బాలీవుడ్ ప్రఖ్యాత నటుడు అయినటువంటి షారుఖ్ ఖాన్ తన ట్విట్టర్ వేదికగా ఒక వార్త పంచుకున్నారు. పుష్పా తో పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ వచ్చిన హీరో అల్లు అర్జున్. స్టైలిష్ స్టార్ అని మనం అందరం పిలుచుకుంటాం. కాకపోతే తన తనయుడైన అల్లు అయాన్ చిన్న తనంలోనే ఒక మోడల్ గా ఎదుగుతునట్టు మనం చూస్తూనే ఉన్నాం. ఆడియో ఫంక్షన్లో ఈ బుడతడు చేసే క్యూట్ యాక్టింగ్ కి అందరూ ఫిదా అవ్వాల్సిందే. విషయం ఏంటీ అంటే, అయాన్ కార్ లో షికారుకు వెళుతూ, తన చెల్లి కాళ్ళని తన ఒడిలో పెట్టుకుని, షారుఖ్ ఖాన్ నటించిన డుంకి చిత్రం లో ఫేమస్ అయిన “Lutu Putu Gayaa” పాటని తన స్టైల్ లో క్యూట్ గా పాడారు. ఆ వీడియో నెట్టింట హల్చల్ అయ్యింది. చివరికి ఆ వీడియో షారుఖ్ ఖాన్ దగ్గరికే వెళ్ళింది. ట్విట్టర్ వేదికగా ఆయన ఆ వీడియో ఉన్న ప్రొఫైల్ ని ట్యాగ్ చేసి, అల్లు అర్జున్ ని కూడా ట్యాగ్ చేసి తన ఆనందనాన్ని పంచుకున్నారు. ఇప్పుడు తన పిల్లలకి పుష్పా చిత్రంలోని శ్రీవల్లీ పాటని పాడటం నేర్పిస్తాను అని వ్యక్త పరిచారు. ఇండస్ట్రీ లు వేరు అయినప్పటికీ, అడపా దడపా ఇలాంటి చిన్న చిన్న క్యూట్ సందర్భాల వలన ఇండియన్ స్టార్స్ తమ బంధాన్ని ఇంకా బలపరుచుకుంటున్నారు. షారుఖ్ ఖాన్ చెప్పిన మాట ప్రకారం ఎప్పుడు చేస్తారో వేచి చూద్దాం మరి.