ్మ తో కలిసి నివసిస్తారు. కొన్ని రోజులు తరువాత ఏదో తెలియని శక్తీ కుటుంభాన్ని భయ్యభ్రాంతులని చేస్తాయి. ఆ దెబ్బతో, ఇంటిని వదిలి వెళ్ళిపోవాలి అనుకుంటారు. కాకపోతే, ఆ దుష్ట శక్తి ఇంట్లో నుంచి వెళ్లనివ్వదు? ఇంతకీ ఆ దుష్ట శక్తీ ఎవ్వరు? ఎందుకు భయ్యపెడుతుంది? తన ఫ్లాష్ బ్యాక్ ఏంటి? సమస్యలో ఉన్న కుటుంబాన్ని ‘అన్నమ్మ'(ఈశ్వరి రావు) తన బృందంతో కలిసి కాపాడగలిగిందా? అనేది కథ?

కథనం, విశ్లేషణ:
ఇంట్రో లో ‘అన్నమ్మ'(ఈశ్వరి రావు) మీద ఎటాక్ చేస్తున్న డాగ్ తో సినిమా స్టార్ట్ అవ్వుతుంది. ఆ సీన్ చూస్తున్నంత సేపు చాలా విచిత్రంగా అనిపిస్తుంది. ఇంతలో, లోకనాధ్(అవసరాల శ్రీనివాస్) కేస్ స్టడీ కోసం ‘అన్నమ్మ’ ఫ్యామిలీ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుంటాడు. దాంతో పాటు, కేస్ స్టడీ ద్వారా యాంటోని(శ్రీరామ్) & మేరీ(ఖుషి రవి) ఫ్యామిలీ స్టోరీలోకి వెళ్తారు. ఇక్కడ నుంచి స్టోరీ స్టార్ట్ అవ్వుతుంది. తారాతో సాగే కొన్ని సన్నివేశాలు తెరపై బాగా ఆకట్టుకోవడంతో పాటు, భయానకంగా అనిపిస్తుంది. అక్కడక్కడ వచ్చే నానమ్మ సిక్వెన్స్ చాలా న్యాచురల్ గా అనిపిస్తాయి. ఇంటర్వెల్ బ్యాంగ్ సింపుల్ గా బాగుంటుంది. ఒక తెలియని దుష్ట శక్తీ “శ్రీరామ్” కుటుంబాన్ని భయపెట్టడంతో, ఇల్లు వదిలి వెళ్ళిపోవాలి అనుకుంటారు. అయ్యితే ఆ దుష్ట శక్తీ వాళ్ళని ఆపడంతో పాటు, ఒక ప్రాణాన్ని తీసుకుంటుంది. ఫస్ట్ హాఫ్ బాగున్నప్పటికీ, కొన్ని సన్నివేశాలు ద్వారా అంతరలీనంగా కథని చెప్పడానికి దర్శకుడు ప్రయత్నం చేస్తుంటాడు. టెక్నీకల్ గా కొన్ని షాట్స్ బాగుంటాయి. అయ్యితే, హీరో గా ‘శ్రీరామ్’ ని అందరు యాక్సెప్ట్ చేయలేకపోవచ్చు. ఫ్లాష్ బ్యాక్ కథ బాగున్నప్పటికీ ఇంకాస్త బలంగా చెప్పి ఉంటే బాగుండు. అలాగే, నాయుడమ్మ ఎలా చనిపోయాడు అనేది చూపించకపోవడం? క్లైమాక్స్ లో కొన్ని సీన్స్ ఆడియెన్స్ అర్ధం చేసుకోవడానికి కాస్త సమయం పట్టచ్చు? అలాగే, ప్రి క్లైమాక్స్ & క్లైమాక్స్ పోర్షన్ అంత లో నుంచి హై / హై నుంచి లో అయ్యితునట్టు అనిపిస్తుంది. క్యాస్టింగ్ ఇంకాస్త, బలంగా ఉండి ఉంటే కథ పరంగా దర్శకుడికి ఇంకాస్త హెల్ప్ అయ్యే అవకాశం ఉందనిపిస్తుంది. ఏదైమనప్పటికీ, ‘పిండం’ సినిమా ఖచ్చితంగా థియేటర్స్ లో చూడాలిసిన సినిమా.

నటీనటులు:
గతంలో, ‘శ్రీరామ్’ మూవీస్ ద్వారా చేసిన అద్భుతమైన పెర్ఫామెన్స్ ఒక ఎత్తు అయ్యితే, పిండంలో తను చేసిన యాక్టింగ్ ఒక మైల్ స్టోన్ గా నిలిచిపోతుంది. ‘ఖుషీ రవి’ అమ్మ క్యారెక్టర్ లో చాలా సహజంగా నటించి, కొన్ని సన్నివేశాలలో మెప్పించింది. ‘ఈశ్వరీ రావు’, తనదైనా స్టైల్ లో ఆకారంతో, హావభావాలతో, ‘కి’ రోల్ పోషిస్తునే నటనతో ఆకట్టుకుంది. కాకపోతే కొన్ని సీన్స్ లో డబ్బింగ్ సరిగ్గా సింక్ అవ్వలేదు. అవసరాల శ్రీనివాస్ ని ఈ సినిమాలో చాలా కొత్తగా చూస్తాం. ఇకపోతే, ఈ సినిమాలో యాక్ట్ చేసిన కిడ్స్(లీషా & చైత్ర) మైండ్ బ్లోయింగ్ పెర్ఫామెన్స్ తో హడలెత్తించారు. తదితర ఆర్టిస్టులు తమ పరిధి మేరకు రాణించారు.

Kushi Ravi at Pindam Movie Interview

సాంకేతిక విభాగం:
కథలో కొత్తధనం లేకపోయినప్పటికీ, కథని బలంగా చెప్పడంలో చిన్నపాటి పొరపాట్లు ఉన్న, దర్శకుడు ‘సాయికిరణ్ దైదా’ ఎగ్జిక్యూషన్ లో పాస్ అయ్యాడు. కృష్ణ సౌరభ్ సూరంపల్లి అందించిన ఆర్ఆర్ సినిమాకు ప్రాణం పోశాయి. ముఖ్యంగా, క్లైమాక్స్ కు అందించిన మ్యూజిక్ వేరే లెవెల్. కెమేరామ్యాన్ ‘సతీష్ మనోహర్’ వర్క్ సూపర్బ్. ఎడిటర్ వంద శాతం న్యాయం చేశాడు. నిర్మాణ విలువలు రిచ్ గా ఉన్నాయి.

రివ్యూ బై: తిరుమలశెట్టి వెంకటేష్

గమనిక: మేము రాసే రివ్యూలు ఒక వ్యక్తి కి లేదా సంస్థ కి అనుకూలంగా కానీ, ఒకరిని ఉద్దేశించి కానీ రాసింది కాదు. కేవలం, మా రివ్యూర్ అభిప్రాయం మాత్రమే. మీరు పెట్టిన ఎఫర్ట్స్ ప్రశంసనీయం. మీరు అందించిన ఈ చిత్రం థియేటర్ లో సక్సెస్ ఫుల్ గా రన్ అవ్వాలని కోరుకుంటున్నాం.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Stay Connected
44,085FansLike
65,000FollowersFollow
52,453SubscribersSubscribe
Must Read
- Advertisement -spot_img
Related News
- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

You cannot copy content of this page