- Advertisement -spot_img
HomeUncategorizedధనుష్ 50వ చిత్రం "రాయన్" ఫస్ట్ లుక్ విడుదల

ధనుష్ 50వ చిత్రం “రాయన్” ఫస్ట్ లుక్ విడుదల

- Advertisement -spot_img

కోలీవుడ్ విభిన్న నటుడు ధనుష్ సుడిగాలి కంటే వేగంగా సినిమాలు చేస్తున్నారు. తనకంటూ ఉన్న టాలెంట్ ని నమ్ముకుని, తన నటనతో కోట్లాదిమంది హృదయాలను కొల్లకొట్టారు. ధనుష్ చిత్రం అంటే తమిళంలోనే కాదు, తెలుగు అభిమానులకి కూడా పండగనే. రజనీకాంత్ అల్లుడు అని మాత్రమే కాకుండా, తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు ఆయన. రీసెంట్ గా కెప్టెన్ మిల్లర్ అంటూ వచ్చి నెల కూడా కాలేదు. ఆ చిత్రం తెలుగులో ఆడీ ఆడనట్టు ఆడింది. తమిళంలో కొద్దోగొప్పో అలరించినా, తెలుగులో తేలిపోయింది. ఇది ఇలా ఉంటే ధనుష్ గారు అప్పుడే తన 50వ సినిమాకి సంబందించిన ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు. ఇది పక్కా యాక్షన్ మరియు క్రైమ్ డ్రామా. తనకి ఎంతో ప్రతిష్టాత్మకమైన మైలురాయి 50వ చిత్రం ని ధనుష్ తన స్వీయ దర్శకత్వంలో నటిస్తుండటం విశేషం. ఈ చిత్రానికి రచయిత కూడా ధనుష్ గారే. ఈ సినిమాకి “రాయన్” అనే పేరును ఖరారు చేసారు. దానికి సంభందించిన ఫస్ట్ లుక్ ఈరోజు రిలీజ్ చేసారు. ఫస్ట్ లుక్ లో ధనుష్ కార్ మెకానిక్ లుక్ లో కనిపించారు. ఆయన గెటప్ కూడా కొత్తగా ఉన్నది. ఈ చిత్రం కోసమే ఆయన కెప్టెన్ మిల్లర్ చిత్రం త్వరగా షూటింగ్ ముగించి, తిరుపతి వెళ్లి తలనీలాలు ఇచ్చి వచ్చారు. ఈ చిత్రంలో ధనుష్ దాదాపుగా గుండు లాగా కనిపించే గెటప్ లో కనిపించారు. ఈ సినిమా లో ధనుష్ తో పాటు సందీప్ కిషన్ కూడా ఒక ముఖ్యమైన రోల్ చేస్తున్నారు. పోస్టర్ లో కాళిదాస్ జయరాం కూడా కత్తితో కనిపించారు. ఎస్ జె సూర్య ముఖ్య పాత్ర పోషిస్తున్నారు, యంగ్ హీరో విష్ణు విశాల్ కూడా నటిస్తున్నారు. ఈ చిత్రంలో అందాల తారలు త్రిష, నిత్యామీనన్, అపర్ణ బాలమురళి కూడా నటిస్తున్నారు. ఈ సినిమాకి ఏ.ఆర్.రెహ్మాన్ సంగీతం అందిస్తుండగా, సన్ పిక్చర్స్ వారు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఈ సంవత్సరమే విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. త్వరలో మొత్తం వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Stay Connected
44,085FansLike
65,000FollowersFollow
52,453SubscribersSubscribe
Must Read
- Advertisement -spot_img
Related News
- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

You cannot copy content of this page