చిత్రం: ఆపరేషన్ వాలెంటైన్
రేటింగ్: 2.5/5
బాటమ్ లైన్: “ఆపరేషన్ ఇంకంప్లీట్”!
నటీనటులు: వరుణ్ తేజ్, మానుషి చిల్లర్, రుహాని శర్మ, నవదీప్ తదితరులు
సంగీతం: మిక్కీ.జె.మేయర్
నిర్మాత: సందీప్ ముద్దా
దర్శకత్వం: శక్తీ ప్రతాప్ సింగ్
విడుదల: 1 మార్చి 2024
మెగా కుటుంబంలో ఎంతోమంది హీరోస్ వచ్చారు గాని వాళ్లలో అందరికన్నా చూడగానే కొంచం కలర్, హైట్, పర్సనాలిటీ ఇలా అన్నిట్లోనూ చూడటానికి ఓకే ఇతను హీరో మెటీరియలే అని అనిపించుకున్న హీరోస్ లో చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు తర్వాత “వరుణ్ తేజ్” నే. అతని స్క్రిప్ట్ సెలక్షన్ కూడా ఆ కుటుంబంలోని హీరోస్ కన్నా కొంచం వైవిధ్యభరితంగా ఉంటుంది. తొలి సినిమా ముకుంద లో “యూత్ లీడర్” గా, కంచే లో సోల్జర్ గా, ఫిదా,తొలిప్రేమ సినిమాలో లవర్ బాయ్ గా. ఎఫ్-2,3 సినిమాలో తనలోని కామెడీ యాంగిల్. ఇలా ప్రతీ సినిమాలో విభిన్నమైన క్యారెక్టర్స్ చేసుకుంటూ వచ్చాడు. మెగా కుటుంబంలో కెరీర్ ఆరంభం నుంచి ఇన్ని వైవిధ్యమైన క్యారెక్టర్స్ చేసిన నటుడు మాత్రం వరుణ్ తేజ్ నే. ఆఖరికి రాంచరణ్,అల్లు అర్జున్ కూడా ఇప్పుడు డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తున్నారు. మొదట్లో వీళ్లిద్దరు కూడా మూస పద్దతిలోనే సినిమాలు చేసుకుంటా వచ్చారు. అలాంటి వరుణ్ తేజ్ కూడా గత కొంతకాలంగా సరైన హిట్ లేక సతమతమవుతున్నాడు. వరుణ్ తేజ్ చేసిన గత సినిమాలు చుస్తే “గాండీవదారి అర్జున”,”ఎఫ్ -3″,”గని” ఇలా ఒకదానికి మించి మరొకటి డిజాస్టర్స్. ఎఫ్-3 పర్వాలేదనిపించుకున్నప్పటికీ మిగిలిన చిత్రాలు ఎప్పుడొచ్చాయో కూడా చాలామందికి తెలియదు. ఇటీవలే పెళ్లి చేసుకున్న వరుణ్ తేజ్, పెళ్లి తర్వాత మరోసారి “ఆపరేషన్ వాలెంటైన్” అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ సినిమాతో వరుణ్ తేజ్ తన పరాజయపరంపరానికి చెక్ పెట్టి మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కాడో లేదో ఇప్పుడు తెలుసుకుందాం.
కధ:
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో అర్జున్ రుద్రా( వరుణ్ తేజ్ ) ఒక వింగ్ కమాండర్. అతని భార్య ఆహ్నా గిల్( మానుషి చిల్లర్ ) కూడా ఎయిర్ ఫోర్స్ లో మరోక ఆఫీసర్. 2019 లో జరిగిన “పుల్వామా” దాడిలో చనిపోయిన 40 మంది ఇండియన్ సైనికులకు నివాళి అర్పించటానికి, పోయిన ప్రాణాలకు ప్రతీకారంగా అది చేసిన బృందాన్ని రూపుమాపే క్రమంలో భారత ఎయిర్ ఫోర్స్ దళం పాకిస్థాన్ మీద ఎలా గెలిచింది అనేది అసలు కథ.
విశ్లేషణ:
నిజానికి ఇది సినిమా కాదు డాక్యుమెంటరీ అనే చెప్పాలి. “పుల్వామా” దాడి యెక్క డాక్యుమెంటరీ నే దర్శకుడు “ఆపరేషన్ వజ్ర” అనే మరో కల్పిత అంశాన్ని జోడించి సినిమా కధకు కావాల్సిన నాటకీయతను సృష్టించాడు. ఇప్పటికే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మీద హిందీ లో బొచ్చెడు సినిమాలొచ్చాయి. తెలుగు లో కూడా “అడివి శేష్” పుణ్యమా అని తరచూ ఇలాంటి కథలు వస్తూనే ఉన్నాయి. ఐతే ఈ జోనర్ లో ఎన్ని సినిమాలొచ్చినా పుల్వామా దాడి అంశాన్ని మాత్రం ఇంతవరకు ఏ దర్శకుడు టచ్ చేయలేదు. మొదటి సారి ఇందులోనే టచ్ చేసారు.దీనితో సినిమా చూస్తున్నంత సేపు ఏదో రొటీన్ సినిమాగా కాకుండా ఫ్రెష్ సినిమా చూస్తున్నాము అనే భావన కల్గుతుంది. ఈ విషయంలో మాత్రం డైరెక్టర్ కి పూర్తి క్రెడిట్ ఇవ్వాల్సిందే. ఇంక ఈ సినిమాలో మరో మేజర్ పాయింట్ ఏంటంటే ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్స్ చేసే పోరాట సన్నివేశాలు. ఆ సన్నివేశాలు మాత్రం ప్రేక్షకులకి ఒక కొత్త అనుభూతినిస్తుంది.
నటీనటుల పనితీరు:
ముందుగా వరుణ్ తేజ్ గురించే మాట్లాడుకోవాలి. వింగ్ కమాండర్ పాత్రలో అతని ఫిజిక్ సరిగ్గా సరిపోయింది. అతని నటన మాత్రం సినిమా ఆడియో లాంచ్ లో నాగబాబు చెప్పినట్టు, అతని ఎత్తు వల్లే ఏమి చేయకపోయినా ఏదో చేసినట్టే అనిపించింది. మానుషి చిల్లర్ కి తెలుగులో ఫస్ట్ సినిమానే ఐనా మంచి స్కోప్ ఉన్న పాత్రే దొరికింది. ఆవిడ పాత్ర యొక్క నిడివి కూడా హీరో క్యారెక్టర్ కి సరిసమానంగానే ఉంది. నవదీప్ క్యారెక్టర్ నిడివి కొంచం తక్కువనే ఉన్నాకూడా తన ఇంపాక్ట్ సినిమా మొత్తం ఉంటుంది. రుహాని శర్మ క్యారెక్టర్ ఐతే ఫైటర్ పైలట్ లో వన్ అఫ్ పైలట్ అంటే. మిగితవారు తమ,తమ పాత్రలకి తగట్టు బానే చేసారు.
సాంకేతిక విభాగం పని తీరు:
ఈ సినిమా లో అన్నిటికంటే ప్లస్ పాయింట్ ఏంటంటే విసువల్ ఎఫెక్ట్స్. ముఖ్యంగా ఎయిర్ స్ట్రైక్స్ సంబంధించి విసువల్స్ ఐతే కనులవిందుగా ఉన్నాయి. ఎడిటింగ్ వర్క్ కూడా చాలా బాగుంది. నేపధ్య సంగీతం కూడా పర్వాలేదనిపిస్తుంది కానీ యుద్ధ సమయంలో ఇంకా ఉంటే బాగుంటుందనిపిస్తుంది. కెమెరామాన్ పనితీరు కూడా బాగుంది. నిర్మాతలు ఖర్చుకి ఎక్కడా కూడా రాజీపడలేదు. ప్రతీ ఫ్రేమ్ లోను ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. చివరిగా దర్శకుడు “శక్తీ ప్రతాప్ సింగ్” కధైతే చాలా మంచిది ఎంచుకున్నాడు. కానీ దానికి తగ్గట్టు కధనం మాత్రం అంత ఎఫెక్టివ్ గా రాసుకోలేకపోయాడు. ఫస్ట్ హాఫ్ కూడా ఈ సినిమాకి మరో మైనస్ పాయింట్. సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులకి ఓకే సినిమా బానే ఉంది అనిపిస్తుంది. కానీ ఎక్కడో చిన్న అసంతృప్తి కల్గుతుంది. ఆ అసంతృప్తి కీ కారణమే పాత్రల మధ్య ఎమోషన్ మిస్ అవ్వడం. అది భార్య భర్తల మధ్య ఎమోషన్ గాని ముఖ్యంగా నవదీప్ క్యారెక్టర్ కీ హీరో క్యారెక్టర్ మధ్య ఉన్న స్నేహ బంధాన్ని సరిగ్గా చూపించలేక పోయాడు దర్శకుడు. దానితో పాటు పుల్వామా దాడిలో 40 మంది భారతీయ జవాన్లు చనిపోయినప్పుడు అక్కడ కూడా ఎమోషన్ సరిగా బిల్డ్ అవ్వకపోవడం తో పాటూ కధనం లో ఇంకా కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయి.
ఓవరాల్:
సినిమా అంతా బానే ఉంది గాని దర్శకుడు ఇంకాస్త స్క్రిప్ట్ మీద శ్రద్ధ పెడితే బాగుండు అనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఒక మంచి కధని దర్శకుడు చేసిన చిన్న చిన్న పొరపాట్లు వళ్ల కల్ట్ క్లాసిక్ అవ్వాల్సిన సినిమా సగటు స్థాయి చిత్రం వరకే పరిమితమవ్వడం బాధ కల్గిస్తుంది.
బాటమ్ లైన్: బానే ఉంది కానీ !
రివ్యూ బై: నవీన్ మదినేని