ఎప్పటి లాగే ఈ ఏడాది కూడా సంక్రాంతి సినిమాలతో ఘనంగా ప్రారంభమైంది.కానీ తర్వాత వెలవెలబోయింది.సంక్రాంతికి రిలీజైన గుంటూరు కారం,సైంధవ్,నా సామిరంగ సినిమాలు ఆశించిన ఫలితాలు సాదించలేకపోయాయి.హనుమాన్ మాత్రం కుమ్మేసింది.లిమిటెడ్ థియేటర్స్ లో రిలీజైన ఈ సినిమా తర్వాత పాజిటివ్ టాక్ తో క్రమక్రమంగా థియేటర్స్ సంఖ్యను పెంచుకొని ఆల్ టైం నాన్ బహుబలి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.ఈ సినిమా హవా ఒక 20రోజులు పాటు నడిచింది.ఇంకా రిపబ్లిక్ డే కి రిలీజైన కెప్టెన్ మిల్లర్,అయలాన్ సినిమాలకి మంచి టాక్ వచ్చినప్పటికీ జనాదరణ మాత్రం పొందలేకపోయాయి.
హృతిక్ రోషన్ ఫైటర్ మాత్రం డిసాస్టర్ గా మిగిలిపోయింది.ఇంకా ఈ ఫిబ్రవరి మొదటివారం అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్,బూట్ కట్ బాలరాజు వంటి కొన్ని సినిమాలు రిలీజైయాయి.వీటిలో అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమాకే కాస్తో,కూస్తో జనాదరణ దక్కింది.ఇంక ప్రతివారం లాగే ఈ వారం కూడా కొన్ని సినిమాలు రిలీజైయాయి.వాటిలో వై.యస్.రాజశేఖరరెడ్డి బయోపిక్ యాత్ర కొనసాగింపుగా వై.యస్.జగన్ బయోపిక్ పేరిత యాత్ర-2 రిలీజైయ్యింది.క్రిటిక్స్ నుంచి మంచి ప్రశంసలు వచ్చినప్పటికీ ఆడియన్స్ మాత్రం ఈ సినిమా పై అంతగా ఆసక్తి చూపించట్లేదు.
ఇదే వారం వచ్చిన “ఈగల్” కి నెగటివ్ టాక్ వచ్చినప్పటికీ మొదటి రెండురోజులు మంచి నంబర్స్ నమోదు చేయడం తో బయర్స్ ఊపిరి పీల్చుకున్నారు.బ్రేక్ ఈవెన్ సాధిస్తుందా లేదా అని చెప్పలేని పరిస్థితి.ఇదే వారం రజినీకాంత్ “లాల్ సలాం”గా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.జైలర్ వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత తన కూతురు ఐశ్వర్య దర్శకత్వంలో చేసిన లాల్ సలాం కనీసం బజ్ లేకుండా వచ్చింది.బుకింగ్స్ కూడా అందుకు తగ్గట్టుగానే నమోదైయ్యాయి.అటు తమిళంలో గాని ఇటు తెలుగులో గాని కనీసం 5శాతం బుకింగ్స్ కూడా నమోదుకాలేదు.
బహుశా రజినీకాంత్ గారి కెరీర్లోనే ఇంత తక్కువ బజ్ తో ఇంత దారుణమైన బుకింగ్స్ నమోదైన సినిమా కావొచ్చు. తమిళ అనువాద చిత్రం “ట్రూ లవర్” చిత్రం కూడా పరవాలేదు అనిపించుకుంది, కానీ అంతలా కలెక్షన్స్ వస్తాయో లేదో ఇంకా చెప్పే పరిస్థితి అయితే కనిపించట్లేదు. 2018 తర్వాత ఆరంభం లోనే ఇంత తక్కువ సక్సెస్ రేట్ నమోదు చేసిన సంవత్సరం ఇదే. వచ్చేవారం “ఊరి పేరు భైరవకోన”, “పాగల్ కాదల్” అనే సినిమాలు రాబోతున్నాయి.చూద్దాం మరి అవన్నా మంచి విజయం సాధించింది బాక్సాఫీస్ కి కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయో లేదో?
Good Content keep continue for more updates as for movie lovers 🙂🙂🙂,👍👍👍