- Advertisement -spot_img
HomeUncategorizedమలయాళం సూప్ హిట్ "ప్రేమలు" తెలుగులో రాబోతోందోచ్!

మలయాళం సూప్ హిట్ “ప్రేమలు” తెలుగులో రాబోతోందోచ్!

- Advertisement -spot_img

మలయాళం చిత్రాలు తెలుగులో ఈ మధ్య తెలుగు చిత్రాలతో సరిసమానంగా మంచి స్పందనని గెల్చుకుంటున్నాయి. మలయాళం మాత్రమే కాదు తమిళ చిత్రాలు కూడా అలానే మంచి స్పందనని నోచుకుంటున్నాయి. ఈ మధ్య విడుదల అయిన మలయాళ చిత్రం “ప్రేమలు”. ఒక అద్భుతమైన ప్రేమ కావ్యం. గిరీష్ A.D దర్శకత్వం వహించి సహ రచయిత బాధ్యతలు కూడా చెప్పట్టారు. తెలుగు వాళ్ళకి ఎంతో ఇష్టమైన మలయాళం నటుడు ఫహాద్ ఫాసిల్ సహ నిర్మాత భాద్యతలు నిర్వర్తించగా, దిలీష్ పోతన్ , శ్యామ్ పుష్కరన్ నిర్మాతలుగా వ్యవహరించారు. భావన స్టూడియోస్ పతాకంపై విడుదల అయిన ఈ చిత్రంలో నస్లెన్ కె. గఫూర్, మమిత బైజు నటీనటులుగా చేసారు. మలయాళ చిత్ర సీమ మొత్తం మెచ్చుకున్న ఈ చిత్రాన్ని ఇప్పుడు తెలుగు అనువాద చిత్రం విడుదల అవ్వబోతోంది. దర్శక ధీరుడు రాజమౌళి గారి తనయుడు SS కార్తికేయ మార్చ్ 8వ తేదీన విడుదల చెయ్యబోతున్నారు. ఇప్పటికే మలయాళం వెర్షన్ సూపర్ హిట్ అవ్వగా, కొంతమంది తెలుగు సినిమా ప్రియులు వివిధ వెబ్ సైట్ లలో ఈ చిత్రాన్ని చూడటం జరిగింది కూడాను. ఇప్పుడు ఈ అనువాద వెర్షన్ ని తెలుగు ప్రజలు ఎలాగ ఆదరిస్తారో వేచి చూడాలి మరి.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Stay Connected
44,085FansLike
65,000FollowersFollow
52,453SubscribersSubscribe
Must Read
- Advertisement -spot_img
Related News
- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

You cannot copy content of this page