కళాకారులకి అందంతో పాటుగా ఆకృతిని అన్నివేళలా సరైన రీతితో చూసుకోవటం చాలా అవసరం. ముఖ్యంగా ఆహారం విషయంలో తగు జాగ్రత్తలు పాటించాలి. వయసు పైబడుతున్న కొద్దీ జాగ్రత్తలు ఇంకా పెరుగుతూనే ఉంటాయి. మన హీరోలు అయితే పాత్ర కోసం, అభిమానులని నిరాశపరచకూడదు అనే ఉద్దేశంతోనే ఎప్పుడూ కొత్తగా ప్రయత్నిస్తూ ఉంటారు. రెండు వరుస పరాజయాల తరువాత మన మెగా స్టార్ చిరంజీవి గారి చిత్రం, బింబిసారా దర్శకుడు వాసిష్ఠ తో మొదలయ్యింది . చిత్రానికి “విశ్వంభరా” అనే నామకరణం కూడా చేసారు . ఇప్పుడు ఈ చిత్రం కోసం మన చిరూ గారు పడుతున్న శ్రమ చూసి అందరూ ఆశ్చర్య పోతున్నారు.
కిందకి నెలలో ఈ చిత్రం పూజా కార్యక్రమాలు జరిగాయని తెలిసిన విషయమే. కానీ అప్పటినుంచి చిత్ర బృందం నుంచి ఎలాంటి సమాచారం లేకపోవటం అభిమానులని కలవరపెడుతోంది . తమ అభిమాన నటుడికి ఇప్పుడు అత్యవసరమైన చిత్రం ఇది. మళ్ళీ గెలుపుబాటలోకి రావాలంటే ఈ చిత్రం అత్యద్భుతంగా ఉండాలి. చిరు గెటప్ ఎలా ఉండబోతోంది అని అందరూ ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు చిరూ గారు ఈ చిత్రంకోసం కసరత్తులు చేసే వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో హల్చల్ చేస్తోంది . 68 ఏళ్ళ వయసులో కూడా ఇలాంటి కఠినమైన కసరత్తులు చెయ్యటం చూసి అభిమానుల సంతోషానికి అవధులు లేవు . ఇంత వయసులోకూడా కుర్ర హీరోలకి పోటీ ఇస్తున్నట్టు నిరూపించుకుంటున్నారు ఆయన. ఏది ఏమైనా మెగా స్టార్ , మెగా స్టారే అని నిరూపించుకుంటున్నారు చిరూ గారు. వేచి చూడాల్సిన సమయం రానే వచ్చింది . ఇంత కఠినమైన శిక్షణ ఎంతవరకు చిత్రానికి ఉపయోగ పడుతుందో.