చిత్రం: ‘సర్కారు నౌకరి’
రేటింగ్: 2.75/5
బాటమ్ లైన్: “Less Emotions, Maximum Impact, and an Unforgettable Story”
విడుదల తేదీ: 2024 జనవరి 1
నటి నటులు: ఆకాష్ గోపరాజు, భావన వజపాండల్, మధులత, తనికెళ్ళ భరణి, సాహితి దాసరి, రమ్య పొండూరి, సమ్మెత గాంధీ తదితరులు….
డీఓపీ: గంగనమోని శేఖర్
ఎడిటర్: రాఘవేంద్ర వర్మ
సంగీతం: సురేష్ బొబ్బిలి
కథ: గంగనమోని శేఖర్
బ్యానర్: ఆర్.కే టెలిషో ప్రైవేట్ లిమిటెడ్
కో-ప్రొడ్యూజర్: పరుచూరి కృష్ణ రావు
నిర్మాత: కే రాఘవేంద్ర రావు
దర్శకుడు: గంగనమోని శేఖర్
ప్రముఖ సింగర్ సునీత కుమారుడు ‘ఆకాష్ గోపరాజు’ హీరోగా, ‘భావన’ హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం ‘సర్కారు నౌకరి’. గంగనమోని శేఖర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ‘ఆర్కే టెలీ షో’ బ్యానర్ పై దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు నిర్మిస్తున్నారు. కొత్త సంవత్సరం సందర్భంగా జనవరి 1న ఈ చిత్రం విడుదల కానుంది. ప్రమోషన్స్ అగ్రెస్సివ్ గా చేయకపోయినప్పటికీ, సినిమా మీద ఒక పాజిటివ్ ఓపీనియన్ వచ్చింది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రెస్ షో నిర్వహించారు. మరి, ఈ సినిమా సగటు ప్రేక్షకుడిని ఏ విధంగా ఆకట్టుకోనుందో విశ్లేషుకుడి మాటల్లో తెలుసుకుందాం!!
కథ:
1996 మహబూబ్ నగర్ కొల్లాపూర్ గ్రామంలో ఒక అనాధ అయ్యిన ‘గోపాల్'(ఆకాష్ గోపరాజు) హెల్త్ ప్రమోటర్ గా, సర్కార్ నౌకరి దగ్గర పనిచేస్తాడు. నౌకరితో సత్య(భావన) పెళ్లి జరుగుతుంది. ఊరంత జనం నౌకరి పెళ్ళాం అని పొగుడుతుండటంతో సత్యకి ఎనలేని ఆనందం. అప్పటికే, ఎయిడ్స్ అనే ఒక పెద్ద మహమ్మారి దేశం మొత్తం అల్లకల్లోలం స్పృష్టిస్తుంది. ఎయిడ్స్ నుంచి ప్రజలని బయట పడేయటానికి, అవేర్ నెస్ కలిగించే ప్రయత్నం చేస్తాడు నౌకరి. ఆ ఊరి ప్రజలకి అవగాహన లేకపోవడంతో పాటు నౌకరికి ఎదురు వెళ్తారు. ఆ బాధ భరించ లేక, కట్టుకున్న భార్య కూడా వదిలేసి వెళ్ళిపోతుంది? ఆ ఊరి సర్పంచ్ ‘తనికెళ్ళ భరణి’ నౌకరికి కీడు చేశాడా? మేలు చేశాడా? ఎన్ని అడ్డంకులు వచ్చిన ‘సర్కారు నౌకరి’ ప్రజలకి మేలు చేశాడా? లేదంటే మధ్యలోనే ఆపేశాడా? తన స్నేహితుడు శివ (మహాదేవ్)కు ఎదురైన సమస్య ఏమిటి? చివరికి తన పెళ్ళాం తిరిగి వచ్చిందా? శివ, గంగ (మధులత) పెళ్లికి ఎలాంటి విషయం అడ్డంకిగా మారింది అనే ప్రశ్నలకు సమాధానమే సర్కారు నౌకరి సినిమా కథ.
కథనం, విశ్లేషణ:
2023 ఏడాదిలో రూట్ లేవెల్ వచ్చిన మూవీస్ బాగా ఆకట్టుకున్నాయి. అదే కోవలోకి ‘సర్కారు నౌకరి’ మనముందుకు వచ్చింది. 1996లో కొల్లాపూర్ లో జరిగిన కొన్ని యదార్థ సంఘటనలు ఆధారంగా ఎయిడ్స్ బ్యాక్డ్రాప్ లో ఈ చిత్రం తెరకెక్కింది. దర్శకుడు ఇలాంటి, కథ ఈ తరానికి బాగా కనెక్ట్ అవ్వుతారు అని ఊహించిన విధానం బాగుంది. కాకపోతే స్టోరీ ని గ్రిప్పింగ్ గా చెప్తూ, బలమైన ఎమోషన్స్ ని ఆడియెన్స్ కి కనెక్ట్ అయ్యేలా చేశాడా లేదా అనేది తేలియాలిసి ఉంది?
మొదటి భాగం:
సత్య & గోపాల్ మధ్య సాగే మ్యారేజ్ సాంగ్ & కెమిస్ట్రీ ఆకట్టుకుంటుంది. మహమ్మారి నుండి ప్రజలు భారిన పడకూడదని హీరో గోపాల్ చేసే ప్రయత్నాలు పెద్దగా ఆకట్టుకోకపోవడంతో పాటు బోరింగ్ గా అనిపిస్తాయి. ప్రయత్నాలు చేసే ప్రోసెస్ లో కామిడి గా కొన్ని సీన్స్ ట్రై చేసినప్పటికీ ఫలితం లభించలేదు. గోపాల్ భోజనం చేస్తున్న సమయంలో వచ్చే సీన్‌లో హీరో, హీరోయిన్లు బాగా నటించారు. ఇంటర్వెల్ సీన్ హైలైట్.
రెండొవ భాగం:
గంగ(మధులత) & శివ కాంబినేషన్ సాంగ్ ‘రాఘవేంద్ర రావు’ గారి ఫ్లేవర్ కనిపిస్తుంది. హీరో గోపాల్ కి అతి దగ్గర వ్యక్తులు కోల్పోయిన సీన్స్ లో ప్రతి ఒక్క ఆర్టిస్ట్ అద్భుతంగా చేశారు. కాస్త, తనికెళ్ళ భరణి సీన్స్ ఊరట ఇచ్చిన సరైన డైలాగ్స్ పడకపోవడం. సాహితి దాసరి ‘కి’ రోల్ పోషించి యాక్టింగ్ బాగా చేసినప్పటికీ, దర్శకుడు సీన్ ని పండించలేకపోవటం కాస్త నిరాశపరిచింది. ఏదైమైనప్పటికీ ఈ సినిమాని థియేటర్ లో కన్నా, ఓటిటి లో ఎక్కువ ఎంజాయ్ చేసే అవకాశం ఉంది.
నటీనటులు పెర్ఫామెన్స్:
ప్రముఖ సింగర్ సునీత కుమారుడు ‘ఆకాష్ గోపరాజు’ సర్కారు నౌకరిగా యాప్ట్ అయ్యారు. తనకున్న యాక్టింగ్ సామర్థ్యంలో నటించి బాగా మెప్పించినప్పటికీ, యాక్టింగ్ లో అనుభవం పెరిగిన కొద్ది మంచి నటుడు గా అయ్యే అవకాశం పుష్కలంగా కనిపిస్తున్నాయి. హీరోయిన్ ‘భావన’ అచ్ఛం తెలుగింటి ఆడపడుచులా అందంగా కనిపిస్తూనే, భార్య గా కట్టుకున్న నౌకరిని హడలెత్తిస్తుంది. ‘మధులత’ స్క్రీన్ స్పేస్ తక్కువే కానీ, నా పెర్ఫామెన్స్ తక్కువ కాదు అనేలా ఎమోషన్ సిక్వెన్స్ లో ఏడిపించేలా చేసింది. ఈ అమ్మడికి హీరోయిన్ గా మంచి భవిషత్తు ఉంది. తనికెళ్ళ భరణి ‘కి’ రోల్ పోషించారు. తదితర ఆర్టిస్టులు తమ పరిధి మేరకు బాగా రాణించారు.
సాంకేతిక విభాగం:
ఎయిడ్స్ బ్యాక్డ్రాప్ లో జరిగిన ఒక రియలిస్టిక్ కథని, దర్శకుడు ‘గంగనమోని శేఖర్’ ఈ తరం ప్రేక్షకులకి కళ్ళకి కట్టినట్టు చూపించాలి అనుకోవడం ప్రశంసనియం. కాకపోతే, సినిమాలో ప్రధానంగా బలమైన ఎమోషన్స్ ని పండించలేకపోవడం నిరాశపరిచిందనే చెప్పాలి. ‘సురేష్ బొబ్బిలి’, అందించిన ‘ఆర్ఆర్’ సినిమాకు అస్సెట్. అలాగే, సాంగ్స్ చాలా చక్కగా తీర్చిదిద్దారు. కెమేరామ్యాన్ ‘గంగనమోని శేఖర్’ విజ్యువల్స్ ఆకట్టుకున్నాయి. ఎడిటింగ్ పనితీరు బాగుంది. నిర్మాణ విలువలు ఓ మేరకు పర్వాలేదు.
రివ్యూ బై: తిరుమలశెట్టి వెంకటేష్
గమనిక: మేము రాసే రివ్యూలు ఒక వ్యక్తి కి లేదా, సంస్థ కి అనుకూలంగా కానీ, ఒకరిని ఉద్దేశించి కానీ రాసింది కాదు. కేవలం, మా రివ్యూర్ అభిప్రాయం మాత్రమే. మీరు పెట్టిన ఎఫర్ట్స్ ప్రశంసనీయం. మీరు అందించిన ఈ చిత్రం థియేటర్ లో సక్సెస్ ఫుల్ గా రన్ అవ్వాలని కోరుకుంటున్నాం.