ఏ జన్మలో ఏం పాపం చేసుకుందో గాని గత కొంతకాలంగా సినీనటి త్రిష అనుచిత వ్యాఖ్యలకు గురవుతూనే ఉంది. ఇటీవల తమిళ నటుడు మన్సూర్ అలీఖాన్ “లియో” సినిమాలో త్రిషతో రేప్ సీన్స్ ఉంటాయని ఆశపడ్డాను, ఆ సీన్స్ లేకపోవడంతో బాధపడ్డానని త్రిష పై కొన్ని అభ్యేంతకరమైన వ్యాఖ్యలు చేసారు.
దీని పై తమిళనాడులోని మహిళా సంఘాలు భగ్గుమన్నాయి. ప్రముఖ సినీనటుడు మెగాస్టార్ చిరంజీవి సైతం త్రిషకీ తన మద్దతు తెలియజేశాడు. చెన్నై హైకోర్ట్ సైతం మన్సూర్ అలీఖాన్ ని మందలించింది. దీంతో ఈ వివాదం సమిసిపోయింది అని ఆనందించే లోపు తాజాగా ఇంకో వివాదం బయటికొచ్చింది.
ఈ సారి అన్నాడీఎంకే పార్టీకీ చెందిన ఏ.వీ.రాజు అనే నేత త్రిష పై మరింత ఘాటు వ్యాఖలు చేసారు. గతంలో ఓ ఫంక్షన్ లో త్రిష ని చూసిన అక్కడి స్థానిక ఎమ్మెల్యే ఆవిడ పై ఆశపడ్డారని. ఒక్క రాత్రి గడిపేందుకు త్రిషతో 25లక్షల రూపాయిలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు అంటూ తీవ్ర దుమారం రేపే వ్యాఖలు చేశాడు. దీని పై మరోసారి మహిళా సంఘాలు భగ్గుమన్నాయి.
ఈ విషయం పై త్రిష మండిపడ్డారు. తన పై ఇలాంటి వ్యాఖలు చేసిన ఏ.వీ.రాజు పై లీగల్ గా చర్యలు తీసుకుంటాను స్పందించారు. కాగా ఈ విషయం పై త్రిష కీ అభిమానుల నుంచి భారీగా మద్దతు లభిస్తుండగా, తమిళ్ హీరో విశాల్ సైతం సదరు ఎమ్మెల్యే వ్యాఖలనూ తీవ్రంగా ఖండించారు. సినిమా నటులపై ఇలాంటి వ్యాఖలు బాధ కలిగించిందంటూ త్రిషకీ తన మద్దతు ప్రకటించారు. చూద్దాం మరి, ఈ వివాదం యెంత దూరం వెళ్తుందో. ఐతే త్రిష అభిమానులు మాత్రం తమ అభిమాన నటి తరచూ ఇలా విమర్శకులకి గురికావడం బాధ కలిగిస్తుందంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.