‘ప్రేమ కథ’ మూవీ రివ్యూ
చిత్రం: ‘ప్రేమ కథ’
రేటింగ్: 3/5
బాటమ్ లైన్: “Tune of Love: A Harmonious Narrative”
విడుదల తేదీ: జనవరి 5, 2024
నటి నటులు: కిషోర్ శాంతి, దియా సీతపల్లి, రాజ్ తిరండసు, వినయ్ మహాదేవ్, నేత్ర రెడ్డి తదితరులు….
డీఓపీ: వాసు పెండెం
ఎడిటర్: ఆలయం అనిల్
సంగీతం: రధన్
బ్యానర్: టంగా ప్రొడక్షన్స్, సినీ వాలి మూవీస్
నిర్మాత: విజయ్ మట్టపల్లి, సుశీల్ వాజప్ప్పిలి, సింగనమల కళ్యాణ్
కథ, కధనం, దర్శకుడు: శివశక్తి రెడ్ డి
‘కిషోర్ శాంతి’ హీరోగా, ‘దియా సీతపల్లి’ హీరోయిన్ గా నటించిన చిత్రం ‘ప్రేమ కథ’. శివశక్తి రెడ్ డి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ‘టంగా ప్రొడక్షన్స్, సినీ వాలి మూవీస్’ బ్యానర్ పై విజయ్ మట్టపల్లి, సుశీల్ వాజప్ప్పిలి, సింగనమల కళ్యాణ్ సంయుక్తంగా నిర్మించారు. ఎటువంటి అంచనాలు లేకుండా అందరు కొత్త వాళ్ళతో ఎటెంప్ట్ చేసిన ‘ప్రేమ కథ’ సినిమా శుక్రవారం జనవరి 5న గ్రాండ్ గా థియేటర్ లో రీలిజ్ అయ్యింది. మరి, ఈ సినిమా సగటు ప్రేక్షకుడిని ఏ విధంగా ఆకట్టుకోనుందో విశ్లేషుకుడి మాటల్లో తెలుసుకుందాం!!
కథ:
ప్రేమ్(కిషోర్ శాంతి) తండ్రి చనిపోవటంతో తన ఫ్యామిలీని పోషించడం కోసం, ఊరిని వదిలి ఉద్యోగ రిత్య ‘హరి ఓం’ ఫ్యాక్టరీ లో వినయ్ మహాదేవ్ (యాదవ్)తో పాటు పనిచేస్తాడు. తన ఫ్రెండ్ యాదవ్ & సరోజ(నేత్ర రెడ్డి) లవ్ లో ఉన్న వీళ్లిద్దరికీ ‘దియా సీతపల్లి’ & ప్రేమ్(కిషోర్ శాంతి) సపోర్ట్ చేస్తారు. అలా వీళ్ళ లవ్ కి సపోర్ట్ చేస్తున్న ప్రోసెస్ లో, ‘దియా’ కి ‘ప్రేమ్’ ఐ లవ్ యు చెప్పగా, చెంపతో మొదలైన వీళ్లిద్దరి పరిచయం ప్రేమగా ఎలా మారింది? ప్రేమలో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకున్నారు? చివరికి ఇద్దరు కలిసారా లేదా? ప్రేమ్ లవ్ గెలిపించడం కోసం తన ఫ్రెండ్స్ ఏం చేసారు? అనేది కథ?
కథనం, విశ్లేషణ: కొత్త సంవత్సరం లో వచ్చిన మొదటి ‘ప్రేమ కథ’. ఎన్ని దశాబ్దాలు గడిచిన లవ్ సినిమాలకి చాలా ప్రత్యేకత ఉంటుంది. ఎందుకంటే, ప్రేమలో పడితే ఆ అనుభవం వేరు. అది అనుభవిస్తే గాని అనుభవం గురించి చెప్పలేం. అలాంటి సినిమానే ఈ ‘ప్రేమ కథ’. కాస్త, కథని కొత్తగా చెప్పగలిగి ఆడియెన్స్ కి నచ్చితే సినిమా కి తిరుగు లేదు.
సినిమా ఓపినింగ్ లో దియా(హీరోయిన్) అన్నయ్య తన ఫ్రెండ్స్ కలిసి ప్రేమ్(కిషోర్ శాంతి)ని కొడతారు. ఆ దెబ్బలతో ‘ప్రేమ్’ పిచ్చొడిలా బాధ పడుతుండటం చుసిన తన ఫ్రెండ్ ‘యాదవ్'(వినయ్ మహాదేవ్) ట్రీట్ మెంట్ చేయిస్తుండగా ఫ్లాష్ బ్యాక్ కి వెళ్తాడు. సినిమా అంత నాన్ లీనియర్ లో కథ నడుస్తుంది. ప్రేమ్ కి, దియా కి మధ్య వచ్చే లవ్ సీన్స్ తో పాటు, లవ్ సాంగ్స్ సినిమాకి హైలైట్. కాకపోతే, సీన్స్ కాస్త సాగదీత గా అనిపిస్తాయి. అక్కడక్కడ ప్రేమ్ చెప్పే డైలాగ్స్ హీరో నాగ చైతన్య చెప్తున్నాడా ఏంటి అనిపిస్తుంది. సినిమా మధ్యలో సరోజ (నేత్ర రెడ్డి) డైలాగ్స్ చాలా ఫన్నీ గా ఆకట్టుకుంటాయి. పడవలో సాగే సీక్వెన్స్ విజ్యువల్స్ కనువిందు గా ఉంటాయి. సినిమా చూస్తున్నంత సేపు మలయాళం ఫ్లేవర్ కనిపిస్తుంది. ప్రేమ్ కి తీవ్రంగా దెబ్బలు తాకడంతో తన ఫ్రెండ్స్ అందరు గ్యాధర్ అవ్వుతారు. అందరు గ్యాధర్ అవ్వడంతో యాదవ్ ఫ్రెండ్స్ & శంకర్ ఫ్రెండ్స్ కి మధ్య అంతర యుద్ధం నడుస్తుంటుంది. ఆ సీన్స్ థియేటర్ లో ‘ఐ ఫీస్ట్’ గా అనిపిస్తాయి. ఇకపోతే, క్లైమాక్స్ సూపర్బ్.
నటీనటులు:
‘కిషోర్ శాంతి'(ప్రేమ్) క్యారెక్టర్ లో చాలా సహజంగా నటించి మెప్పించాడు. సరైన సినిమాలు పడితే మంచి నటుడుగా అయ్యే లక్షణాలు కనిపిస్తున్నాయి. ‘దియా సీతపల్లి’ తెలుగు తెరకి కొత్త అయ్యినప్పటికీ ఎక్సట్రాడినరి గా పెర్ఫామెన్స్ చేసింది. కొన్ని ఫ్రెమ్స్ లో కొరియన్ హీరోయిన్ లా తలపించింది. ‘రాజ్ తిరండసు’ హీరో కి కొలీగ్ పాత్రలో నటించి సీన్స్ ని రక్తి కట్టించాడు. ‘వినయ్ మహాదేవ్’ హీరోకి బెస్ట్ ఫ్రెండ్ రోల్ చేస్తూనే కథని చాలా బలోపేతం చేసాడు. ‘నేత్ర రెడ్డి’ తెలంగాణ బిడ్డ లా నటించి ‘పిస పిస’ చేయకంటూ డైలాగ్స్ తో అదరకొట్టింది. తదితరులు తమ పరిధి మేరకు నటించారు.
సాంకేతిక విభాగం:
దర్శకుడు ‘శివశక్తి రెడ్ డి’ ఎంచుకున్న కథ పాతదే అయ్యినప్పటికీ ‘ప్రేమ కథ’ని కొత్తగా చెప్పటానికి చేసిన ప్రయత్నం బాగుంది. కాకపోతే, లవ్ సన్నివేశాలని విపరీతంగా సాగతీయడం సినిమాకి పెద్ద మైనస్. రధన్ అందించిన ‘ఆర్ఆర్’ సినిమాకు అస్సెట్. సీన్స్ తో పాటు వచ్చే లవ్ సాంగ్స్ సూపర్. కెమేరామ్యాన్ ‘వాసు పెండెం’ విజ్యువల్స్ ఆకట్టుకున్నాయి. ఎడిటింగ్ పనితీరు బాగుంది. నిర్మాణ విలువలు ఓ మేరకు పర్వాలేదు.
రివ్యూ బై: తిరుమలశెట్టి వెంకటేష్
గమనిక: మేము రాసే రివ్యూలు ఒక వ్యక్తి కి లేదా, సంస్థ కి అనుకూలంగా కానీ, ఒకరిని ఉద్దేశించి కానీ రాసింది కాదు. కేవలం, మా రివ్యూర్ అభిప్రాయం మాత్రమే. మీరు పెట్టిన ఎఫర్ట్స్ ప్రశంసనీయం. మీరు అందించిన ఈ చిత్రం థియేటర్ లో సక్సెస్ ఫుల్ గా రన్ అవ్వాలని కోరుకుంటున్నాం.