- Advertisement -spot_img
HomeUncategorizedKajal Aggarwal: 'చందమామ'కు అప్పుడే 17 సంవత్సరాలు

Kajal Aggarwal: ‘చందమామ’కు అప్పుడే 17 సంవత్సరాలు

- Advertisement -spot_img

నాలుగు పదుల వయస్సుకు దగ్గరవుతున్నా తరగని అందంతో ఇంకా అభిమానులను అలరిస్తూనే ఉన్నారు మన చందమామ కాజల్. స్టార్ హీరోయిన్స్ లో ఒకరైన కాజల్ ఈరోజు తో తన సినీ ప్రస్థానం మొదలై 17సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. పేరుకే మరాఠి అమ్మాయి అయినా సౌత్ లోనే ఎక్కువ క్రేజ్ తెచ్చుకున్నారు, అదీ ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీ లో టాప్ స్టార్ గా ఎదిగారు. తెలుగులో కళ్యాణ్ రామ్ హీరోగా వచ్చిన “లక్ష్మీ కళ్యాణం”తో తన సినీ ప్రస్థానం ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ, తర్వాత రాజమౌళి గారి దర్శకత్వంలో వచ్చిన ‘మగధీర’తో స్టార్ హీరోయిన్ అయ్యారు. ఆ తర్వాత అల్లు అర్జున్, ఎన్టీఆర్, ప్రభాస్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, సూర్య, విజయ్, అజిత్ ఇలా సౌత్ లోని దాదాపు అందరి స్టార్ హీరోస్ సరసన నటించి అలరించారు. బాలీవుడ్ లోనూ అజయ్ దేవగణ్, సునీల్ శెట్టి లాంటి టాప్ హీరోస్ తో నటించారు. ఐతే సౌత్ లో రాణించినంతగా అక్కడ రాణించలేకపోయారు.

తన అందంతో ఎంతో మంది కుర్రకారులకి నిద్ర లేకుండా చేసారు ఆవిడ. స్క్రీన్ మీద కనిపిస్తుంటే, ఆవిడ అభిమానులు కన్నార్పకుండా చూస్తూనే ఉండిపోయేవారు. ఒకప్పటి సావిత్రి గారు, శ్రీదేవి గారు, సౌందర్య గారికి ఉన్నంత క్రేజ్ అతి తక్కువ సమయంలో కాజల్ గారిని వరించింది. ఆవిడ ఏ పాత్ర చేసినా చూడముచ్చటగా ఉండేది. ప్రభాస్ డార్లింగ్ చిత్రంలో నందిని పాత్రకి ప్రాణాలు ఇచ్చేసేవాళ్ళు కూడా ఉన్నారు. కొందరైతే కాజల్ వలన ఆ చిత్రంలో పాటలకి అందం వచ్చింది అన్నారు కూడాను. మగధీరా లో ఒక యువరాణి లాగా ఆవిడని తప్ప ఇంకెవ్వరినీ ఉహించుకోలేము. అలాగ ఆవిడ అందంతో, నటనతో కట్టిపడేసారు. పెళ్లి అయినా కూడా ఇప్పటికీ ఆవిడ తన అభిమానుల కలలోకి వచ్చి ఉక్కిరిబిక్కిరి చేస్తూనే ఉంటారు. ఆ అందం అలాంటిది మరి. వర్ణనాతీతం, అచంచలం. ఆవిడ సినీ ప్రపంచానికి దొరికిన ఒక ఆణిముత్యం, మకుటంలేని మహారాణి. ఆవిడ అందానికి యావత్ సినీ ప్రపంచం ఆవిడకి దాసోహం. ఆవిడ కళ్ళు, నడక, చూపు, నటన, నవ్వు ఆ పాత్రకి ప్రాణం పోస్తాయి అని కచ్చితంగా చెప్పొచ్చు. అందం మాత్రమే కాదు, గుణంలో కూడా కాజల్ మహారాణి కి ఏమాత్రం తీసిపోదు.

అటు సినిమాల పరంగానే కాకుండా ఇటు వాణిజ్యరంగంలోను తన సత్తా చాటుతున్నారు కాజల్. ప్రతీ ఏటా తన సంపాదనలో కొంత సామాజిక కార్యక్రమాలకి ఉపయోగిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని అరకు ప్రాంతంలో గిరిజన చిన్నారులను ఉచితంగా చదువు అందేలా సహాయం చేస్తున్నారు. ఇలా అన్ని రంగాలలో రాణించిన కాజల్ అగర్వాల్ 2020లో గౌతమ్ కిచ్లు అనే ముంబై కి చెందిన వ్యాపారవేత్తను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ జంటకు 2022లో ఒక బాబు కూడా పుట్టాడు. ప్రస్తుతం శంకర్-కమల్ భారతీయుడు-2, సత్యభామతో పాటు మరికొన్ని చిత్రాలు ఈ అమ్మడి చేతిలో ఉన్నాయి. ఈ రోజు కాజల్ తొలిచిత్రం రిలీజై 17సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కాజల్ కు ఇవే మా శుభాకాంక్షలు. ఆవిడ ఇలాగే నటిస్తూ మరికొన్ని సంవత్సరాల పాటు మనల్ని అలరించాలని కోరుకుందాం!!

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Stay Connected
44,085FansLike
65,000FollowersFollow
52,453SubscribersSubscribe
Must Read
- Advertisement -spot_img
Related News
- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

You cannot copy content of this page