చిత్రం: బబుల్‌గమ్
రేటింగ్: 2.75/5
బాటమ్ లైన్: “Roshan Kanakala & Maanasa Choudhary Shine Bright, Crushing Trolls with Outstanding Performances!”
విడుదల తేదీ: 2023 డిసెంబరు 29
నటి నటులు: రోషన్ కనకాల, మానస చౌదరి, వైవ హర్ష, చైతు జొన్నలగడ్డ, హర్షవర్ధన్, బిందు, అనుహాసన్ తదితరులు….
డీఓపీ: సురేష్ రఘుతు
సంగీతం: శ్రీచరణ్ పాకాల
కథ: రవికాంత్ పేరేపు, విష్ణు కోడూరు, సేరి గన్ని
బ్యానర్: మహేశ్వరి మూవీస్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరి
దర్శకుడు: రవికాంత్ పేరేపు
‘బబుల్‌గమ్’ లాంటి యూత్ ఫుల్ సినిమాతో యాంకర్ సుమ కుమారుడు ‘రోషన్ కనకాల’ వెండితెరపై కనిపించనున్నాడు. జోడీగా మానస చౌదరి నటిస్తుంది. అడివి శేష్‌తో ‘క్షణం’ సినిమాతో హిట్ కొట్టిన డైరెక్టర్ ‘రవికాంత్ పేరేపు’ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, మహేశ్వరి మూవీస్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే, ఈ సినిమా ట్రైలర్ & సాంగ్స్ తో యూత్ ఉక్కిరిబిక్కరి అవ్వగా, ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా డిసెంబర్ 29న రీలిజ్ అవ్వుతుంది. ఈ సంద్రభంగా చిత్ర యూనిట్ ప్రెస్ షో నిర్వహించారు. మరి, ఈ సినిమా సగటు ప్రేక్షకుడిని ఏ విధంగా ఆకట్టుకోనుందో విశ్లేషుకుడి మాటల్లో తెలుసుకుందాం!!
కథ: సాయి ఆదిత్య(రోషన్ కనకాల) ఒక మధ్య తరగతి అబ్బాయి. డీజేగా ఎదగాలని తన కళ. జాహ్నవి/జాను(పరుచూరి మానస చౌదరి) ఒక ఫ్యాషన్ డిజైనర్, పై చదువులు కోసం ‘టర్కీ’ కి 6మంత్స్ లో ఫారెన్ కి వెళ్లేముందు కుర్రాళ్లని తన వెంట తిప్పించుకుందాం అనుకుంటుంది. ఈ లోగా, ‘ఆదిత్య’ పబ్ లో ‘జాను’ని చూసి ఎట్ట్రాక్ట్ అవ్వుతాడు. అలా ఇద్దరు పబ్ లో కలిసాక, తరుచు మీట్ అవ్వుతుంటారు. ఆ ప్రోసెస్ లో ఆదిత్య, ‘జాను’కి ప్రపోజ్ చేస్తాడు? ఆదిత్య తో టైమ్ పాస్ చేసిన జాను తన ప్రపోజ్ ని యాక్సెప్ట్ చేసిందా? జాను ఎక్స్ బాయ్ ఫ్రెండ్ వల్ల ఆదిత్య ఏం కోల్పోయాడు? జాను – ఆదిత్య ఇజ్జత్ ఎందుకు తీసింది? ఆదిత్య తిరిగి ఇజ్జత్ ని సంపాదించుకున్నాడా? అనే వివరాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే?
కథనం, విశ్లేషణ:
గతంలో కానీ, వర్తమానంలో కానీ, యూత్ ని ఆకట్టుకునే ‘బబుల్‌గమ్’ లాంటి సినిమాలు చాలానే వచ్చాయి. కాస్త, స్క్రీన్ ప్లే తో పాటు ఈ తరం యూత్ ని ఆకట్టుకునే విధంగా తియ్యగలిగితే ఆ సినిమాని సూపర్ హిట్ చేసి నెత్తిన పెట్టుకుంటారు ఆడియెన్స్. టైమ్ పాస్ గా లవ్ చేసి సీరియస్ గా ప్రేమలో పడిన అమ్మాయి తన ప్రేమని గెలుచుకుందా? సీరియస్ గా అమ్మాయిని లవ్ చేసి లవ్ లో పొయ్యిన ఇజ్జత్ ని తిరిగి హీరో కాపాడుకున్నాడా? చివ్వరికి ప్రేమ గెలిచిందా? ఇజ్జత్ గెలిచిందా? కాన్సెప్ట్ బాగున్నా, దర్శకుడు ఏ మేరకు మెప్పించారో తెలుసుకుందాం!!
మొదటి భాగం: ఆదిత్య(రోషన్ కనకాల) బట్టలు లేకుండా చాలా ఎమోషనల్ గా సాగే సీన్ సినిమా ఓపినింగ్ తో మొదలవ్వుతుంది. కట్ చేస్తే, ‘ఆదిత్య’ పెంట్ హౌస్ మీద నైబర్ తో గొడవపడుతుంటాడు. వాళ్ల మధ్య జరిగే ఫైట్ బాగుంటుంది. అయ్యితే ‘ఆదిత్య’ ఒక ‘డీజే’ దగ్గర అసిస్టెంట్ గా పని చేస్తుంటాడు. ఒక రోజు ‘పబ్’లో జాహ్నవి/జాను(చెరుకూరి మానస చౌదరి)ని చుసిన ఆదిత్య తనకి తన మాటలకి ఎట్రాక్ట్ అవ్వుతాడు. వీళ్ళ ఇద్దరి మధ్య సాగే ఇంట్రాక్షన్ & లవ్ సన్నివేశాలు యూత్ ని బాగా ఆకట్టుకుంటాయి. కాకపోతే, అక్కడక్కడ సీన్స్ చాలా సాగదీత గా, సీన్స్ ఇన్ కంప్లీట్ గా అనిపిస్తుంటాయి. మొదటి భాగాన్ని ‘శ్రీ చరణ్ పాకాల’ ఇచ్చిన స్కోర్ అండ్ మ్యూజిక్ తో సినిమాని కాపాడింది అనే చెప్పాలి. ఇక, అది కి – జాను కి మధ్య జరిగే వాగ్వాదం ఇంటర్వెల్ సీన్ సినిమాకి హైలైట్.
రెండొవ భాగం: ఒక్కసారి గా ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చి, వెంటనే ఇద్దరు కలిసే ప్రయత్నం కొంచెం, జీర్ణించుకోవడానికి కాస్త సమయం పడుతుంది. వైవ హర్ష లాంటి కమెడియన్ ఉన్నప్పటికీ, కామెడీని సరిగ్గా దర్శకుడు రాబట్టుకోలేకపొయ్యాడు. హీరో & హీరోయిన్ ల మధ్య కెమిస్ట్రీ బాగుంటుంది. సినిమాలో విలన్ లేకపోవటం, కథ లో సరైన నాణ్యత లోపించడం. హీరో & హీరోయిన్ స్ట్రాంగ్ క్యారెక్టర్స్ అయ్యినప్పటికీ సరైన ముగింపు ఇవ్వలేకపోవటం, కన్విన్స్ గా చెప్పలేకపోవటం కాస్త సినిమాకి మైనస్ అనే చెప్పాలి.
ఈ చిత్రం అన్ని రకాల ప్రేక్షకులని ఆకట్టుకుంటుందా లేదా అనేది పక్కన పెడితే? కాస్త రొమాంటిక్ డోస్ ఎక్కువ ఉండటంతో ఫ్యామిలీ ఆడియెన్స్ చూడలేకపోవచ్చు.
నటీనటులు:
ప్రముఖ యాంకర్ సుమ కుమారుడు ‘రోషన్ కనకాల’ కూడా మొదట్లో కొన్ని ట్రోల్ల్స్ ఎదురుకున్న విషయం అందరికి తెలిసిందే. ఏ స్టార్ కొడుకు-కూతురు అన్నది కాదు ముఖ్యం. ఒక వ్యక్తి కలర్ కాదు చుడాలిసింది? టాలెంట్ ఉందా లేదా అనేది ప్రతి ప్రేక్షకుడు గుర్తించాలి!! ఆ కోవకి వస్తే, రోషన్ కనకాల 100% తన ఆల్ రౌండర్ పెర్ఫామెన్స్ తో ఇరగదీసాడు అనే చెప్పాలి. ఎమోషన్ సీక్వెన్స్ ని బ్యాలెన్స్ చేస్తూనే, అటు డ్యాన్స్ తో – తన స్కిన్ టోన్ కి తగ్గట్టు కాస్ట్యూమ్ జాగ్రత్త తీసుకున్న విధానం సూపర్బ్.
మానస చౌదరి, ప్రతి సీన్స్ లో వేరియేషన్ చూపిస్తూ, కళ్ళతో కవ్విస్తూ, హీరో ని ఏడిపిస్తూ, ముద్దులతో మత్తేక్కిస్తుంటుంది. సరైన డైరెక్టర్ చేతిలో ‘మానస’ పడితే టాప్ హీరోయిన్ గా ఎదిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. చైతు జొన్నలగడ్డ స్క్రీన్ మీద ఉన్నంత సేపు నవ్విస్తూనే, ఎమోషనల్ డైలాగ్స్ తో ఏడిపిస్తాడు. హర్షవర్ధన్ పాత్ర తెర మీద బాగుంటుంది. తదితర ఆర్టిస్టులు తమ పరిధి మేరకు రాణించారు.
సాంకేతిక విభాగం:
దర్శకుడు రవికాంత్ పేరేపు ఒక యువకుడి కథని అర్థవంతంగా, ఈ తరం యూత్ కి ఆకట్టుకునేలా తీసే ప్రయత్నం చేసినప్పటికీ సరైన వివరణ, ముగింపు ఇవ్వడంలో నిరాశపరిచాడు. ‘శ్రీచరణ్ పాకాల’, అందించిన ‘ఆర్ఆర్’ సినిమాకు ప్రాణం పోశాయి. అలాగే, సాంగ్స్ సినిమాకి ప్రధాన బలం. కెమేరామ్యాన్ ‘సురేష్ రఘుతు’ విజ్యువల్స్ ఓ మేరకు పర్వాలేదు. ఎడిటింగ్ కి ఇంకాస్త పని చెప్పాలిసింది. నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి.
రివ్యూ బై: తిరుమలశెట్టి వెంకటేష్
గమనిక: మేము రాసే రివ్యూలు ఒక వ్యక్తి కి లేదా, సంస్థ కి అనుకూలంగా కానీ, ఒకరిని ఉద్దేశించి కానీ రాసింది కాదు. కేవలం, మా రివ్యూర్ అభిప్రాయం మాత్రమే. మీరు పెట్టిన ఎఫర్ట్స్ ప్రశంసనీయం. మీరు అందించిన ఈ చిత్రం థియేటర్ లో సక్సెస్ ఫుల్ గా రన్ అవ్వాలని కోరుకుంటున్నాం.