చిత్రం: ఊరి పేరు భైరవకోన
రేటింగ్: 2.5/5
బాటమ్ లైన్: భైరవకోనలో భయం మాత్రం ఉండదు.
నటీనటులు: సందీప్ కిషన్, కావ్య థాపర్, వర్ష బొల్లమ్మ, వైవా హర్ష, వెన్నెలకిషోర్ తదితరులు
సంగీతం: శేఖర్ చంద్ర
నిర్మాత: రాజేష్ దండా
దర్శకత్వం: వి.ఐ.ఆనంద్
విడుదల: 16 ఫిబ్రవరి 2024
“వెంకటాద్రి ఎక్సప్రెస్” సూపర్ హిట్ తర్వాత సుదీర్ఘకాలంగా ఇంకో విజయం కోసం ప్రయత్నిస్తున్నా సందీప్ కిషన్ కీ మాత్రం విజయం వరించట్లేదు. ఆఖరికి లోకేష్ కనకరాజ్ లాంటి డైరెక్టర్ తో “నగరం” అనే సినిమా చేసిన ఫలితం మాత్రం దక్కలేదు. లేటెస్ట్ గా వి.ఐ.ఆనంద్ దర్శకత్వంలో “ఊరి పేరు భైరవకోన” అనే చిత్రంతో ఈ రోజు ప్రేక్షకుల ముందుకొచ్చాడు. మరి సినిమా ఎలా ఉందో మన సమీక్షాలో చూద్దాం.
కథ:
ఓ పెళ్లిలో నగలు దొంగతనంతో ప్రారంభమవుతుంది సినిమా. నగలు దొంగలించి బసవ(సందీప్ కిషన్) స్నేహితుడు (“వైవా హర్ష”)తో కలిసి అక్కడి నుంచి పారిపోతాడు. మార్గ మధ్యలో “యాక్సిడెంటల్” గా గీత(కావ్య థాపర్)ను కలుస్తాడు. తను కొట్టేసిన నగల కోసం పోలీసులు వెంటపడతారు వాళ్ళ నుంచి తప్పించుకునే క్రమంలో అనుకోకుండా “భైరవకోన” అనే ఊరిలోకీ ఎంటర్ అవ్వుతారు. భైరవకోనలోకి వచ్చాక అక్కడ ఊహించని పరిస్థితులు ఎదురవుతాయి. అక్కడ మనుషులంతా విచిత్రంగా, భయంకరంగా ప్రవర్తిస్తూ ఉంటారు. అలా కధ ముందుకు సాగుతున్న కొద్దీ ఇంటర్వెల్ టైం కీ ఆ ఊరిలో ఉన్నవాళ్ళంతా మనుషులు కాదు దెయ్యాలని వాళ్లంతా చనిపోయి చాలా సంవత్సరాలుగా అక్కడే ఆత్మలుగా తిరుగుతున్నారని తెలుసుకుంటారు. ఐతే అదే ఊరిలో ఒక పాడు పడ్డ భవనంలో రవిశంకర్(అతను కూడా ఆత్మే)అక్కడున్న ఆత్మలన్నిటిని కంట్రోల్ చేస్తా ఉంటాడు. అసలు ఈ ఊరి కదేంటి అక్కడున్న మనుషులంతా చనిపోయి ఎందుకని భైరవకోన ఆత్మలుగా తిరుగుతున్నారు. ఈ ఊరి నుంచి ఈ ఆత్మల నుంచి ఈ ముగ్గురు ఎలా తప్పించుకొని బయటపడ్డారు అన్నదే ఈ సినిమా అసలు కధ.
విశ్లేషణ:
సందీప్ కిషన్ మీద ఎవరికి అంతగా నమ్మకాలు లేనప్పటికీ ఈ సినిమా పై కూసింతన్న ప్రేక్షకులకి ఆసక్తి కలిగిందంటే దానికి ప్రధాన కారణం దర్శకుడు వి.ఐ.ఆనంద్. ఇతను హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు తీయడంలో దిట్ట. అందుకు “ఎక్కడికి పోతావ్ చిన్నవాడా” అనే సినిమానే ఉదాహరణ. పైగా ఈ మధ్యకాలంలో వచ్చిన హారర్ మిస్టరీ థ్రిల్లర్ సినిమాలు బాగా ఆకట్టుకోవడంతో ఈ సినిమా పై కూడా ఆసక్తి కలిగింది ప్రేక్షకులకి. అందుకు తగ్గట్టే ట్రైలర్ కూడా ఉండడంతో ఈ సినిమా పై నమ్మకం మరింత పెరిగింది. ఆ నమ్మకంతో నే సినిమాకెళ్లిన ప్రేక్షకులకి నిరాశ కలిగిందనే చెప్పాలి. సినిమా చూస్తున్నంతసేపు “ఎక్కడికి పోతావ్ చిన్నవాడా”, “జాంబిరెడ్డి” “విరూపాక్ష”లాంటి సినిమాలే అటు తిప్పి, ఇటు తిప్పి మల్లి అవే సినిమాలు చూస్తున్నాము అన్న ఫీలింగ్ కల్గుతుంది. హీరో అండ్ తన గ్యాంగ్ అనుకోకుండా భైరవకోన కీ వెళ్లడం.
అక్కడ దెయ్యాల ఆదీనంలో ఉండే ఊరిలో వీళ్ళు చిక్కుకుపోవడం. కార్తీ హీరోగా వచ్చిన తన ఫస్ట్ సినిమా “యుగానికి ఒక్కడు” సినిమా కూడా సేమ్ ప్లాట్. ఇంటర్వెల్ టైం కీ జాంబీస్ చేతిలో చిక్కుకోవడం ఆ తర్వాత వాటితో ఫైట్ చేయడం లాంటి సీన్స్ చుస్తే జాంబిరెడ్డి, విరూపాక్ష లాంటి సినిమాలు గుర్తొస్తాయి. ఈ సినిమా ఆద్యాటం ఎదోక సినిమా ఇలాంటి సన్నివేశాలు ఎక్కడో చూసామే అన్న ఫీలింగొస్తుంది. ఈ భైరవకోన కధ ఒకవైపు ఉంటే దీనికి ఇంకో వైపు వర్ష బోలమ్మా కీ సంబంధించిన పచ్చగూడెం గ్రామానికి చెందిన ఇంకో కధ ఉంది. ఇది ఈ సినిమాకి ఇంకో ఉపకథ. ఐతే ఈ రెండు కధల్ని లింక్ చేసిన విధానం అతికి అతకనట్టు ఉంటుంది. సినిమా చూసాక డైరెక్టర్ పై ఈ మధ్యకాలంలో వచ్చిన ఈ జోనర్ కీ చెందిన సినిమాల ప్రభావం గట్టిగ పడిందన్న విషయం అర్థమవుతుంది. ఉన్నంతలో ఫస్ట్ హాఫ్ మాత్రం గ్రిప్పిగా ఉంటుంది. సెకండ్ హాఫ్ తేలిపోయింది. దెయ్యాన్ని మోసం చేయడం లాంటి సన్నివేశాలు చుస్తే డైరెక్టర్ పై జాలేస్తుంది.
నటీనటులు పనితీరు:
సందీప్ కిషన్ మరి అంత డెప్త్ గా కాకపోయినా ఉన్నంతలో సెటిల్డ్ గా బానే చేసాడనిపిస్తుంది. వైవా హర్ష ఫ్రెండ్ క్యారెక్టర్లో సపోర్టివ్ రోల్లో బానే నవ్విస్తాడు. కావ్య థాపర్ కీ పెద్దగా స్కోప్ ఉండదు హీరో పక్కన సపోర్టివ్ రోల్ అంతే. వర్ష బోలమ్మ కీ మాత్రం కావ్య థాపర్ తో పోలిస్తే పెర్ఫార్మెన్స్ కీ మంచి స్కోప్ దొరికింది. ఐతే ఆవిడ పాత్ర నిడివి తక్కువవ్వడం మైనస్ పాయింట్. వెన్నెల కిశోర్ ఉన్నంత సేపు నవ్విస్తాడు. రవిశంకర్ కూడా బానే చేసాడు. ఇంకా సంగీతం విషయానికొస్తే ఉన్న మూడు పాటల్లో ఒక పాట ఆల్రెడీ పెద్ద హిట్టైయింది. మిగిలిన రెండు అంతగా ఎక్కువ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఫర్వాలేదనిపిస్తుంది. మిగిలిన డిపార్ట్మెంట్స్ పనితీరు కూడా బాగుంది. ఇంకా ఈ సినిమాకి హైలెట్ మాత్రం విజువల్స్. నిర్మాత ఎక్కడ ఖర్చుకి వెనకాడకుండా ఉన్నంతలో బానే తీశారు. ఐతే దర్శకుడు కథ, కథనాల మీద ఇంకా బాగా దృష్టిపెడితే బాగుంటుంది అనిపించింది. ఈ మధ్యకాలం లో వచ్చిన మంచి థ్రిల్లర్ మూవీస్ అంత గొప్ప సినిమా ఐతే కాదు. ఏ అంచనాలు లేకుండా వెళ్తే మాత్రం బానే థ్రిల్ చేస్తుంది. వి.ఐ.ఆనంద్ గత చిత్రాలు మాదిరి ఆశించి వెళ్తేనో, లేకుంటే ఈ మధ్యకాలంలో వచ్చిన థ్రిల్లర్ మూవీస్ మాదిరి ఆశించి వెళ్తే మాత్రం నిరాశ తప్పదు.