నా సామిరంగ సూపర్ హిట్ తర్వాత కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తో కలిసి ఓ మల్టీస్టార్ సినిమా చేయబోతున్నారు కింగ్ నాగార్జున. ఈ సినిమాని టాలీవుడ్ క్లాసిక్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేస్తున్నారు. లవ్ స్టోరీ తర్వాత మళ్ళీ 3ఏళ్లకు ఈ సినిమా చేయబోతున్నారు శేఖర్ కమ్ముల. ఐతే ఈ సినిమాకి సంబంధించిన ఓ న్యూస్ గత కొన్ని రోజులుగా వైరల్ అవుతుంది.
అదేంటంటే ఈ సినిమాలో నాగార్జున సరసన హీరోయిన్ గా ప్రియమణి చేస్తున్నట్లు వార్తలొచ్చాయి. అలాగే, కొత్త వ్యక్తి సుబ్బు డైరెక్షన్ లో నాగార్జున & ప్రియమణి జంటగా చేస్తునట్టు ప్రచారాలు జరిగాయి. ఇదే నిజమంటూ కొన్ని వెబ్ సైట్స్ డిక్లేర్ కూడా చేశాయి. ఈ న్యూస్ పై చిత్రయూనిట్ స్పందించకపోయినప్పటికీ హీరోయిన్ ప్రియమణి మాత్రం స్పందించారు. 2022లో ఆమె మెయిన్ లీడ్ లో చేసిన భామాకలాపం అనే సినిమా ఓటిటి లో రిలీజై సూపర్ హిట్ అయింది. దానికి కొనసాగింపుగా భామాకలాపం-2 ఈనెల 16న ఆహా లో రిలీజ్ కాబోతుంది. ఈ చిత్రం ప్రోమోషన్స్ లో భాగంగా నిన్న మూవీ టీం ప్రెస్ మీట్ ఏర్పాటు చేసారు.
అందులో ఈ సినిమా విశేషాలతో పాటూ నాగార్జునతో సినిమా పై కూడా స్పందించారు ప్రియమణి. తనని మూవీ టీం అప్రోచ్ కాలేదు అని, తాను నాగార్జున గారి సినిమాలో హీరోయిన్ గా చేస్తున్నానని వస్తున్నా వార్తలో నిజం లేదు అని తేల్చి చెప్పారు. సుమారు అరగంట సేపు పాటు సాగిన ఈ ఇంటర్వ్యూ లో తన బిగ్ స్క్రీన్ పై రీఎంట్రీ తో పాటూ హీరో రవితేజ పై కూడా స్పందించారు.
చాలాకాలం తర్వాత రవితేజ ని కలవడం చాలా సంతోషంగా ఉంది. ఆయనొక ఎనర్జీ పవర్ హౌస్ ఓటిటిలో లాక్ డౌన్ టైం లో ఆయన సినిమాలు చాలా చూసా. ప్రతి సినిమాలో ఆయన క్యారెక్టర్ ని ఓన్ చేసుకునే విధానం బాగుంటుంది. భవిష్యత్తులో ఆయనకీ అంతా మంచే జరగాలని కోరుకుంటున్న చెప్పారు. అలాగే ఏదైనా మంచి క్యారెక్టర్ వస్తే బిగ్ స్క్రీన్ పై మళ్ళీ నటించడానికి రెడీగా ఉన్నానని చెప్పారు.