- Advertisement -spot_img
HomeUncategorizedసేవ్ ది టైగెర్స్ మళ్ళీ వచ్చేస్తోందోచ్: టైగెర్స్ ఆగమనం

సేవ్ ది టైగెర్స్ మళ్ళీ వచ్చేస్తోందోచ్: టైగెర్స్ ఆగమనం

- Advertisement -spot_img

ప్రియదర్శి పులికొండ, అభినవ్ గోమతం, కృష్ణ చైతన్య ప్రధాన పాత్రలుగా పోయిన ఏడాది విడుదల అయిన కామెడీ సిరీస్ “సేవ్ ది టైగెర్స్”. వీళ్ళ ముగ్గురికి జంటగా జోర్దార్ సుజాత, పావని, దేవియాని భార్యలుగా నటించారు. ఇది ఒక కామెడీ డ్రామా, డైరెక్ట్ గా హాట్ స్టార్ లో ఏప్రిల్ 23, 2023న విడుదల అయ్యింది. దర్శక రచయిత మహి వి రాఘవ్, ప్రదీప్ కలిసి ఈ సిరీస్ కి రచయితగా వ్యవహరించారు. మహి వి రాఘవ్ సహ నిర్మాతగా ఉంటూ చిన్న వాసుదేవ రెడ్డి గారు “త్రీ ఆటమ్ లీవ్స్” పతాకంపై నిర్మించారు. తేజ కాకుమాను దర్శకత్వం వహించారు ఈ సిరీస్ కి. ఇది ముగ్గురు జంటల జీవితాలలో జరిగిన సంగతులతో ఒక హాస్యాస్పద సిరీస్ లాగా ఉంటుంది. గతేడాది విడుదల అయిన ఈ సిరీస్ కి 6 ఎపిసోడ్స్ ఉన్నాయి. ప్రతీ మగవాడిని ఉద్దేశించి హీరోలు ముగ్గురూ టైగెర్స్ అని పేరు పెట్టుకుంటారు. వీళ్ళ ముగ్గురూ కలుసుకోటానికి, ముచ్చటించుకోటానికి ఉపయోగించే వాట్సాప్ గ్రూప్ పేరు “సేవ్ ది టైగెర్స్”. ప్రతీ ఎపిసోడ్ ఎంతో హాస్యాస్పదంగా తెరకెక్కించారు. హర్ష వర్ధన్ మరియు సునైనా గారి మధ్య వచ్చే సన్నివేశాలకి చాలా మంది ఉద్యోగులు కనెక్ట్ అవుతారు. ప్రతీ ఇంట్లో ఉండే చిన్న చిన్న మనస్పర్థల గురించి, ఇద్దరిలో ఒకళ్ళ పెత్తనం వలన వచ్చే గొడవలు గురించి చాలా చక్కగా చూపించారు. సిరీస్ మొత్తం ఫ్లాష్ బ్యాక్ గా నడుస్తుంది. చివర్లో వచ్చే ట్విస్ట్ నెక్స్ట్ పార్ట్ కి ఒక స్టెప్ లాగా వదిలేసారు దర్శకులు. ఇప్పుడు అదే సిరీస్ కి కొనసాగింపు త్వరలో రాబోతోంది అని హాట్ స్టార్ మరియు, చిత్ర బృందం ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రతీ కుటుంబంలో ఉండే చిన్న చిన్న అంశాలని తీసుకుని అల్లిన కథ చాలా బాగుంటుంది. ప్రియదర్శి, సుజాత ఇంకా గంగవ్వ మధ్య వచ్చే సన్నివేశాలు కడుపుబ్బా నవ్విస్తాయి. మొదటి సిరీస్ చివరిలో వీళ్ల ముగ్గురూ ఒక చెయ్యని కిడ్నాప్ కేసు లో ఇరుక్కుంటారు. ఈ విషయం వాళ్ళ భార్యలకు తెలిస్తే పరిస్థితులు చాలా ఘోరంగా తయారవుతాయి. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ని ఎలా ఎదురుకుంటారు, వాళ్ళ కాపురాలు ఎలా చక్కదిద్దుకుంటారు అనేది నెస్ట్ సీజన్లో చూడాలి మరి.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Stay Connected
44,085FansLike
65,000FollowersFollow
52,453SubscribersSubscribe
Must Read
- Advertisement -spot_img
Related News
- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

You cannot copy content of this page