- Advertisement -spot_img
HomeUncategorizedఎట్టకేలకు మొదలవనున్న మురగదాస్ కొత్త చిత్రం: శివకార్తికేయన్, మృణాల్ ఠాకూర్ జంటగా!

ఎట్టకేలకు మొదలవనున్న మురగదాస్ కొత్త చిత్రం: శివకార్తికేయన్, మృణాల్ ఠాకూర్ జంటగా!

- Advertisement -spot_img

తమిళ ఇండస్ట్రీ లో స్వయం కృషి తో ఎదిగిన ఒక వ్యక్తి పేరు చెప్పమంటే, అందరూ ముక్తఖంఠంతో చెప్పే ఒకే ఒక్క పేరు శివ కార్తికేయన్. బాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టి, సైడ్ హీరో గా పలు చిత్రాలలో నటించి, నెమ్మదిగా హీరో గా ఎదిగారు. ఆయన చాలా మందిని ప్రోత్సహిస్తారు కూడాను. ఇటీవల ఆయన నుంచి వచ్చిన సైన్స్ ఫిక్షన్ చిత్రం “అయలాన్” పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్నప్పటికీ అనుకునంత రీతిలో లాభాలు గడించలేకపోయింది. సంక్రాంతి సినిమా సంబరాలలో అది కూడా విడుదల అవ్వాల్సింది, కొన్ని కారణాల వలన తెలుగు వెర్షన్ థియేటర్ రిలీజ్ నోచుకోలేదు. అయితే ఇప్పుడు ఆ చిత్రం డైరెక్ట్ గా OTT వెర్షన్ తెలుగు లో రిలీజ్ అవ్వబోతోంది. తమిళ వెర్షన్ ఇప్పటికే సన్ నెక్స్ట్ లో విడుదల అయ్యింది కూడాను.

ఇప్పుడు అందరి నోటా నానుతున్న ఒకే ఒక్క విషయం, విలక్షణ దర్శకుడు ఏ.ఆర్. మురుగదాస్ తన తదుపరి చిత్రాన్ని శివ కార్తికేయన్ తో చెయ్యబోతున్నారు అనేది. ఆ చిత్రం షూటింగ్ ఈ పాటికే మొదలు అవ్వాల్సి ఉంది, కొంత వాయిదా తరువాత ఇప్పుడు ఎట్టకేలకు మొదలు అవ్వబోతోంది. ఇది ఒక పక్కా మాస్ ఎంటర్టైనర్. శ్రీ లక్ష్మీ మూవీస్ బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. మురుగదాస్ గారి రీతిలో కొంత సోషల్ మెసేజ్ కూడా ఉండొచ్చు మరి. ఇప్పుడు అందరినీ అలరిస్తున్న విషయం ఏంటి అంటే, ఈ చిత్రంలో శివకార్తికేయన్ సరసన మన అందాల సీత “మృణాల్ ఠాకూర్” నటిస్తున్నారు. ఇప్పటికే సీతారామం, హాయ్ నాన్న చిత్రాల ద్వారా తమిళ ప్రేక్షకులకి తెలిసిన ఆవిడ, ఇప్పుడు డైరెక్ట్ తమిళ చిత్రం చెయ్యబోతున్నారు. ఆనందించాల్సిన విషయం ఏమిటి అంటే, తమిళనాట శివకార్తికేయన్, హిందీ నుంచి మృణాల్ ఇద్దరూ ఎలాంటి సపోర్ట్ లేకుండా సొంత ప్రతిభతో ఎదిగిన వాళ్లే. ఈ చిత్రానికి సంబందించిన తదుపరి సమాచారం తెలియాల్సి ఉంది. హిందీ యాక్షన్ హీరో విద్యుత్ జంవాల్, మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ ముఖ్య భూమిక పోషిస్తున్నారుస్. మహేష్ బాబు తో spyder చిత్రం చేసాక, మురుగదాస్ గారు ఇంకొక చిత్రం చెయ్యలేదు, ఆ చిత్రం ఇచ్చిన ప్రభావం అలాంటిది మరి. ఇప్పుడు శివకార్తికేయన్ గారికి, మురుగదాస్ గారికి ఈ చిత్రం గెలుపు బాటలోకి తీసుకువెళ్లే ఆయుధం. వేచి చూడాలి, మురుగదాస్ గారు ఎలాంటి కథతో వస్తున్నారో.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Stay Connected
44,085FansLike
65,000FollowersFollow
52,453SubscribersSubscribe
Must Read
- Advertisement -spot_img
Related News
- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

You cannot copy content of this page