హారర్-కామెడీ చిత్రాలలో ట్రెండ్ సెట్టర్ సినిమా ఏదైనా ఉంది అంటే, అది రాఘవ లారెన్స్ “కాంచన” సినిమా. ఈ సినిమాని బేస్ చేసుకొని వచ్చిన జోనర్ సినిమాల హావా కొన్నాళ్ల పాటు బానే నడిచింది. ఆ తర్వాత జనాలకు ఈ తరహా సినిమాల మీద కొంచం విసుగొచ్చిందనే చెప్పాలి. హీరో అండ్ ఫామిలీ ఒక ఇంట్లో లేదా ఒక బంగ్లాలోకి అద్దెకు దిగడం. అదే ఇంట్లో గతంలో ఉన్నవాళ్లు ఏదొక బలమైన కారణం చేత చనిపోయి అదే ఇంట్లో దెయ్యాలుగా తిరగడం. ప్రస్తుతం ఉంటున్న వాళ్ళు ఆ దెయ్యాల చేతిలో ఇబ్బంది పడడం వాటిల్లో నుంచి వచ్చే కామెడీతో ప్రేక్షకులని నవ్వించడం. ఈ తరహా సినిమాలు చూసి చూసి ప్రేక్షకులు అసిలిపోయారు. అందుకే ఇప్పుడు ఇలాంటి తరహా సినిమాలు వస్తున్నాయి అంటే ఆడియన్స్ పట్టించుకోవడం మానేశారు. అందుకే ఇవి ఫేడ్ అవుట్ ఐపోయాయి. దశాబ్దకాలం కిందిట వచ్చిన అంజలి మెయిన్ లీడ్ రోల్లో నటించిన “గీతాంజలి” కూడా సేమ్ ఇదే తరహా సినిమా. మల్లి ఇన్నాళ్లకు దానికి గీతాంజలి-2 పేరుతో సీక్వెల్ రూపంలో మల్లి వస్తుంది. అప్పుడంటే ఏదో ఆడింది. మరి ఇప్పుడు బాగా ఆడుతుందా అంతే చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే కాలం చెల్లిపోయిన సినిమాలు జనలు అయినా కలకాలం చూడరు కదా! నిజానికి ఇది హారర్ సినిమా కాదు హారర్ సినిమాకి ఒక మెట్టు పైన ఒక మెట్టు కింద అన్నట్టు ఉంటుంది. ఇంకా విషయంలోకి వస్తే గీతాంజలి-2 ట్రైలర్ ని నిన్న రిలీజ్ చేసారు. ట్రైలర్ ఆమాంతం సరదాగా సాఫీగా సాగిపోయింది. పార్ట్-1 లో కనిపించిన క్యారెక్టర్స్ శ్రీనివాస్ రెడ్డి, ఆర్యన్ రాజేష్, షకలకశంకర్ లాంటి తదితరులు ఇందులో కూడా ఉన్నారు. వీళ్ళకి అదనంగా సునీల్, వెన్నెల కిశోర్, అలీ, సత్య లాంటి మరికొంతమంది ఇందులో ఉన్నారు. పార్ట్-1 లో అంజలి దెయ్యంగా నటించగా పార్ట్-2 లో మాత్రం రవిశంకర్ ఆ పాత్ర పోషిస్తున్నారు. పార్ట్-1 లో శ్రీనివాస్ రెడ్డి డైరెక్షన్ ఛాన్స్ రావడంతో ముగిస్తుంది. పార్ట్-2 కూడా మల్లి అక్కడ నుంచే ప్రారంభమవుతున్నట్లు తెలుస్తుంది. శ్రీనివాస్ రెడ్డి డైరెక్టర్ అవ్వడం. సినిమా షూటింగ్ కోసం కొంతమంది ఆర్టిస్ట్స్ తో “సంగీత్ మహల్” కీ వెళ్లడం, అక్కడ దెయ్యాలుగా తిరుగుతున్నా రవిశంకర్ కుటుంబసభ్యుల చేతిలో ఇబ్బంది పడడం ఇలా కధకు సంభందించి ట్రైలర్లోనే హింట్ ఇచ్చేసాడు దర్శకుడు. మరి చూద్దాం ఈ సినిమా కూడా పార్ట్-1 లాగ హిట్ అవుతుందో లేదో. ఈ సినిమాని మార్చ్ 22న విడుదల చేస్తున్నారు.