- Advertisement -spot_img
HomeUncategorizedViswambhara : చిరూకి తన పూర్వ వైభవం దక్కేనా

Viswambhara : చిరూకి తన పూర్వ వైభవం దక్కేనా

- Advertisement -spot_img

కళ కళాకారులని వెతుక్కుంటూ వెళుతుంది అనేదానికి నిదర్శనం దర్శకుడు వసిష్ఠ . తనకి ఉన్న దర్శకత్వ ప్రతిభని తన మొదటి చిత్రం అయిన బింబిసారా తో నిరూపించుకున్నారు. ఇప్పుడు రెండవ చిత్రం మెగా స్టార్ చిరంజీవి గారితో చేస్తున్నారు . ఖైదీ నం:150 తరువాత గత ఏడాది సంక్రాంతికి విడుదల అయిన వాల్తేరు వీరయ్య దాకా చిరు గారికి మంచి విజయం లేదు . అదే విజయం భోళా శంకర్ తో కొనసాగుతుంది ఏమో అని అనుకుంటే అది ఘోరంగా నిరాశ పరిచింది. ఈ తరుణంలో ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా చిరు అభిమానులకి వెయ్యి రెట్లు పండగ చేసుకునే విశేషం ఒకటి దొరికింది . అదే చిరు తదుపరి చిత్రం వివరాలు. దర్శకుడు వసిష్ఠ తో ఒక సోషియో ఫాంటసీ చిత్రం ఒప్పందం కుదుర్చుకున్నారు చిరు గారు ఇదివరకే. కానీ దానికి సంబందించిన తదుపరి సమాచారం ఇప్పటిదాకా వెలువడలేదు . మొత్తానికి ఈ సంక్రాంతి సందర్భంగా అభిమానులకి విందుగా చిత్రం యొక్క టైటిల్ టీజర్ విడుదల చేసారు సినిమా బృందం . చిత్రం పేరు “విశ్వంభర” గా ధ్రువీకరించారు , పోస్టర్ వీడియో ద్వారా .

ఇలాంటి సోషియో ఫాంటసీ తరహా చిత్రాలు ఇదివరకు చాలానే మన తెలుగులో వచ్చినప్పటికీ చిరు గారు చేసినవి కొద్దిపాటివే . ఈ మధ్య చిరూ గారి నుంచి వస్తున్నా రీమేక్ చిత్రాలని చూసి అభిమానులే కాదు , సగటు ప్రేక్షకుడు కూడా విసిగిపోయాడు . అలంటి తరుణంలో, ఆల్చిప్పతో సహా దొరికిన ముత్యం లాగా ప్రత్యక్షం అయ్యారు వాసిష్ట గారు . ఈ టైటిల్ రివీల్ వీడియో లో కాన్సెప్ట్ కూడా చూపించి అలరించారు. మ్యూజిక్ అద్భుతంగా ఉంది , గ్రాఫిక్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి . ఈ చిత్రానికి సంబంధించి మొత్తం సమాచారం లేనప్పటికీ నిర్మాత సంస్థ యు.వి. క్రియేషన్స్ తమ బ్యానర్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది . ప్రమోద్ , వంశీ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఆస్కార్ సంగీత దర్శకులు యం.యం.కీరవాణి సంగీతం అందిస్తున్నారు , చోటా.కె.నాయుడు గారు ఛాయాగ్రాహకులుగా పనిచేస్తున్నారు , ఆర్ట్ డైరెక్టర్ గా ఏ.ఎస్. ప్రకాష్ గారు బాధ్యతలు చేపట్టారు . వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా ఈ చిత్రం విడుదల అవ్వబోతోంది . మొత్తానికి కొత్త తరహా చిత్రంతో వస్తున్న చిరూ గారికి తన పూర్వ వైభవం వస్తుందనే ఆశిద్దాం.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Stay Connected
44,085FansLike
65,000FollowersFollow
52,453SubscribersSubscribe
Must Read
- Advertisement -spot_img
Related News
- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

You cannot copy content of this page