దక్షిణాన కెరీర్ మొదలుపెట్టి, బాలీవుడ్ లో కూడా తనదైన శైలిలో ముద్ర వేసుకున్న నటీమణులలో ప్రియమణి ఒకరు. నేషనల్ అవార్డు గ్రహీత ఆవిడ. ఈ మధ్య వచ్చిన భామాకలాపం 2 లో తన నటనతో అందరినీ కట్టిపడేసారు ప్రియమణి. షారుఖ్ ఖాన్ లాంటి బడా హీరో తో జవాన్ చిత్రంలో తెరని పంచుకున్నారు ఆవిడ. ఇప్పుడు ఆవిడ బాలీవుడ్ తారలమీద చేసిన ఒక స్టేట్మెంట్ సర్వత్రా చర్చనీయాంశం అయ్యింది. అసలు విషయానికి వస్తే, ప్రియమణి గారు ఒక డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ మరియు పోడ్కాస్ట్ షో అయిన “Raw Talks with VK” షోలో, బాలీవుడ్ వాళ్ళు ఎల్లప్పుడూ జనాల కళ్ళల్లో పడటానికి ఉపయోగించే చీప్ ట్రిక్ గురించి బయటపెట్టేసారు.
బాలీవుడ్ సెలబ్రిటీస్ ఇది ఒక బిజినెస్ గా చేస్తున్నారు, దాని పేరు “Paparazzi”. వాళ్ళు రోడ్ మీద కానీ, జిమ్ నుంచి బయటకి వస్తున్నప్పుడు కానీ, ట్రాఫిక్ లో రోడ్ మీద అనుకోకుండా నడుచుకుంటూ వస్తున్నప్పుడు కానీ చాలా మంది జనాలు పోగవటం, ఫొటోస్ కి పోజ్ ఇవ్వటం చూస్తూ ఉంటాం. మనం అందరం అది ఫాన్స్ చేసే సందడి అనుకునేవాళ్ళం ఇప్పటిదాకా. కానీ అది ఒక బిజినెస్ అని ప్రియమణి బయటపెట్టారు. ఆ పలానా సెలబ్రిటీ, ఏ టైం కి, ఎక్కడకి వస్తారు, వచ్చినప్పుడు ఎంత మంది జనాలు వాళ్ళ చుట్టూ మూగాలి, వాళ్ళు ఎల్లాంటి ప్రశ్నలు అడగాలి, ఎన్ని ఫొటోస్ తియ్యాలి, ఇలా అన్నీ ప్రీ-ప్లాన్డ్. డబ్బు కూడా అలానే చెల్లిస్తారు. ఎంత మంది వస్తారో ఒక్కో వ్యక్తికి, వాళ్ళు అక్కడ ఉండే సమయం బట్టి రేట్ ఉంటుంది. అక్కడ మనం చూసేది ఏదీ కూడా నిజం కాదు. “Paparazzi” సర్వీస్ ఇచ్చే ఒక ఏజెన్సీ తో ముడిపడి, బాలీవుడ్ సెలబ్రిటీస్ తమని జనాలు మర్చిపోకుండా చేసుకోటానికి చేసే స్టంట్ ఇది. అది అభిమానంతో వచ్చే జనాలు కాదు, డబ్బుతో రప్పించిన డమ్మీ అభిమానం. అసలు ఇంకో బాధాకరమైన విషయం ఏమిటి అంటే, ఈ బిజినెస్ ఇప్పుడు టాలీవుడ్ లోకి కూడా వచ్చింది అంట. ఇది ఇలానే కొనసాగితే ఎన్ని దారుణాలు జరుగుతాయో మరి.