- Advertisement -spot_img
HomeUncategorizedటిల్లూ స్క్వేర్ ట్రైలర్ రివ్యూ: బౌండరీస్ దాటేసిన టిల్లూ భామ!

టిల్లూ స్క్వేర్ ట్రైలర్ రివ్యూ: బౌండరీస్ దాటేసిన టిల్లూ భామ!

- Advertisement -spot_img

టిల్లూ స్క్వేర్ ట్రైలర్ రివ్యూ: బౌండరీస్ దాటేసిన టిల్లూ భామ!

డీజే.టిల్లూ ఎంత పెద్ద హిట్టో మనందరికీ తెలుసు. ఈ సినిమా మంచి విజయం సాధించిందంటే కేవలం టిల్లూ బాడీ లాంగ్వేజ్ వల్లే. తెలంగాణ యాసకు అంత క్రేజ్ వచ్చిందంటే ఈ సినిమా వల్లే.

తెలంగాణ యాసను ఇంతవరకు ఎవరు వాడని విధంగా ఈ సినిమాలో బాగా వాడారు. దానికి కొనసాగింపుగా టిల్లూ స్క్వేర్ రూపంలో సీక్వెల్ రాబోతుంది. ఈ సినిమా ట్రైలర్ ను వాలెంటైన్స్ డే సందర్భంగా ఈరోజు రిలీజ్ చేశారు. డీజే.టిల్లూ లో హీరోయిన్ గా నేహశెట్టి చేయగా టిల్లూ స్క్వేర్ లో అనుపమ పరమేశ్వరన్ చేసింది.

ట్రైలర్ లో మరోసారి యూత్ ని టార్గెట్ చేశారన్న విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. డీజే.టిల్లూ లో నేహాశెట్టితో ఒక స్థాయి వరకే రొమాన్స్ చేసి ఆగిపోయిన సిద్దు. ఇందులో మాత్రం బౌండరీస్ దాటేసి రెచ్చిపోయాడు. ట్రైలర్ లోనే అనుపమతో 15సెకండ్స్ డీప్ లిప్ లాక్ సీన్ ఒకటి పెట్టారంటే సినిమా మొత్తంలో ఇంకెన్ని ఉన్నాయో మీ ఊహ కే వదిలేస్తున్నాం. అనుపమ ఇన్నాళ్లు చాలా సింపుల్ గా పద్దతిగా కనిపించిన ఇందులో మాత్రం మోడరన్ గా కనిపించింది. ఇంతవరకు తన కెరీర్లో ఎప్పుడు కనిపించనంత హాట్ గా ఇందులో కనిపించి, కుర్ర కారులని కవ్విస్తుంది.

గతంలో రౌడీ బాయ్స్ సినిమాలో ఒక స్థాయి వరకు మాత్రమే లిప్ లాక్ చేసి ఆగిపోయిన, ఇందులో మాత్రం మరింత డీప్ గా వెళ్ళిపోయింది. ఏ హీరోకి ఇవ్వని విధంగా సిద్ధుకి ముద్దులిచ్చింది. డీజే టిల్లూ లానే ఇందులో కూడా సిద్దు అమ్మాయి చేతిలో మోసపోయిన క్యారెక్టర్ తో మరింత వినోదాన్ని అందిస్తున్నాడన్న విషయం ట్రైలర్ లో అర్ధమవుతుంది. ట్రైలర్ అంత సాఫీగా సరదాగా ఉంది.

ఐతే అనుపమ ఫాన్స్ కీ మాత్రం తనని అలా చూడడం నచ్చకపోవచ్చు. కాగా ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా మార్చి 29న రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా డైరెక్టర్ మల్లిక్ రామ్ కాగా సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమాని నిర్మిస్తుంది.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Stay Connected
44,085FansLike
65,000FollowersFollow
52,453SubscribersSubscribe
Must Read
- Advertisement -spot_img
Related News
- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

You cannot copy content of this page