మూవీ: సుందరం మాస్టర్
రేటింగ్: 2.5/5
బాటమ్ లైన్: సుందరం మాస్టర్ నవ్వించిన, ఏడిపించలేకపోయాడు.
విడుదల తేదీ: ఫిబ్రవరి 23, 2024
నటీనటులు: హర్ష చెముడు, దివ్య శ్రీపాద, తదితరులు
డివోపి: దీపక్ ఎరెగడ
ఎడిటర్: కార్తీక్
సంగీతం: శ్రీచరణ్ పాకాల
నిర్మాతలు: రవితేజ, సుధీర్ కుమార్ కుర్రు
రచయిత/దర్శకుడు: కళ్యాణ్ సంతోష్
సుందరం మాస్టర్ విడుదలకు ముందే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది, ముఖ్యంగా, విడుదలైన ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. రవితేజ మరియు సుధీర్ కుమార్ కుర్రు నిర్మించిన ఈ విలేజ్ బేస్డ్ డ్రామాలో “వైవా హర్ష” ప్రధాన పాత్ర పోషించారు. ఈ చిత్రం కీలక పాత్రల్లో “దివ్య శ్రీపాదను” నటించింది. ఫిబ్రవరి 23న గ్రాండ్ గా రీలిజ్ అయ్యిన సినిమా ప్రేక్షకులని ఏ స్థాయిలో ఆకట్టుకుందో తెలుసుకుందాం.
కథ: సుందరం మాస్టర్(వైవా హర్ష) “సోషల్ స్టడీస్” చెప్పే ఒక మాస్టర్. కట్నం బాగా ఇచ్చే పెళ్లి సంబంధాలు కోసం పాకులాడుతుంటాడు. ఇంకా మంచి పొజిషన్ వస్తుంది అనే ఉద్దేశంతో యమ్.ఎల్.ఏ(హర్ష వర్ధన్) చూపిన “మిరియాల మెట్ట” అనే ఒక విలేజ్ కి “ఇంగ్లీష్” టీచర్ గా వెళ్తాడు. కట్ చేస్తే మాస్టర్ కన్నా బ్రిటిష్ ఇంగ్లీష్ మాట్లాడతారు. అసలు యమ్.ఎల్.ఏ(హర్ష వర్ధన్) ఎందుకు మిరియాల మెట్ట గ్రామానికి పంపిస్తాడు? ఆ గ్రామంలో ఏముంది? ఆ గ్రామానికి వెళ్లిన సుందర్ ర్రావ్ ఎలాంటి ఇబ్బందులు ఫెస్ చేసాడు? సోషల్ స్టడీస్ చెప్పే మాస్టర్ ఇంగ్లీష్ చెప్పగలిగాడా? ఆ గ్రామం వాళ్ళకి తెల్లోళ్ళు అంటే ఎందుకు కోపం? ఆ గ్రామంలో ఉన్న మైనా పాత్ర ఏంటి? ఇవన్నీ తెలియాలి అంటే మీరు తప్పకుండ సినిమా చుడాలిసిందే!!
విశ్లేషణ:
ఈ భూ ప్రపంచంలో ప్రతి కంట్రీ అంచెలు అంచెలుగా ఎదుగుతున్నప్పటికీ, కొన్ని తెగల వాళ్ళు ప్రపంచానికి సంబంధం లేకుండా బతకడం మనం చూస్తుంటాం, వింటుంటాం. అలా, ఈ సుందరం మాస్టర్ సినిమాలో ‘మిరియాల మెట్ట’ అనే ఊరిని తీసుకొని, ఆ ఊరి చుట్టూ కథ ని అల్లారు. ఇంట్రడక్షన్ లో సుందరం మాస్టర్ లైఫ్ స్టైల్, అతను పెళ్లి కట్నం గురించి పడే బాధలు ఫుల్ కామెడీగా అనిపిస్తాయి. సెకండ్ ఆఫ్ లో కొన్ని సీన్స్ లో సినిమా చూస్తున్నంత సేపు, కల్మషం లేని మనుషులు, ప్రకృతి, మానవత్వం లాంటి ఎమోషన్స్ తో సాగుతుంది.
‘మిరియాల మెట్ట’ గ్రామానికి అసలు స్వతంత్రం వచ్చినట్టు, గాంధీ ఎలా ఉంటారు అని తెలియకపోవడం, అసలు ప్రపంచం మారిందని తెలియకపోవడం సన్నివేశాలు చూపించినప్పటికీ ఆడియెన్స్ కి సరిగ్గా రీచ్ అవ్వకపోవడంతో పాటు, కాస్త డ్రమటిక్ ఫీల్ కలిగిస్తుంది. సినిమా ఫస్టాఫ్ లో కాస్త కామెడీ పర్వాలేదు. గ్రామస్తులకు ఇంగ్లీష్ నేర్పించే సన్నివేశాలు నవ్విస్తాయి. ఇంటర్వెల్ వరకు నవ్వించిన మాస్టర్, సెకండ్ ఆఫ్ లో ఫిలాసఫీ ఎక్కువగా ఉండే సరికి, దర్శకుడు డీల్ చేయడంలో కాస్త తడబడ్డాడు అనే చెప్పాలి. సినిమాలో వచ్చే కొన్ని సీన్స్ కొత్తగా అనిపించినప్పటికీ ఓవరాల్ గా అవి ఎక్సపోజ్ కావు. ఇంకో విషయం, బ్రిటిష్ రాజ్యం లో ఉండే ఆ ఊరిని బ్రిటిషర్లు నుండి కాపాడిన దొరగా ‘బ్రహ్మానందం’, ఈ సినిమా మూల కథ చెప్పడం కొత్తగా ఉంది.
నటి నటులు పెర్ఫామెన్స్: వైవా హర్ష “సుందరం” పాత్ర కి పర్ఫెక్ట్ గా సూట్ అయ్యారు. తన కెరీర్ లో ది బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చాడు. దివ్య శ్రీపాద (మైనా) గా సూట్ అయ్యినప్పటికీ పాత్ర లో పెద్ద పస లేకపోవడం కోసం మెరుపు. కాకపోతే, తన అప్పియరెన్స్ తో బాగా ఆకట్టుకుంటుంది. ఇకపోతే సినిమా లో చెప్పుకో దగ్గ క్యారెక్టర్ లు ఏం లేవు. తది తరులు ఆర్టిస్ట్ లు తమ పరిధి మేరకు బాగానే రాణించారు.
సాకేంతిక విభాగం: డైరెక్టర్ కళ్యాణ్ సంతోష్ కథ ఎంచుకున్న ప్లాట్ బాగున్నప్పటికీ, స్క్రీన్ ప్లే తో పాటు చెప్పుకో దగ్గ డైలాగ్స్ ఆకట్టుకోలేకపోయాయ్. డిఓపి పని తీరు విజ్యువల్స్ బాగున్నాయి. ఎడిటర్ కార్తిక్ కాస్త పదును చెప్పాలిసింది. శ్రీ చరణ్ పాకాల మ్యూజిక్ సినిమాకి అసెట్. ప్రొడక్షన్ వ్యాల్యూస్ పర్వాలేదు.
గమనిక: మేము రాసే రివ్యూలు ఒక వ్యక్తి కి లేదా, సంస్థ కి అనుకూలంగా కానీ, ఒకరిని ఉద్దేశించి కానీ రాసింది కాదు. కేవలం, మా రివ్యూర్ అభిప్రాయం మాత్రమే. మీరు పెట్టిన ఎఫర్ట్స్ ప్రశంసనీయం. మీరు అందించిన ఈ చిత్రం థియేటర్ లో సక్సెస్ ఫుల్ గా రన్ అవ్వాలని కోరుకుంటున్నాం.
Review By:Tirumalasetty Venkatesh