- Advertisement -spot_img
HomeUncategorizedలవ్ మీ అంటున్న "బేబీ" భామ!

లవ్ మీ అంటున్న “బేబీ” భామ!

- Advertisement -spot_img

“బేబీ” సినిమాతో కుర్రకారుని షేక్ చేసిన వైష్ణవి చైతన్య. ఇప్పుడు “లవ్ మీ ఇఫ్ యూ డేర్” అంటూ మరోసారి కుర్రకారుని ఊరిస్తుంది వైష్ణవి. విజయవాడ కి చెందిన ఈ పాప మొదట్లో టిక్ టాక్ వీడియోస్ తో మంచి ఫేమస్ అయ్యింది. ఆ తర్వాత షణ్ముఖ్ జస్వంత్ తో చేసిన “Software Developers” వెబ్సెరీస్ తో ఈ అమ్మడి ఫేట్ మారిపోయింది. ఆ తర్వాత నాని “టక్ జగదీశ్”, అజిత్ “వాలీమై” ఇలా పలు సినిమాలు చేసినప్పటికీ నటిగా మంచి బ్రేక్ వచ్చింది మాత్రం “బేబీ” సినిమాతోనే. ఆ సినిమాలో ఈ అమ్మడి రొమాంటిక్ యాంగిల్ కు యూత్ ఫిదా అయిపొయింది. బేబీ సినిమా వైష్ణవి వల్లే బాగా ఆడిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సినిమాతో ఎక్కడికో వెళ్ళిపోతుంది అనుకున్న కానీ విచిత్రంగా ఈ సినిమా తర్వాత ఆఫర్స్ కరువయ్యాయి వైష్ణవికి. మళ్లీ ఎట్టకేలకూ హీరోయిన్ గా ఇంకో ఛాన్స్ కొట్టేసింది. ఈసారి ఏకంగా దిల్ రాజు చేతిలో పడింది ఈ అమ్మడి జాతకం. దిల్ రాజు మేనల్లుడు అయిన ఆశిష్ హీరోగా తన మూడవ చిత్రంలో వైష్ణవి చైతన్య ని హీరోయిన్ గా ఎంపిక చేసారు. ఈ సినిమా కి “లవ్ మీ ఇఫ్ యూ డేర్” అనే టైటిల్ ని ఖరారు చేసారు. తెలుగు లో ఇంతవరకు ఎప్పుడు చూడనటువంటి ఒక కొత్త కాన్సెప్ట్ దెయ్యాన్ని ప్రేమించడం అనే విచిత్రమైన కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. నిన్న నే గ్రాండ్ గా ఈ సినిమాని లాంచ్ చేసారు దిల్ రాజు. ఈ సినిమాతో అరుణ్ అనే ఒక కొత్త దర్శకుడు ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయమవుతున్నాడు. ఈ సినిమా ని 60రోజులు లోపు షూటింగ్ పూర్తి చేసి. వచ్చే ఏప్రిల్ 27 వ తారీఖున రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Stay Connected
44,085FansLike
65,000FollowersFollow
52,453SubscribersSubscribe
Must Read
- Advertisement -spot_img
Related News
- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

You cannot copy content of this page