“గామి” మూవీ రివ్యూ:
చిత్రం: గామి
రేటింగ్: 2.75/5
బాటమ్ లైన్: గందరగోళం
తారాగణం: విశ్వక్ సేన్, చాందిని చౌదరి, అభినయ, మొహమ్మద్ సమద్ తదితరులు.
సంగీతం: నరేష్ కుమారన్
నిర్మాత: కార్తీక్ శబరీష్
దర్శకత్వం: విద్యాధర్ కాగిత
విడుదల: 8 మార్చి 2024
ఎప్పుడో 2018లో విడుదలైన విశ్వక్ సేన్ చిత్రం “ఈ నగరానికి ఏమైంది” సినిమా కంటే ముందే షూటింగ్ స్టార్ట్ చేసిన ఈ చిత్రం, పలు కారణాల వాళ్ల సుదీర్ఘ కాలం చిత్రీకరణ జరుపుకొని ఫైనల్ గా ఈరోజు ప్రేక్షకుల ముందుకి వచ్చింది. తెలుగు సినిమా చరిత్రలోనే సుమారు ఆరున్నర సంవత్సరాల పాటు చిత్రీకరణ జరుపుకున్న సినిమా అంజి తరువాత బహుశ “గామి” నే కావొచ్చు. ఇన్నాళ్లు విశ్వక్ సేన్ సినిమాలంటే ఒక సాదాసీదా గా ఉంటాయి. అరిగిపోయిన, నాసిరకమైన కధలతోనే సినిమాలు చేస్తాడన్న విమర్శ ఉంది విశ్వక్ సేన్ పైన. అలాంటి విశ్వక్ సేన్ తొలిసారి తన కంఫర్ట్ జోన్ నుంచి బయటికొచ్చి అఘోరా గా ఈ సినిమాకు సంభందించిన పోస్టర్స్ లో కనిపించడంతో సినిమా పై క్యూరియాసిటి పెరిగింది.దానికి తోడు ప్రచార చిత్రంలో మానవ స్పర్శ తగిల్తే చనిపోతాడు అనే కధకు సంభందించిన పాయింట్ బయటికి రావడం సినిమా పై ఆసక్తి మరింత పెరిగింది. మరి ప్రేక్షకుల అంచనాలకి తగట్టు సినిమా ఉందో లేదో ఇప్పుడు చూద్దాం.
కధ:
శంకర్ అనే ఒక అఘోరా( విశ్వక్ సేన్) ఒక అరుడైన జబ్బుతో బాధపడుతుంటాడు. ఎవరైనా మానవుడి స్పర్శ అతనికి తాకితే అతని చర్మం రంగు మారడంతో పాటు విపరీతమైన తలపోటుకు గురవుతుంటాడు. అతని సమస్య కి పరిష్కారం హిమాలయాల్లో ప్రతి 36ఏళ్ళకి ఒకసారి పూసే మాలిపత్రాలు మాత్రమే అని ఒక సిద్ధుడు చెపుతాడు. వెంటనే ఆ మాలిపత్రాలు కోసం జాహ్నవి(చాందిని చౌదరి ) అనే ఒక డాక్టర్ తో కలిసి బయల్దేరతాడు శంకర్. ఈ ప్రయాణం లో శంకర్ ఆ మాలిపత్రాలు కోసం చేసిన సాహసాలు,పోరాట ఘట్టాలు చివరిగా శంకర్ తన సమస్య ని పరిష్కారించుకున్నాడా లేదా అనేది అసలు కధ. ఐతే ఒక వైపు శంకర్ కధతో పాటు మరొకచోట ఒక యువకుడు నిర్బంధనలో ఉంటాడు. అక్కడికి నుంచి తప్పించుకొని బయటపడడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తాడు. దీనితో పాటూ ఒక గ్రామంలో ఉమ అనే ఒక అమ్మాయి దేవదాసిగా మార్చే ప్రయత్నం చేస్తుంటారు. ఆమె అక్కడ నుంచి తప్పించుకోవాలనుకుంటుంది. ఈ రెండు కధలు శంకర్ కధకి ఉపకథలుగా ఉంటాయి. అసలు ఈ మూడు కథలేంటి. ఈ కధలకి శంకర్ కీ ఉన్న సంబంధం ఏంటి అన్న విషయాలు సినిమా చూసే తెలుసుకోవాలి.
విశ్లేషణ:
ప్రతి 12ఏళ్ళ కీ ఒకసారి పుష్కారాలు వస్తాయి అన్నట్లు. సేమ్ ఇలాంటి కథలతో సినిమాలు కూడా అరుదుగా వస్తాయి. హాలీవుడ్లో ఇలాంటి కధలు తరుచుగా వస్తుండొచ్చు కానీ భారతీయ చలన చిత్రాలలో మాత్రం ఇలాంటి కధలు రేర్. ఇంక గట్టిగా మాట్లాడుకుంటే ఇలాంటి కథలతో ఇండియన్ సినిమాస్ లో వచ్చిన సినిమాలు కేవలం రెండు. ఆ రెండు కూడా తెలుగు సినిమాలే అవ్వడం విశేషం. అందులో ఒకటి ఈ గామి సినిమా అవ్వగా. ఇంకోకటి ప్రశాంత్ వర్మ “అ!” చిత్రం. కొద్దిగా దగ్గర పోలికలు ఉన్నప్పటికీ కొంతమేరకు కథాంశం అలానే అనిపిస్తుంది చూసేవాళ్ళకి. కానీ టేకింగ్ విషయంలో రెండూ విభిన్నంగా ఉన్నాయి.
నటీనటుల పనితీరు:
ఇన్నాళ్లు జులాయి గా అమ్మయిల వెంటపడే రోమియో గా కనిపించిన విశ్వక్ సేన్. ఇందులో మాత్రం కొంచం వైవిధ్యభరితమైన అఘోరా పాత్రలో కనిపించాడు. తన పాత్రకి డైలాగ్స్ తక్కువే ఐనప్పటికీ అఘోరా క్యారెక్టర్లో ఒదిగిపోయాడు. ప్రతి ఫ్రేమ్ లో అతని కష్టం కనిపిస్తుంది. చాందిని చౌదరి పాత్రకి హీరో క్యారెక్టర్ మాదిరే ఒక లక్ష్యం ఉన్నపటికీ మధ్యలోనే ఆవిడా పాత్ర గాడి తప్పుతుంది. ఆవిడ క్యారెక్టర్ కి అంతిమ లక్ష్యం మాత్రం చూపించేలేదు. తల్లిగా నటించిన అభినయ క్యారెక్టర్ కి మంచి ఇంపార్టెన్స్ ఉంది. బాల నటిగా చేసిన హారిక కూడా చక్కగా చేసింది. మిగిలిన వారంతా కొత్త మొఖాలే అయినా తమ పాత్రలకి తగ్గట్టు బాగా చేశారు.
సాంకేతిక విభాగం పనితీరు:
ఈ చిత్రానికి మేజర్ హైలెట్ విజువల్స్. హిమాలయాల్లో హీరో పోరాట విసువల్స్ గ్రాండ్ గా ఉంటాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది. ముఖ్యంగా పోరాట సన్నివేశాలలో మరింత రక్తి కటించాడు తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో మ్యూజిక్ డైరెక్టర్. నిర్మాతలు కూడా ఎక్కడ ఖర్చుకి వెనకాడకుండా బాగా తీశారు. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. మిగిలిన డిపార్ట్ మెంట్స్ వారు కూడా తమ కర్తవ్యాన్ని బాగా నెరవేర్చారు. చివరిగా దర్శకుడి పని తీరు గురించి మాట్లాడుకుంటే. ముందుకు ఇలాంటి కధ ఎంచుకున్నందుకు అతనికి సలామ్. కానీ మూడు కధల్ని లింక్ చేసిన విధానం గందరగోళంగా ఉంటుంది. సినిమా మొదలైన దగ్గరుంచి క్లైమాక్స్ వరకు ఈ మూడు కధలకి సంబంధం ఏంటో అర్థంకాదు. పైగా ఒక కధ నుంచి మరొక కధ కీ షిఫ్ట్ అయ్యే మధ్య వచ్చే జంప్ కట్స్ ఆడియన్స్ ని ఇబ్బందికి గురి చేస్తాయి. ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త శ్రద్ధ తీసుకుంటే బాగుండు అనిపిస్తుంది. ఇలాంటి చిన్న చిన్న విషయాలు తప్పించి మిగితా విషయాల్లో అంతా బానే ఉంది.
ఓవరాల్: కొత్తదనాన్ని అడ్వెంచర్స్ సినిమాలు బాగా ఇష్టపడే వాళ్ళకి ఈ సినిమా బాగా నచ్చుతుంది. లేదు సరదాగా కాలక్షేపం కోసం వెళ్తే మాత్రం ఈ సినిమా మింగుడు పడడం కష్టమే.