సినిమాలు ఒక్కటే కాదు, సోషల్ కార్యక్రమాలలో కూడా పాల్గొని మన నటులు గొప్ప మనసుని చాటుకుంటున్నారు. క్రికెట్ ఆటని ఒక మంచి కారణం కోసం ఉపయోగించుకుంటున్నారు. సెలబ్రిటీ క్రికెట్ లీగ్ (CCL) పేరుతో చాలా సంవత్సరాల నుంచి వివిధ చిత్రసీమలు కలిసి ఒక టోర్నమెంట్ కండక్ట్ చేస్తున్నాయి. దానిలో వచ్చిన డబ్బుతో ఒక మంచి పనికి పూనుకుంటున్నారు మన నటులు, నిర్వాహకులు. ఈ క్రమంలోనే ఈ సంవత్సరం ఈ టోర్నమెంట్ దుబాయ్ వేదికగా మొదలయ్యింది. మన తెలుగు వారియర్స్ తమ తొలి ఖాతాని తెరిచింది. తమ మొదటి మ్యాచ్ లో భోజ్పూరి దబాంగ్స్ తో పోటీపడిన తెలుగు వారియర్స్ టీం 8 పరుగుల తేడాతో గెలిచింది. తొలుత బాటింగ్ చేసిన తెలుగు జట్టు నిర్ణీత 10 ఓవర్లు లో మూడు వికెట్ల్స్ నష్టానికి 94 పరుగులు చేసారు, అశ్విన్ బాబు 37 పరుగులు హై స్కోర్ చేసారు. తరువాత భోజ్పూరి జట్టు నిర్ణీత 10 ఓవర్ లలో 103 పరుగులు చేసారు 4 వికెట్లు కోల్పోయి. మళ్ళీ బాటింగ్ కి వచ్చిన తెలుగు వారియర్స్ 118 కొట్టారు ఒక్క వికెట్ నష్టానికి. ఈ సారి కూడా అశ్విన్ బాబు హై స్కోర్ చేసారు, ఆయనకి థమన్ సహకరించారు. తదుపరి బాటింగ్ కి వచ్చిన భోజ్పూరి జట్టు 101 పరుగులు మాత్రమే చెయ్యగలిగింది, 2 వికెట్లు సమర్పించుకుని. తెలుగు వారియర్స్ తరపున రెండు ఇన్నింగ్స్ లోను అశ్విన్ ఎక్కువ పరుగులు చేసారు, భోజ్పూరి నుంచి కూడా ఆదిత్య రెండు సార్లు ఎక్కువ పరుగులు కొట్టారు. ఉత్కంఠమైన పోరులో 8 పరుగుల తేడాతో తెలుగు వారియర్స్ గెలిచారు. తదుపరి మ్యాచ్ వచ్చే శుక్రవారం ఉన్నది, పంజాబ్ జట్టుతో.