“భోళాశంకర్” వంటి ఘోరా పరాజయం తర్వాత మెగాస్టార్ హీరో గా “బింబిసార” ఫేమ్ వశిష్ఠ మల్లిడి దర్శకత్వంలో తన 156వ చిత్రంలో నటిస్తున్నారు. యూ.వి.క్రియేషన్స్ బ్యానర్ లో వంశి ప్రమోద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా ఈ చిత్రానికి “విశ్వంభర” అనే టైటిల్ ని తాజాగా ఖరారు చేసారు. వచ్చే సంవత్సరం జనవరి 10న సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ సినిమాని మెగాస్టార్ కెరీర్ లోనే అతంత్య భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. దాదాపు 18సంవత్సరాల తర్వాత త్రిష మెగాస్టార్ తో జతకట్టబోతుంది. కాగా తాజాగా ఈ సినిమాకి సంభందించి ఒక ఇంట్రస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది.
అదేంటంటే “విశ్వంభర” అనే టైటిల్ తో 2017లో ఓ వెబ్ సిరీస్ తెరకెక్కించి యూట్యూబ్ లో ట్రైలర్ వదిలారు. కాకపోతే, ఆ వెబ్ సిరీస్ సోసియో ఫాంటసీ కాగా, గ్రాఫిక్స్ కి బడ్జెట్ పెరిగి మధ్యలోనే ఆగిపోయిందని వినికిడి. పైగా, 2017టైం లో వెబ్ సిరీస్ కి తెలుగు లో అంతగా ఆదరణ లేకపోవడంతో ఎవరికీ దీని గురించి తెలియదు.
ప్రస్తుతం తెరకెక్కుతున్న మెగాస్టార్ “విశ్వంభర” కధ, ఈ వెబ్ సిరీస్ కధ రెండు ఒక్కటే అని, దర్శకుడు ‘వశిష్ఠ మల్లాడి’ ఈ వెబ్ సిరీస్ ఆధారం గానే, ఈ సినిమా కధను తెరకెక్కించబోతున్నారు అని ఇండస్ట్రీ లో టాక్ ఆఫ్ ది టౌన్.
పైగా ఈ వెబ్ సిరీస్ టైటిల్, ఈ సినిమా టైటిల్ రెండు ఒక్కటే కావడం, రెండూ సోసియో ఫాంటసీ కధలే అవ్వడంతో ఈ రూమర్స్ నిజం అనే అనుమానం మరింత పెరిగింది సగటు ప్రేక్షకుడికి. మరి ఇది ఎంత వరకు నిజమో తెలియాలి అంటే సినిమా రిలీజ్ వరకు ఆగాల్సిందే. ఒకవేళ ఇదే గనుక నిజం ఐతే మెగాస్టార్ ఖాతాలో మరో రీమేక్ చేరినట్టే….