టాలీవుడ్ లో ‘తెలుగు తారలే’ కాకుండా, వివిధ భాషలకి సంబందించిన నటినటులు కూడా వచ్చి నటించి ప్రేక్షకులని తమ పెర్ఫామెన్స్ తో మెప్పిస్తూ ఉంటారు. ఈ మధ్య మన తెలుగు చిత్రాలలో ఎక్కువగా కొత్త ‘నటీమణులని’ చూస్తున్నాం. వాళ్ళ నటనకి తగ్గ మెప్పులు కూడా పొందుతున్నారు. ఇప్పుడు అలాంటి ‘టాప్ పెర్ఫామెన్స్’ (Top 10 Best Female Performers 2024 Jan & Feb) ఇచ్చిన నటీమణులని వెతికే పనిలో మేము ఉన్నాం. ఈ కొత్త సంవత్సరం విడుదల అయిన చిత్రాల్లో నుంచి ఒక 10 మంది నటీమణులని (#Top10BestFemalePerformers2024 Jan & Feb) ఎంచుకుని వాళ్ళ పాత్రలని ఎంత బాగా పోషించి, ప్రేక్షకుల మెప్పుని పొందారో మీకు తెలియచేసే ప్రయత్నం చేస్తున్నాం. ఈ 10 మంది నటీమణులని ఎంచుకోవటం కోసం ఎలాంటి పక్షపాతం లేకుండా ప్రేక్షకులు ఇచ్చిన రెస్పాన్స్ ని బట్టి సేకరించటం జరిగింది.
గమనిక: ఈ లిస్ట్ లో ఉన్న ఆర్డర్ ప్రకారం నటీమణుల స్థానాన్ని మేము నిర్ణయించలేదు.
అషికా రంగనాధ్(#AshikaRanganath): నా సామి రంగా(#NaaSaamiRanga)
‘నాగార్జున’ (Akkineni Nagarjuna) లాంటి అనుభవం ఉన్న పెద్ద నటుడి సరసన నటించి, తన నటనతో కింగ్ ని అధిగమించిన నటి ‘అషిక’. తెలుగు నటి కాకపోయినా, లేలేత వయసులోనే ఎక్కువ వయసున్న పాత్ర చేసి, తన సహజ నటనతో, అందంతో, యావత్తు తెలుగు ప్రేక్షకుల గుండెల్లో గుడి కట్టేసుకుంది. నా సామి రంగా…వరాలు మజాకా.
శరణ్య ప్రదీప్(#SharanyaPradeep): అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్(#AmbajipetaMarriageBand)
‘శరణ్య’ చాలా సాఫ్ట్ నేచర్ ఉన్న గడుచు పిల్ల. విభిన్న పాత్రలే కాకుండా, క్యారెక్టర్ బేస్డ్ పాత్రలు కూడా చేసి అందరినీ మెప్పించారు. అలాంటి విభిన్నమైన పాత్రల్లో ఒకటి “పద్మ” పాత్ర. హీరో అక్కగా శరణ్య చేసిన నటన అమోఘం, అద్భుతం. ఒక కింది స్థాయి సామాజిక వర్గానికి చెందిన ఆవిడ పాత్ర, దానికోసం ఆవిడ పెట్టిన శ్రమ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఒక ప్రభుత్వ ఉద్యోగిగా, సమాజంలో తనమీద ఉన్న అపరాధాన్ని మోసే పాత్రలో ఆవిడ జీవించి శభాష్ అనిపించారు.
మేఘాలేఖ (#Meghalekha) : బూట్ కట్ బాలరాజు(#BhootCutBalaraju)
ఒక ఊరి పెద్ద యజమాని కూతురి పాత్రలో ‘మేఘాలేఖ’ కనిపించారు. తెర మీద పంచదార ‘చిలుక’ ఛాయలు కనిపించే ఆమె బహుముఖమైన సుందరం వర్ణించలేనిది. ఒక పెద్ద ఇంటి అమ్మాయి, తనని తనలా గుర్తించి వచ్చిన మనిషిని కాపాడుకునే ప్రయత్నం చెయ్యటం చాలా బాగుంటుంది. మొయ్యలేని భాద్యతల నడుమ తన ప్రేమని కాపాడుకోవటానికి ఆ చిలుక చేసే ప్రయత్నం ప్రశంసనీయం. సినిమాలో వచ్చే రొమాంటిక్ సాంగ్ ఎంతో ప్రత్యేకం.
గౌరీ ప్రియా(#SriGouriPriyaReddy): ట్రూ లవ్(#TrueLove)
ఈ పాత్ర చాలా విభిన్నమైనది. తెలుగు మిస్ హైదరాబాద్ ‘గౌరి’ (Sri Gouri Priya Reddy) నటనని మనం ఇదివరకు ‘MAD అనే చిత్రంలో చూసాము. అందంతోనే కాదు, తన కళ్ళతో ఇట్టె థియేటర్ లో అందరిని ఫ్రీజ్ చేసేస్తోంది. అదే జరిగింది…’ట్రూ లవ్’ చిత్రం లో కూడా, ప్రతీ ఎమోషన్ ని చాలా అద్భుతంగా నటించారు ఆవిడ. ప్రేమ చూపించే విషయంలో కానీ, ద్వేషం, కోపం ఇలాంటి ప్రతీ ఎమోషన్ ని చాలా అద్భుతంగా, సహజంగా నటించింది గౌరీ. అందుకనే, ఈ లిస్టులోకి ఆవిడ పేరు జతచేర్చటం జరిగింది.
నేహా సోలంకి(#NehaSolanki): గేమ్ ఆన్ (#GameOn)
వయ్యారి భామ “నేహా సోలంకి” తెలుగు తెర కి పెద్దగా పరిచయం లేనప్పటికీ తన అందచందాలతో, నటనతో అదరకొట్టారు. మొదట ట్రైలర్ లో చూడగానే ఆవిడ పాత్ర కేవలం గ్లామర్ కోసమేనేమో అనుకుంటారు. కానీ ఆవిడ నటించిన విధానానికి అందరూ ముగ్ధులై ముద్దులు కావాలి అని అడుగుతారు. ఒక షాట్ లో అయ్యితే, అర్రే ‘అనుష్క’ మల్లి బికినీ లో వచ్చిందా ఏంటి అనిపిస్తుంది. ‘గేమ్ ఆన్’ లో ఆవిడ పాత్రకి వచ్చిన రెస్పాన్స్ సూపర్బ్.
భావన వజపండల్(#BhavanaVazhapandal) : సర్కారు నౌకరి(#SarkaaruNoukari)
కథలో గట్టి పట్టు లేకపోయినప్పటికీ, ‘భావన’ (Bhavana Vazhapandal) నటించిన ‘సత్య’ పాత్రలో చాలా పట్టు ఉంది. పెళ్ళైన కొత్తలో వయ్యారాలు ఓలకబోసే అమ్మాయిగా, తన లేలేత అందాలతో కవ్విస్తుంటుంది. ఒక పెళ్ళైన ఆడపిల్ల సొసైటీ వల్ల పడే అవమానాలు, ఆ తద్వారా తన కాపురం చక్కదిద్దుకోవటానికి చేసే ప్రయత్నం అందరికీ నచ్చింది. తన భర్త వల్ల తనకి జరుగుతున్న అవమానాన్ని భరించలేక చేసే కొన్ని ప్రయత్నంలో ఆవిడ నటన ప్రశంసనీయం.
దివ్య శ్రీపాద(#DivyaSripada): సుందరం మాస్టర్(#SundramMaster)
ఏ స్వప్న లోకాల సౌందర్య రాసి నా ముందుకొచ్చింది కనువిందు చేసి ఈ వాక్యం మన తెలుగు అమ్మాయి ‘దివ్య శ్రీపాద’ (Divya Sripada) కి సొంతం. చాలా మెచ్యూరిటీ చూపించే ఆవిడ నటన ఇప్పటిదాకా చిన్న పాటి పాత్రలు చేసినప్పటికీ పెద్ద తరహాలో హీరోయిన్ గా చేసిన అనుభవం లేదు. యూట్యూబ్ తెరమీద చేసిన నటనకి, వెండితెరమీద మొదటిసారి హీరోయిన్ గా చేస్తున్న నటనకి పూర్తిగా తేడా చూపించారు ‘దివ్య’. ఇంత పెద్ద బాధ్యతని ఆవిడ చాలా న్యాచ్యురల్ గా నటించిన విధానం, పాత్రని పోషించిన విధానం అద్భుతం.
వర్ష బొల్లమ్మ(#VarshaBollamma): ఊరి పేరు భైరవకోన(#OoruPeruBhairavakona)
ఒక కారణం కోసం పోరాడే ముక్కుసూటి పల్లెటూరి పిల్ల. కథ, కారణం రెండూ తనతోనే ఉంటాయి. తన పాత్ర చాలా ప్రత్యేకమైనది. నటించిన విధానం కూడా చాలా పరిణితి చెందిన విధంగా తెరమీద చూస్తున్నట్టు అనిపిస్తుంది. ఆవిడ దాదాపుగా సినిమా మొత్తం కళ్ళతోనే అన్నీ భావాలని వ్యక్తపరిచారు. ముఖ్యంగా, ‘నిజమేనే చెబుతున్న జానే జానా’ (Njamene Chebuthunna Jaane Jaana) సాంగ్ హిట్ అవ్వడానికి కారణం ఆవిడ కళ్ళే. అలాగే, ఎమోషనల్ సన్నివేశాలలో నటించిన విధానం అబ్బురపరుస్తుంది.
అనుపమా పరమేశ్వరన్(#AnupamaParameswaran) : ఈగల్(#Eagle)
ఒక వ్యక్తి కథని, తన కథగా మలుచుకుని నిజాన్ని వెల్లిక్కి తీసే క్రమంలో తను చేసిన పోరాటం, నటించిన విధానం హీరోకి సరిపోలికగా అనిపిస్తుంది. ఎక్కడా కూడా బెరుకు లేని చురుకైన ఆడపులి గా, తనకు జరిగిన అవమానాన్ని సవాలుగా తీసుకుని చేసిన ఒక చిన్నపాటి యుద్ధం. అది ప్రదర్శించిన విధానం మెచ్చుకోతగ్గ ప్రయత్నం. నళిని పాత్రకి ఆవిడని తప్ప ఇంకెవ్వరినీ ఊహించుకునే వీలు లేకుండా ఆ పాత్రకి ప్రాణం పోశారు అనుపమ.
శ్రీలీల(#Sreeleela): గుంటూరు కారం(#Guntur Kaaram)
అందం, అభినయం, నృత్యం, నటన, అమాయకత్వం కలగలిపిన పుత్తడి బొమ్మ ‘శ్రీలీల’ (Sreeleela). గుంటూరు కారంలో పాటలు అంత బాగా జనాలలోకి వెళ్ళటానికి ఒక కారణం శ్రీలీలతో పాటు ఆవిడ నృత్య ప్రదర్శన. స్వయానా ప్రభుదేవా మాస్టర్ తో ప్రేక్షకులు పోలుస్తున్నారు. ఆఖరికి, సినిమాలో ఆవిడ డాన్స్ చేసే విధానం మీద డైలాగ్ కూడా పెట్టారు. క్యూట్ గా డైలాగ్స్ చెప్పటం, చూపులతో మత్తెక్కించి ఆకట్టుకోవడం ‘శ్రీలీలా’ గారికే సొంతం. కుర్చీని మడతపెట్టి పాటలో వేసిన డాన్స్, బేబీ పాటలో వేసిన క్యూట్ స్టెప్స్ ఇంస్టాగ్రామ్ లో వైరల్ అయ్యాయి కూడాను. ‘వండర్ ఒమెన్’ లాంటి పెర్ఫామెన్స్ కి స్కోప్ ఉన్న ఒక్క సినిమా పడితే హాలివూడ్ స్టార్స్ కి ధీటుగా రావడం ఖాయం.