- Advertisement -spot_img
HomeUncategorizedTop 10 "The Boldest and Most Electrifying Kisses Ever Witnessed in Tollywood!”...

Top 10 “The Boldest and Most Electrifying Kisses Ever Witnessed in Tollywood!” : టాప్ 10 క్రేజి ముద్దులు:

- Advertisement -spot_img

ముద్దు అనేది ఒక గొప్ప అనుభూతి దాన్ని ఎవరైనా ఆస్వాదించాలనుకుంటారు. ఈ ప్రపంచాన్ని పరిపాలించిన “అలెగ్జాండర్”,”హిట్లర్” లాంటి ఎందరో మహానుభావులు సైతం ముద్దు కోసం పెళ్లి కాక ముందు అమ్మాయల దగ్గరో, తమ జీవితభాగస్వామి దగ్గర ఎప్పుడోకప్పుడు పరితపించే ఉంటారు. ముద్దు ద్వారా మనం ప్రేమించిన వ్యక్తి కీ మన ప్రేమని తెలియచేయచ్చు. ముద్దు పెట్టుకోవడం వళ్ళ మన జీవితభాగస్వామితో బాండింగ్ బలంగా ఉంటుంది అనేది వాస్తవం. ఒక ముద్దు లో అంత గొప్పదనం ఉంది. అలాంటి ముద్దుకీ ఎవరైనా దాసోహం కావాల్సిందే. ఇక సినిమా వాళ్ళేం అతీతులు కాదు. ఎన్నో సినిమాల్లో ఎంతో మంది హీరో-హీరోయిన్స్ తమ పెదాలతో ముద్దులాడి ప్రేక్షకులని కవ్వించినవి ఎన్నో. అందులో మొదటగా నాగార్జున-మణిరత్నం కాంబినేషన్లో వచ్చిన “గీతాంజలి” సినిమాతో మొదలైన ఈ ముద్దుల కల్చర్ నేటికి కొనసాగుతూనే ఉంది. గత పదేళ్లలో ఐతే తెలుగు సినిమాల్లో ఈ కిస్ కల్చర్ బాగా పెరిగిపోయింది. మరి, గడిచిన దశాబ్దంలో వచ్చిన టాప్ 10 బెస్ట్ కిస్ సీన్స్ ఏవో ఇప్పుడు చూద్దాం.

10) అల్లుశిరీష్ – అనుఇమ్మాన్యూల్(ఉర్వశివో-రాక్షశివో):

ఈ సినిమాలో వీరిద్దరి రొమాన్స్ చుస్తే ఎవరికైనా పిచ్చెక్కిపోవడం ఖాయం. అల్లుశిరీష్ – అనుఇమ్మాన్యూల్ ఇంతవరకు ఏ సినిమాలో లేని విధంగా ఈ సినిమాలో ఒకరికొకరు బాగా పడి పడి ముద్దులిచ్చూకుంటారు. అసలు, ఈ సినిమాలో నటించడంకంటే వీళ్లిద్దరికి ముద్దులతోటే సరిపోతుంది.

9) మహేష్ బాబు – కాజల్(బిజినెస్ మ్యాన్):

అప్పటి వరకు చాలా సింపుల్ గా పక్కింటి అమ్మాయి లా ఉండే కాజల్. ఈ సినిమాలో మాత్రం రెచ్చిపోయింది. మహేష్ బాబు-కాజల్ కాంబినేషన్ లో వచ్చిన ‘చందమామ’ సాంగ్ ఎంతో రొమాంటిక్ గా చిత్రీకరించారు. కాజల్ ని చందమామ తో పోలుస్తూ మహేష్ ముద్దాడిన విధానం చూస్తే ఓళ్ళు గగ్గురపుట్టిస్తాయి. తమ కెరీర్లో ఎప్పుడు లేని విధంగా ఫస్ట్ టైం ఇలా ముద్దాడటం.

Mahesh Babu & Kajal Agarwal in Business Man Tamil Movie Stills

8) అఖిల్ అక్కినేని – పూజ హెగ్డే(మోస్ట్ ఎల్జిబుల్ బ్యాచిలర్):

ఈ సినిమాకి ముందే ఆల్రెడీ “నిధి అగర్వాల్” తో లిప్ లాక్ చేసి ఎక్సపీరియన్స్ పొందిన యంగ్ హీరో అఖిల్. తన కన్నా ఏజ్ పెద్దలో ఉన్న పూజ హెగ్డే కీ లిప్ లాక్ ఇచ్చి అందరిని సర్ప్రైజ్ చేస్తాడు. పూజ హెగ్డే కూడా తెలుగులో ఇంతవరకు ఏ హీరో కీ ఇవ్వని విధంగా అఖిల్ కీ ముద్దిస్తుంది.

7) విజయ్ దేవరకొండ – రష్మిక(డియర్ కామ్రేడ్):

గీతగోవిందం హిట్ కాంబినేషన్ తరువాత ఇద్దరు కలిసి చేసిన సినిమా “డియర్ కామ్రేడ్”. అప్పటికే, అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ ముద్దుల వీరుడిగా పేరు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ. ఈ సినిమాలో కూడా ఒక సన్నివేశం లో రష్మిక మందాన్నా కీ వర్షంలో ఒక డీప్ లిప్ లాక్ ఇచ్చి ప్రేక్షకులకి సర్ప్రైజ్ ఇచ్చాడు. రష్మిక మందన్న కూడా ఈ సినిమాలో ఫస్ట్ టైం తన బుల్లి పెదాలని విజయ్ దేవరకొండ కి అద్దెకిచ్చేసింది.

6) కార్తికేయ – పాయల్(Rx100):

హీరో-హీరోయిన్స్ ఇద్దరికీ ఈ సినిమా తొలి సినిమానే ఐనప్పటికీ ముద్దు సీన్స్ లో మాత్రం వీరవిహారం చేశారు. ఇద్దరు ఒకరిని మించి ఒకరు ముద్దలతో ప్రేక్షకులని ముంచెత్తారు. ముఖ్యంగా పాయల్ రాజపుత్ సినిమాలో ఐతే మాత్రం ముద్దుల వర్షం కురిపించింది.

5) నాగచైతన్య-సమంత(ఏ మాయ చేసావె):

హీరో తన ఇంటి పైన అద్దెకు ఉంటున్న హీరోయిన్ ని చూసి ప్రేమిస్తాడు. హీరో తన ప్రేమని వ్యక్త పరిచే సమయంలో హీరోయిన్ ని ట్రైన్లో కిస్ చేస్తాడు. అక్కడ స్టార్ట్ అవ్వుతుంది గుండెల్లో రైలు. అప్పట్లో, ఈ సినిమా ఒక సెన్షేషన్. కుర్రాళ్ళు అయ్యితే ‘జెస్సి’ కి ఫిదా అయ్యిపొయ్యి గుండెల్లో గుడి కట్టేసారు అనుకోండి. సమంత కి ఇది తొలి చిత్రం అయ్యినప్పటికీ తన పొడి పొడి పెదాలని “నాగచైతన్య” కీ బాగానే అప్పగించేసింది. ఈ సినిమాలోని కిస్ సీన్స్ తెలుగు సినిమాలో వచ్చిన వన్ అఫ్ బెస్ట్ కిస్ సీన్స్ లో ఒకటి. ఈ సినిమా సమంత, నాగచైతన్య ప్రేమకు చిహ్నం!

4) సిద్దు జొన్నలగడ్డ – నేహా శెట్టి (డీజే.టిల్లు):

డీజే.టిల్లు సినిమా సిద్దు కేరీర్ లో బ్లాక్ బాస్టర్ గా నిలిచింది. వీళ్లిద్దరి జోడికి యూత్ బ్రమ్మరథం పట్టారు. ఇకపోతే, వీళ్లిద్దరి మధ్య సాగే ముద్దులాట చాలా ఫ్రెష్ గా కనిపిస్తాయి. ముఖ్యంగా, కార్ లో వీళ్లిద్దరి ముద్దులాట చుస్తే బాబోయ్ అనిపిస్తుంది.

3) విజయ్ దేవరకొండ – షాలిని పాండే (అర్జున్ రెడ్డి):

పెళ్లిచూపులు సినిమాలో పద్దతిగా కనిపించిన విజయ్. అర్జున్ రెడ్డి లో మాత్రం షాలినిపాండేని ముద్దులతో సముద్రంలో అలలులా ముంచెత్తాడు. అసలు ఈ సినిమాలో ముద్దు సీన్స్ ఉన్నాయా లేకపోతే, ముద్దు సీన్స్ లోనే ఈ సినిమా ఉందా అనిపిస్తుంది. ఈ సినిమా లో ముద్దులు గురించి నేను వర్ణించలేను, మరో మారు మీరు చూసేయండి.

2) విరాజ్ – వైష్ణవి(బేబీ):
ఈ సినిమాలో హీరో ఆనంద్ దేవరకొండ ఐనప్పటికీ, ఇంకో హీరో అయినా విరాజ్ కే ఎక్కువగా హీరోయిన్ ముద్దులిస్తుంది. ముఖ్యంగా పబ్ లో వీళ్లిద్దరి ముద్దు సీన్స్ గాని, బెడ్ రూమ్ లో ముద్దు సీన్స్ గానీ చుస్తే వీరిద్దరూ నటించారా! లేదంటే జీవించారా అన్నట్లు ఉంటుంది. ఆ ముద్దు సీన్స్ లో వీళ్ల కెమిస్ట్రీ వేరే లెవెల్. అప్పటి వరుకు చాలా పద్ధతి గా ఉండే వైష్ణవి, నటనతో పాటు, సున్నితమైన రోజా పువ్వు లాంటి పెదాలతో ముద్దులు ఇవ్వడంతో తన చుట్టూ ఉండే బ్యారియర్స్ ని బ్రేక్ చేసింది.

1) సిద్దు జొన్నలగడ్డ – అనుపమ పరమేశ్వరన్(టిల్లు స్క్వేర్):

ఈ సినిమా ఇంకా రిలీజ్ కానప్పటికీ, ట్రైలర్ ని ఇటీవలే రిలీజ్ చేసారు. అందులో 15సెకన్ల భారీ లిప్ లాక్, కార్ లో అనుపమ తో ఉంటుంది. ఆ బిట్ చుస్తే అర్ధమవుతుంది వీళ్లిద్దరి మధ్య కెమిస్ట్రీ తార స్థాయిలో ఉంది అని. అనుపమ తన కెరీర్లో ఎప్పుడు ఇంత భారీ లిప్ లాక్ చేయలేదు. సిద్ధుకి తన పెదాలని పూర్తిగా అర్పించడంతో పాటు ప్రేక్షకులని ముక్కు మీద వేలు వేసుకునేలా, ఘాటైన కిస్ తో సినిమాకి వెల్కమ్ చెప్తుంది. ప్రస్తుతం ఆ 15సెకన్ల భారీ లిప్ లాక్ సీన్ యూత్ ని కుదిపేస్తోంది.

ఇవి ఈ దశాబ్దంలో వచ్చిన బెస్ట్ కిస్సెస్.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Stay Connected
44,085FansLike
65,000FollowersFollow
52,453SubscribersSubscribe
Must Read
- Advertisement -spot_img
Related News
- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

You cannot copy content of this page