సూపర్ స్టార్ రజినీకాంత్ తన పెద్ద కూతురు “ఐశ్వర్య రజినీకాంత్” చేతిలో మరోసారి బలయ్యారు. గతంలో “విక్రమసింహ” అనే సినిమా తీసి తన తండ్రికి పెద్ద షాక్ ఇస్తే ఈసారి “లాల్ సలాం” రూపంలో మరో పెద్ద షాక్ ఇచ్చారు. జైలర్ లాంటి భారీ సక్సెస్ వచ్చిన ఆనందాన్ని అటూ రజినీ కి గాని ఇటూ ఫ్యాన్స్ కి గాని ఎంతో కాలం ఉండనీయలేదు. నిజానికి జైలర్ కథ అంత గొప్పగా లేకపోయినప్పటికీ 600 కోట్లకి పైగా గ్రాస్ కలెక్ట్ చేసిందంతే కేవలం రజనీ స్టామినా వల్లే. చాలకాలం తర్వాత రజినీ తన మాస్ ఇమేజ్ కి తగ్గ సినిమా చేశారు. మరి అంత పెద్ద హిట్ తర్వాత సినిమా వస్తుందంతే సహజంగానే హైప్ ఉంటుంది. కానీ విచిత్రంగా “లాల్ సలాం” కి అసలు హైపే లేదు. ఈ సినిమా ఫిబ్రవరి 9వ తేదీన వచ్చిందన్న సంగతి కూడా చాలామందికి తెలియదు. ఇంక తొలిరోజు ఈ సినిమా కలెక్షన్స్ చూసి ట్రేడ్ వర్గాలు షాక్ అయ్యారు.
తొలిరోజు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 3.5కోట్ల గ్రాస్,1.5 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. ఇంత దారుణమైన కలెక్షన్స్ రజినీకాంత్ కెరీర్లో ఎప్పుడూ నమోదు చేయలేదు. ఇదంతా కేవలం చిత్రయూనిట్ నిర్లక్ష్యం వల్లనే. కనీసం ప్రొమోషన్స్ లేకుండా డైరెక్ట్ రిలీజ్ చేసారు. రిలీజ్ కి ఒక్కరోజు ముందు ట్రైలర్ వదిలి చేతులుదులుపుకున్నారు. ఈ సినిమా తెలుగు,తమిళంలో కనీసం 5శాతం బుకింగ్స్ కూడా రిజిస్టర్ కాలేదు. నిజానికి ఈ సినిమాలో రజినీ ది పూర్తిస్థాయి రోల్ కాదు. గెస్ట్ రోల్ కి ఎక్కువ మెయిన్ లీడ్ రోల్ కి తక్కువ అన్నట్టు ఉంటుంది.పైగా తెలుగు వెర్షన్ రజినీ దబ్బింగ్ మనుతో కాకుండా సాయికుమార్ తో చేయించడం కూడా తెలుగులో లో బుకింగ్స్ తగ్గటానికి ఒక కారణం. కారణం ఏదైనా కావొచ్చు జైలర్ తో వచ్చిన క్రేజ్ ని “లాల్ సలాం”తో పోగొట్టుకున్నారు రజినీ కూతురు ఐశ్వర్య రజినీకాంత్ స్వయంగా తన చేతులతో తనే తన తండ్రి ఇమేజ్ ని మరోసారి దెబ్బతీశారు.