మూవీ: “ట్రూ లవర్”
రేటింగ్: 2.75/5
బాటమ్ లైన్: “Explore the depths of True Love (2024). An emotional saga that Resonates with Audiences”.
తారాగణం: మణికందన్, గౌరీ ప్రియ, కన్నా రవి, శరవణన్, గీతా కైలాసం, హరీష్ కుమార్, నిఖిలా శంకర్, రిని, పింటూ పాండు, అరుణాచలేశ్వరన్
సంగీతం: సీన్ రోల్డన్
డిఓపి: శ్రేయాస్ కృష్ణ
ఎడిటర్: భరత్ విక్రమన్
మారుతి టీమ్ ప్రొడక్ట్, మాస్ మూవీ మేకర్స్ సమర్పిస్తున్నారు.
విడుదల: ఎస్.కె.ఎన్.
బ్యానర్: మిలియన్ డాలర్ స్టూడియోస్, ఎంఆర్పీ ఎంటర్టైన్మెంట్
నిర్మాతలు: నజరత్ పసిలియన్, మగేష్ రాజ్ పసిలియన్, యువరాజ్ గణేశన్
రచన, దర్శకత్వం: ప్రభురామ్ వ్యాస్
‘రైటర్ పద్మభూషణ్’, ‘మ్యాడ్’ ఫేమ్ శ్రీ గౌరీ ప్రియా, మణికందన్, జంటగా నటించిన చిత్రం ‘లవర్’. ఇది తమిళ్ చిత్రం అయ్యినప్పటికీ, ‘కథ’ యూత్ కి ఆకట్టుకునే అంశాలు ఉండటంతో తెలుగు లో ఈ చిత్రాన్ని ‘ట్రూ లవర్’ పేరుతో మారుతి, ఎస్కేఎన్ సంయుక్తంగా విడుదల చేశారు. ప్రభురామ్ వ్యాస్ దర్శకత్వంలో నజేరత్ పసీలియన్, మగేష్ రాజ్ పసీలియన్, యువరాజ్ గణేషన్ నిర్మించారు. ఇప్పటికే రీలిజ్ అయ్యిన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
కథ: అరుణ్(మణికందన్), దివ్య(గౌరి ప్రియ) కాలేజీ రోజులు నుంచి గొడవపడుతూ, విడిపోతూ, కలిసిపోతూ, ప్రేమలో మునిగిపోతూ అలా ఆరేళ్లు గడిపేస్తారు. అరుణ్ ఓ ‘కేఫ్’ బిజినెస్ స్టార్ట్ చేయాలని ట్రై చేస్తూనే, ఒక పక్క తాగుడుకి బానిస అవ్వుతాడు, కాస్త అనుమానం కూడా ఎక్కువే. అయ్యితే ‘దివ్య’ ఓ కంపెనీలో పని చేస్తుంటుంది. అరుణ్ కి దివ్య ఫ్రెండ్స్ నచ్చరు. వాళ్ళతో నే సమయం గడపడం, అరుణ్ కి అబద్దాలు చెప్పి తన ఫ్రెండ్స్ తో బయటికి వెళ్లడం చేస్తుంటుంది. దాంతో, వీరిద్దరి మధ్య గొడవ ముదురుతుంది. ఇలా, ప్రతి సారి ఏదొక విషయంలో ఇద్దరి మధ్య గొడవలు వస్తుంటాయి. దివ్య ఒక దశలో అరుణ్ ని వదిలేయ్యాలి అని ఫిక్స్ అవ్వుతుంది. ‘దివ్య’ ఆఫీస్ ఫ్రెండ్స్ తో ‘గోకర్ణ’ ట్రిప్ కి వెళ్ళాలి అనుకుంటారు. ఆ టైమ్ లో, దివ్య కి బర్త్ డే విషెస్ చెప్పడానికి వచ్చిన అరుణ్ వాళ్ళతో ట్రిప్ లో జాయిన్ అవ్వుతాడు. దివ్య, అరుణ్ కి అబద్దాలు చెప్పి తప్పించుకుంటూ ఎందుకు తిరుగుతుంది? ట్రిప్ కి ముందే చెడిన వీళ్ళ లవ్ ట్రిప్ కి ఎందుకు కలిసి వెళ్లారు? అసలు ‘గోకర్ణ’ లో ట్రిప్ లో ఏమైంది? దివ్య, అరుణ్ చివరికి కలిసారా? అనే విషయాలు తెలియాలి అంటే మీరు ఖచ్చితంగా సినిమా చుడాలిసిందే?
విశ్లేషణ: ప్రేమ…ప్రేమ…ప్రేమ…ఆ పదాల్లోనే ఎదో తెలియని ఒక అనుభూతి ఉంటుంది. అనుభవిస్తే గాని తెలియదు. ప్రేమ కొంత మందికి తీపి అనుభవాన్ని ఇస్తే, మరి కొంత మందికి చేదు అనుభవాన్ని ఇస్తుంది. ఏదైమైనప్పటికీ, ప్రతి ఒక్కరిని ఆకర్షించే ప్రేమ కథలు ప్రేక్షకులకి ఎప్పుడు ఒక కొత్త అభిరుచిని ఇస్తుంది. అదే కోవలోకి చెందిన ప్రేమ ‘ట్రూ లవ్’. ‘ప్రేమ నమ్మకం’….’అనుమానం సమాధి’ అనే కథాంశంతో తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాని తెరకెక్కించారు ప్రభురామ్ వ్యాస్. సినిమా ఎలా ఉందంటే?
‘ట్రూ లవర్’ సినిమాలో హీరో, హీరోయిన్ క్యారెక్టర్ కి ప్రతి ఒక్కరు కనెక్ట్ అవ్వుతారు. అలాగే సినిమాలో వచ్చే కొన్ని సన్నివేశాలు యూత్ ని బాగా ఆకర్షిస్తాయి. కొన్ని సీన్స్ కి ప్రేక్షకులు విజిల్స్ వేయడం ఖాయం. హీరో, తల్లి క్యారెక్టరైజేషన్ కొన్ని సన్నివేశాలు రాసిన తీరు బాగుంది. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే సెటిల్ అవుతాడనే తల్లి ఆలోచన ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. బాయ్ ఫ్రెండ్ కి ఒక అందమైన లవర్ ఉన్నప్పుడు, అబ్బాయిలు అభద్రత భావానికి ఎలా లోనవ్వుతారు. అమ్మాయిలు, అబ్బాయిలకి దగ్గరైనట్టే అయ్యి, ఎలా దూరం అవ్వుతారు. అలాంటి, సమయాల్లో అబ్బాయిల ప్రాణం గిలా, గిలా ఎలా కొట్టేసుకుంటుంది సన్నివేశాలు సూపర్బ్ గా ఉంటాయి. హీరో యాటిట్యూడ్, హీరో & హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ అదుర్స్.
సినిమా ప్రారంభంలో కథ కొంత ఆసక్తిగా సాగిన, రిపీటెడ్ సన్నివేశాలతో విసిగిస్తుంది. అసలు ప్రేమ ఎలా, ఎప్పుడు, ఎందుకు పుడుతుందో ఇప్పటికి ఎప్పటికి అంతు పట్టని ప్రశ్నయే? కాకపోతే, అబ్బాయితో సమస్యలు ఉన్నప్పటికీ, దివ్య ఎందుకు రిలేషన్ కంటిన్యూ చేస్తుంది అనేది ప్రస్నార్ధకంగా మారింది? సినిమా తమిళ్ ఫ్లేవర్ అయ్యినప్పటికీ ప్రేమ కథలు ఒక్కటే అని నిరూపించాడు దర్శకుడు….సో, మీరు మీ ఫ్యామిలీ తో ఖచ్చితంగా సినిమా చుడాలిసిందే.
నటి నటులు పెర్ఫామెన్స్: తమిళ సినిమా కావడంతో అందరు తమిళ నటులే. కాకపోతే, సినిమా మొత్తంలో హీరో, హీరోయిన్ ల పాత్రలు గురించి చెప్పాలి. తమిళ్ హీరో ‘మణికందన్’ ఒక ఈజ్ ఉన్న నటుడు, ఏదైనా క్యారెక్టర్ ఇస్తే, ఇట్టే పరకాయ ప్రవేశం చేస్తాడు. అదే విధంగా, ‘ట్రూ లవ్’ సినిమాలో కూడా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఫ్యూచర్ లో ఒక ధనుష్, విజయ్ సేతుపతి సరసన నటన విషయంలో నిలిచే అవకాశం పుష్కలంగా ఉన్నాయి. ‘శ్రీ గౌరీ ప్రియా’ ఒక తెలుగు అమ్మాయి, తెలుగు లో ఆల్రెడీ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు ‘ట్రూ లవ్’లో తను చేసిన యాక్టింగ్ కి అబ్బాయిలు క్లీన్ బౌల్డ్. ఇక, తమిళ్ లో కూడా వరుస అవకాశాలు వచ్చిన ఆశ్చర్య పోనక్కర్లేదు. ఇక హీరో, హీరోయిన్ ఫ్రెండ్స్ గ్యాంగ్ తమ పరిధి మేరకు బాగానే రాణించారు.
సాంకేతిక విభాగం: దర్శకుడు ‘ప్రభురామ్ వ్యాస్’ బడ్జెట్ ని దృష్టి లో పెట్టుకొని, యూత్ ని ఆకట్టుకునే అంశాలను గ్రిప్పింగ్ రాసుకోవడంలో సూపర్బ్ అనిపించుకున్నాడు. కాకపోతే, అక్కడక్కడ వచ్చే కొన్ని సీన్స్ ల్యాగ్ ఉన్నాయి. సినిమాటోగ్రఫీ విజువల్స్ బ్రిలియంట్. సీన్స్ లో చాలా వరుకు లైట్స్ వాడకుండా న్యాచురల్ లైటింగ్ కి ప్రాధాన్యత ఇచ్చారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాకి ప్రధాన బలం. అసలు, మ్యూజిక్ కోసం సినిమా చూడచ్చు. ఎడిటర్ పనితీరు పర్వాలేదు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.
రివ్యూ బై: తిరుమలశెట్టి వెంకటేష్
గమనిక: మేము రాసే రివ్యూలు ఒక వ్యక్తి కి లేదా, సంస్థ కి అనుకూలంగా కానీ, ఒకరిని ఉద్దేశించి కానీ రాసింది కాదు. కేవలం, మా రివ్యూర్ అభిప్రాయం మాత్రమే. మీరు పెట్టిన ఎఫర్ట్స్ ప్రశంసనీయం. మీరు అందించిన ఈ చిత్రం థియేటర్ లో సక్సెస్ ఫుల్ గా రన్ అవ్వాలని కోరుకుంటున్నాం.