తెలుగులో ఎంతోమంది స్టార్ హీరోస్ ఉండొచ్చు కానీ వెర్సటైల్ కి సరైన అర్థంచెప్పింది మాత్రం “న్యాచురల్ స్టార్ నాని”నే .రేడియో జాకీగా తన కెరీర్ మొదలు పెట్టిన నాని ఆ తర్వాత బాపు గారి కొన్ని సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసి “అష్టాచెమ్మా” సినిమాతో హీరోగా తన ప్రస్థానాన్ని స్టార్ట్ చేసారు. ఈ 15ఏళ్ళ కెరీర్లో ఎన్నో గొప్ప చిత్రాలు మరెన్నో గొప్ప పాత్రలను పోషించి తన సహజసిద్దమైన నటనతో ప్రేక్షకులను మెప్పించారు. నాని అంటే మిగితా హీరోస్ లాగా ఫలానా జోనర్ సినిమాలకు చెందిన హీరో అనే ముద్ర పడకుండా ప్రతీ సినిమాలో తన క్యారెక్టర్లో వేరియేషన్ చుపిస్తారు. అష్టాచెమ్మా లో పక్కింటి కుర్రోడిలాగా, అలామొదలైయింది,నేను లోకల్ లాంటి సినిమాల్లో లవర్ బాయ్ గా, భలేభలే మగాడివోయ్ సినిమాతో తనలోని కామెడీ సైడ్ ని,నిన్నుకోరి సినిమాలో ప్రేమలో విఫలమైన యువకుడిగా, దసరా సినిమాలో మాస్ హీరోగా, జెర్సీ సినిమాలో సక్సెస్ కోసం పరితపించే క్రికెటర్ గా, హాయ్ నాన్న సినిమాలో కూతురి కోసం ఏమైనా చేసే ఒక తండ్రిగా. ఇలా ప్రతీ సినిమాలో తన క్యారెక్టర్లో ఏదొక వేరియేషన్. ప్రతీ క్యారెక్టర్ కి 100% న్యాయం చేయగల నటుడు ఈ జనరేషన్ లో మాత్రం నాని నే. అందుకే అతడ్ని వెర్సటైల్ యాక్టర్ అంటారు. వెర్సటైల్ అనే పదానికి సరైన అర్ధం చెప్పింది అప్పట్లో కమల్ హసన్ ఐతే ఇప్పట్లో మాత్రం నాని. చిరంజీవి,రవితేజ తర్వాత ఎంతో మంది బాక్గ్రౌండ్ లేని హీరోస్ వచ్చారు, కానీ వాళ్లంతా కేవలం ఒకటి,రెండు చిత్రాలకే పరిమితమయ్య్యారు. మళ్ళీ వాళ్ళిద్దరి తర్వాత నిలకడ గా హిట్స్ కొడుతూ వాళ్ళ స్థాయికి చేరుకున్న హీరో మాత్రం నానినే. అలంటి నానికి పుట్టినరోజు జరుపుకుంటునందుకు గాను మా “film combat” తరుపున పుట్టిన రోజు శుభాకాంక్షలు. నాని ఇలాగే మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని, ఇంకా మరెన్నో మంచి చిత్రాలతో ఇలాగే మనల్ని అలరించాలని భవిష్యత్తులో ఇంకా పెద్ద స్థాయికి చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలాగే ప్రస్తుతం చేస్తున్న సినిమా “సరిపోయిందా శనివారం” సినిమా కూడా మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. Once again wishing you a very happy birthday “Natural star Nani”.