ఏ బాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన నటులలో సుహాస్ కూడా ఒకరు.ఛాయ్-బిస్కేట్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా షాట్ ఫిలిమ్స్ తో తన కెరీర్ స్టార్ట్ చేసిన సుహాస్.ఆ తర్వాత చిన్న చిన్న సైడ్ క్యారెక్టర్స్ చేసుకుంటే ఫైనల్ గా “కలర్ ఫోటో” సినిమాతో హీరోగా మారాడు.ఐతే బెస్ట్ ఫీచర్ ఫిలిం గాను ఈ సినిమాకి నేషనల్ అవార్డు అందుకుంది.ఆ విధంగా తానూ నటించిన తొలి సినిమాతోనే జాతీయ అవార్డు అందుకున్న సినిమాలో నటించిన హీరోగా చరిత్రకెక్కాడు.మొదట్లో నల్లగా ఉన్నాడు ఇతను హీరో ఏంటి అని కామెంట్ చేసినవాళ్ళందరికి టాలెంట్ కి రంగుతో పనిలేదు అని నిరూపించాడు సుహాస్.కేవలం హీరోగానే కాకుండా విల్లన్ గాను “హిట్-2” సినిమాలో తన సక్త చాటాడు సుహాస్.ఇటీవల కాలంలో సుహాస్ నటించిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని సాధించాయి.దీనితో ఇప్పుడు మినిమం గ్యారంటీ హీరోస్ లిస్ట్ లో సుహాస్ కూడా చేరిపోయాడు.ఐతే ఇప్పుడు సుహాస్ చేయబోయే తన తదుపరి చిత్రాల పైన అందరి దృష్టి మళ్లింది.అందుకు తగ్గట్టే సుహాస్ కూడా తన తర్వాతి సినిమాల విషయంలో ఆచి తూచి అడుగులేస్తున్నాడు.అందుతున్న సమాచారం ప్రకారం తన తర్వాతి సినిమాలు కూడా యంగ్ డైరెక్టర్స్ తోనే చేస్తున్నట్లు తెలుస్తుంది.సుహాస్ తన తర్వాతి చిత్రాలు “శ్రీ రంగ నీతులు”,”ఆనందరావ్ అడ్వెంచర్స్” అనే రెండు సినిమాలు చేస్తున్నాడు.వీటితో పాటు ఇంకో బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే “సలార్” సినిమా కి డైలాగ్ రైటర్ గా పనిచేసిన సందీప్ రెడ్డి బండ్ల అనే రైటర్ తో ఓ సినిమా చేయబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. మరి ఇది యెంత వరకు నిజమో తెలియదు.ఒకవేళ ఇది గనుక నిజమైతే టాలీవుడ్ లో సుహాస్ ఇంకో సెన్సేషన్ అవ్వడం ఖాయం.