Anushka Shetty: “శీలావతి”గా త్వరలో మన ముందుకు అనుష్క శెట్టి

0
193

దేవసేన అనుష్క శర్మ అంటే అణుకువ, అందం, అభినయానికి మారుపేరు. ఆవిడ సినిమా చేస్తున్నారు అంటే అన్ని వర్గాల సినీ ప్రియులు ఎగబడి చూస్తారు. ఆవిడ సినిమాలని పిక్ చేసుకునే విధానం అంత మంచిగా ఉంటుంది. అందరికీ నచ్చే కథాంశంతోనే ఆవిడ ఎప్పుడూ మన ముందుకి వస్తూ ఉంటారు.

ఇప్పుడు అసలు విషయం ఏమిటి అంటే, మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి తరువాత మన స్వీటీ నుంచి సినిమా అప్డేట్ రాలేదు. ఒక చిత్రం మొదలయ్యింది అనే వార్తలు వచ్చాయి కానీ ఎలాంటి పూర్తిస్థాయి సమాచారం లభించలేదు. ఎట్టకేలకి ఒక విషయం బయటకి వచ్చింది. క్రిష్ దర్శకత్వంలో యువి క్రియేషన్స్ పతాకంపై వంశి, ప్రమోద్ నిర్మాతలుగా, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ సహా నిర్మాతలుగా లేడీ ఓరియెంటెడ్ చిత్రం “శీలావతి” రాబోతోంది.

మన స్వీటీ టైటిల్ పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంబందించిన సెట్ పనులు హైదరాబాద్ లో శరవేగంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా ఇది తెలుగు చిత్రం అయినప్పటికీ, విడుదల అన్ని దక్షిణ భాషలలో ఉంటుంది అని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఈ సంవత్సరం చివరి భాగంలో ఈ చిత్రం విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయని వినికిడి.

బాహుబలి మొదటి భాగం చేసాక, సైజు జీరో అనే చిన్న చిత్రానికి తను కావాలని పాత్రమీదా మక్కువతో ఒళ్ళుచేసారు స్వీటీ. మళ్ళీ మాములు స్థితికి రావటానికి చాలానే కష్టపడ్డారు, తగ్గే క్రమంలో చాలా ఆరోగ్య సమస్యలని ఎదురుకున్నారు. కానీ అనుకున్నంత స్థాయిలో సన్నపడలేదు. ఇప్పుడు ఆవిడ ఉన్న తీరుని బట్టి పాత్రలని ఎంచుకుంటున్నారు అనిపిస్తోంది. క్రితం సంవత్సరం వచ్చిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి అందరినీ బాగా అలరించింది. అదే విధంగా శీలావతి కూడా అలరిస్తుంది అనే ఆశిద్దాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here