మహేష్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఈ సంక్రాంతికి వచ్చిన “గుంటూరు కారం” బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్ అయింది. త్రివిక్రమ్ మార్క్ సినిమా కాదంటూ విమర్శలొచ్చాయి. సినిమా ప్లాప్ ఐనప్పటికీ పాటలు మాత్రం సూపర్ హిట్. ఐతే ఈ సినిమాకు సంబందించిన “కుర్చీని మడతపెట్టి” అనే సాంగ్ ఓ అరుదయిన ఫీట్ సాధించింది.
అదేంటంటే ఇప్పటి వరకు 100మిల్లియన్స్ వ్యూస్ సాధించిన సాంగ్స్ లిస్ట్ లో ఈ సాంగ్ కూడా చేరింది. ఈ సాంగ్ ను యూట్యూబ్ లో 100మిల్లియన్స్ అంతే దాదాపు పది కోట్ల మంది వీక్షించారు. నిజానికి ఇది పాట కాదు సోషల్ మీడియా లో వైరలైన ఒక చిన్న బిట్ దానినే రీమిక్స్ చేసి ట్యూన్ కట్టి సాంగ్ గా మార్చారు మ్యూజిక్ డైరెక్టర్ థమన్. మొదట్లో ఈ సాంగ్ పై చాలా విమర్శలొచ్చాయి.
మహేష్ బాబు తో ఇలాంటి సాంగ్ ని పెడతారా అంటూ ఫాన్స్ సైతం వ్యతిరేకించారు. కానీ తర్వాత సినిమాలో ఈ సాంగ్ కీ మహేష్-శ్రీలీల డాన్స్ వల్ల ట్రేండింగ్ లోకీ వచ్చింది. ఈరోజు ఈ పాట ఇంత పెద్ద హిట్టైయిందంటే కేవలం మహేష్-శ్రీలీల కెమిస్ట్రీ వల్లే.
ముఖ్యంగా ఈ పాటలో మహేష్ స్టెప్స్ ని ఇంస్టాగ్రామ్ రీల్స్ రూపంలో చాలామంది ఇమిటేట్ చేసారు. ఇంత వరకు తన కెరీర్లో ఎప్పుడు లేని విధంగా ఈ పాటలో మహేష్ బాబు డాన్స్ వేశారు. మహేష్ బాబు మాస్ స్టెప్స్, శ్రీలీల, పూర్ణ గ్లామర్ షో ఈ పాటని మరోస్థాయికీ తీసుకెళ్లాయి.