దసరా, హాయ్ నాన్న సినిమాలతో వరుసగా బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ కొట్టిన నాని, ఈసారి “సరిపోదా శనివారం” అంటూ మరో హిట్ కొట్టడానికి రెడీ అయ్యిపోయాడు. దానికి సంబందించిన టీజర్ ని నాని 40వ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు రిలీజ్ చేశారు. “సరిపోదా శనివారం” అనే పేరు వినగానే ఇదేదో భలేభలే మగాడివోయ్ టైపు కామెడీ సినిమానుకున్న వారందరికీ ఇది మాస్ సినిమా అంటూ టీజర్ తో సమాధానం ఇచ్చేసాడు. “యస్.జే.సూర్య” వాయిస్ ఓవర్ తో స్టార్ట్ అయిన టీజర్ ఆమాంతం నాని మాస్ లుక్ తో అదరకొట్టాడు. ఈ సినిమా లో హీరో క్యారెక్టర్ పేరు “సూర్య” కాగా ఆ క్యారెక్టర్ కీ సంబందించిన ఒక ఆసక్తికరమైన అంశాన్ని హింట్ ఇచ్చారు. వారం మొత్తంలో తనని హింసించినవారందరిని నోట్ చేసుకొని శనివారం రోజున వాళ్ళందరి పైనా రివేంజ్ తీర్చుకుంటాడు అనే పాయింట్ ని టీజర్ లో రివీల్ చేశారు. పాయింట్ ఐతే ఇంట్రస్టింగ్ గానే ఉంది మరి చూద్దాం ఎగ్జిక్యూషన్ ఎలా ఉంటుందో. ఈ సినిమాలో ఒక కీలక పాత్ర “యస్.జే.సూర్య” పోషిస్తున్నాడు. ఈ సినిమాని ఆగస్ట్29న రిలీజ్ చేస్తున్నట్లు టీజర్లో ప్రకటించారు.