- Advertisement -spot_img
HomeUncategorizedThe Raja Saab Poster Review: ప్రభాస్ "ది రాజా సాబ్"

The Raja Saab Poster Review: ప్రభాస్ “ది రాజా సాబ్”

- Advertisement -spot_img

పాన్ వరల్డ్ స్టార్ రెబల్ స్టార్ ప్రభాస్ చాలా సంవత్సరాల తరువాత సలార్ ద్వారా విజయ బాటలోకి అడుగుపెట్టారు. ఆయన బాహుబలి తరువాత చేసిన ఏ ఒక్క చిత్రం కూడా అందరి ప్రశంసలు అందుకోలేకపోయింది . కారణాలు ఏమయినప్పటికీ సాహో కి తప్ప మిగతా రెండు చిత్రాలకి ఎలాంటి గొప్ప వసూళ్లు కూడా రాబట్టలేకపోయాయి . ఏది ఏమైనప్పటికి ప్రశాంత్ నీల్ ద్వారా ప్రభాస్ అభిమానులకి ఊరట కలిగింది సలార్ రూపంలో. ఈ చిత్రానికి తదుపరి భాగం ఉన్నపటికీ ఈ మధ్యలో ప్రభాస్ నుంచి రెండు చిత్రాలు విడుదల అయ్యే అవకాశం ఉన్నది. దానిలో ఒకటి దర్శకుడు మారుతీ తీస్తున్న చిత్రం . మారుతీ గారి నుంచి వచ్చిన గత కొన్ని చిత్రాలు ఆశించిన రీతిలో ప్రశంసలు రాకపోయినప్పటికీ ప్రభాస్ తన అభిమానులకి తనలోని నటనా సామర్ధ్యం చూపించ తలచినట్టు అనిపిస్తోంది. యాక్షన్ చిత్రాలకి సరిపోయే దేహం కలిగిన ప్రభాస్, అభిమానులని అలరించటానికి ఈసారి హార్రర్ కామెడీ చిత్రంతో రాబోతున్నారు. చాలా కలం నిరీక్షణ తరువాత ఈ చిత్రానికి సంబందించిన మొదటి సమాచారం ఈ రోజు సంక్రాంతి సందర్భంగా చిత్ర బృందం విడుదల చేసింది.

ఈ చిత్రం గురించి అధికారకంగా ప్రకటించినప్పటినుంచీ , సోషల్ మీడియా లో ప్రభాస్ లుక్ ఒకటి లీక్ అయ్యింది. ఆ లుక్ ప్రకారం లవర్ బాయ్ గా కనిపిస్తున్నప్పటికీ ఎలాంటి అదనపు సమాచారం చిత్ర బృందం నుంచి వెలువడలేదు . చిత్రం పేరు “రాజా డీలక్స్” అని కూడా ప్రచారం జరిగింది. కొంతమంది ఈ చిత్రం ఆగిపోయిందేమో అని కూడా అనుకున్నారు. కానీ మొత్తానికి ఈరోజు నీలం నలుపు కలగలిపిన రంగు కుర్తా చారల లుంగీ కట్టుతో కొత్తగా కనిపించారు. లుక్ ఒక్కటే కాకుండా అభిమానులకోసం మొత్తానికి చిత్రం పేరుని “ది రాజా సాబ్” గా వెల్లడించారు . ప్రభాస్ లుక్ మరియు టైటిల్ పోస్టర్ విడుదల చేసారు . ప్రపంచ వ్యాప్త ప్రభాస్ అభిమానులు ఈ లుక్ తో పండగ సంబరాలు చేసుకుంటున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ద్వారా టి.జి.విశ్వ ప్రసాద్ గారు నిర్మిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు, తమిళ నటి మాళవికా మోహనన్ ప్రభాస్ సరసన నాయికగా నటిస్తున్నారు. తమిళ హాస్య నటుడు యోగి బాబు మొదటిసారి తెలుగులో చేస్తున్నారు . త్వరలో విడుదల తేదీతో పాటుగా నటీనటుల వివరాలు, సాంకేతిక నిపుణుల వివరాలు తెలిపే అవకాశం ఉంది. పాన్ ఇండియా చిత్రంగా అయిదు భాషల్లో విడుదల అవ్వబోతోంది. వేచిచూడాలి మొదటిసారి ప్రభాస్ గారిని ఇలాంటి పాత్రలో ఎలా చూపించబోతున్నారో.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Stay Connected
44,085FansLike
65,000FollowersFollow
52,453SubscribersSubscribe
Must Read
- Advertisement -spot_img
Related News
- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

You cannot copy content of this page