ఇటీవల కాలంలో సోషల్ మీడియా పుణ్యామా అని కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ ఫేమస్ అయినంతగా మారేది అవ్వలేదు.ఈవిడ ఎంత ఫేమస్ అయ్యారంటే హైదరాబాద్ అంటే చార్మినార్ తో పాటు కుమారి ఆంటీ గుర్తొచ్చేంతలా. సాక్షాత్తూ తెలంగాణ ముఖ్యమంత్రి “రేవంత్ రెడ్డి” ఈవిడ ఫుడ్ స్టాల్ సందర్చించడానికి వస్తాను అన్నారంటే అర్థంచేసుకోవచ్చు ఈవిడ ఏ రేంజ్ కి వెళ్లిపోయారు అనే విషయం. ఇప్పుడు కుమారి ఆంటీ అంటే నేమ్ కాదు స్ట్రీట్ ఫుడ్ బిజినెస్ లోనే సరికొత్త బ్రాండ్. ఈవిడ దెబ్బకి పక్కనున్న మిగితా ఫుడ్ స్టాల్ల్స్ అన్ని కుదేలైయిపోయాయి. కేవలం ఈవిడ ఫుడ్ స్టాల్ కోసమే రెండు తెలుగు రాష్ట్రాల నుంచి చాలామంది ఇక్కడికి వస్తున్నారు. ఐతే ఇప్పుడు ఇదే ఆవిడకి కొత్త సమస్యలు తెచ్చిపెట్టింది. తెల్లారి లెగిస్తే చాలు కేవలం ఈవిడ ఫుడ్ స్టాల్ కోసమే రెండు తెలుగు రాష్ట్రాల నుంచి చాలామంది “సోషల్ మీడియా కంటెంట్ క్రీయేటర్స్” ఇక్కడ వాలిపోతున్నారు. దీంతో ఆ ప్రాంతం అంతా ట్రాఫిక్ తో రద్దీగా మారిపోయింది. మామూల్ గానే రోజు ఐటీ ఎంప్లాయిస్ తో రద్దీగా ఉండే ఆ ప్రాంతం ఇప్పుడు ఈ ఫుడ్ స్టాల్ వల్ల మరింత రద్దీగా మారింది. దీంతో ఈ ఫుడ్ స్టాల్ క్లోజ్ చేయించారు ఆ ఏరియా ట్రాఫిక్ పోలిస్లు. ఐతే తెలంగాణా ముఖ్యమంత్రి చొరవతో మళ్ళీ పునఃప్రారంభం అయ్యింది.
ఐతే ఈ ఇష్యూ పై తాజాగా హీరో సందీప్ కిషన్ స్పందించారు. రీసెంట్ గా “ఊరిపేరు భైరవకోన” సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ ని చిత్రయూనిట్ తో కలిసి సందర్శించారు. కాగా ఈవిడ ఫుడ్ స్టాల్ క్లోజ్ చేసారు అని తెలియగానే ఆవిడకి తన మద్దతు కూడా ప్రకటించారు. తాజాగా “ఊరి పేరు భైరవకోన”చిత్ర ప్రోమోషన్స్ లో భాగంగా నిన్న విలేకరులతో సమావేశమైయారు. అందులో ఒక విలేకరుడు కుమారి ఆంటీ ఇష్యూ గురించి అడగగా మరోసారి సందీప్ కిషన్ ఆవిడకి తన మద్దతు తెలియజేసారు.
ఆవిడ “ఇండిపెండెంట్ ఉమెన్” అని ఆవిడ ఫుడ్ స్టాల్ మళ్లీ ప్రారంభమవడం తనకి చాలా ఆనందంగా ఉందని మరోసారి కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ సందర్శిస్తాను అని చెప్పారు. కాగా ఇదే సమావేశంలో లియో సినిమా గురించి అడగగా దాని గురించి కూడా స్పందించారు సందీప్ కిషన్. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో తనని భాగస్వామి కావాలని అడిగారు అని ఐతే లోకేష్ ఆఫర్ ని తానూ సున్నితంగా తిరస్కరించినట్లు చెప్పారు.అవకాశం ఉంటే లోకేష్ తో మరో సినిమా చేస్తాను అని చెప్పారు. సందీప్ కిషన్ నగరం సినిమాతో లోకేష్ కనకరాజ్ దర్శకుడిగా పరిచయమయ్యారు.