టాలీవుడ్ యంగ్ హీరోస్ లో ఒకరైన “నిఖిల్ సిద్దార్థ్” ప్రస్తుతం డైపర్స్ మార్చే పనిలో పడ్డాడు. ఇదంతా కేవలం తనకు పుట్టబోయే బిడ్డ కోసం చేస్తున్నాడు. నిఖిల్ భార్య “పల్లవి వర్మ” తాజాగ గర్భం దాల్చింది. ఐతే తనకు పుట్టబోయే బిడ్డ కోసం నిఖిల్ ఇప్పటి నుంచే కలలుకంటున్నాడు. అందులో భాగంగా తనకి బిడ్డ పుట్టాక డైపర్స్ ఎలా మార్చాలా అనే విషయం పై ఇప్పటి నుంచే కసరత్తు చేస్తున్నాడు. ఇందుకు సంబంధించి హీరో నిఖిల్ తన ఇంస్టాగ్రామ్ ఖాతా లో “డైపర్లు మార్చడం నేర్చుకుంటున్న” అంటూ తాజాగా ఓ వీడియో పోస్ట్ చేసాడు.
ఆ వీడియో లో భార్య, స్నేహితులతో కలిసి డైపర్స్ మార్చడం నేర్చుకుంటున్నట్లు వీడియో తీసి పెట్టాడు.ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారగా. దీనికి సంబంధించి అభిమానాలు కూడా సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.
2020లో ఒక్కటైనా ఈ జంటకూ ఈ సంవత్సరమే తొలి సంతానం కలగబోతుంది. కాగా కార్తికేయ 2 తో పాన్ ఇండియా స్టారైనా నిఖిల్ ప్రస్తుతం “స్వయంభూ” అనే సినిమా చేస్తున్నాడు. సంయుక్త మీనన్ హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రాన్ని ఈ సంవత్సరమే విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.