- Advertisement -spot_img
HomeUncategorized"భీమా" మూవీ రివ్యూ: "Bhimaa" Movie Review

“భీమా” మూవీ రివ్యూ: “Bhimaa” Movie Review

- Advertisement -spot_img

చిత్రం: భీమా
రేటింగ్: 2.75/5
బాటమ్ లైన్: “గోపీచంద్” మాస్ అవతారం
తారాగణం: గోపీచంద్, మాళవికా శర్మ, ప్రియా భవాని శంకర్, నాజర్, నరేష్, ముకేశ్ తివారి, పూర్ణ తదితరులు.
సంగీతం: రవి బసృర్
ఎడిటర్: తమ్మిరాజు
సినిమాటోగ్రఫీ: స్వామి జె. గౌడ
నిర్మాత: కె.కె . రాధామోహన్
దర్శకత్వం: ఎ. హర్ష
విడుదల: 8 మార్చి 2024

గోపీచంద్ గారిని అందరం మాచో స్టార్ అని పిలుచుకుంటాం. ఆ బాడీ కి మంచి యాక్షన్ మూవీ పడితే బాగుంటుంది అని ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు సినీ ప్రియులు. వాళ్ళ కోరిక మేరకు ఎట్టకేలకు వచ్చిన మాస్ చిత్రం “భీమా”. టైటిల్ రోల్ లో గోపీచంద్ గారు నటించారు. ఆయన సరసన ఇద్దరు ముద్దుగుమ్మలు ప్రియా భవాని శంకర్, మాళవికా శర్మ మెరిశారు. ఎ. హర్ష దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీ సత్య సాయి ఆర్ట్స్ పతాకంపై కె. కె. రాధామోహన్ నిర్మించారు. ఈ చిత్రం మహాశివరాత్రి పర్వదినాన ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఎన్నాళ్లగానో మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న గోపీచంద్ గారికి ఈ చిత్రం ఎలాంటి ఫలితాన్ని ఇవ్వబోతోంది అనేది ఈ రివ్యూ లో తెలుసుకుందాం.

కధ:

కథ ప్రకారం మహేంద్రగిరి అనే ఊరికి ఒక నియంత లాంటి వాడు భవాని(ముకేశ్ తివారి). అదే ప్రాంతానికి సబ్ ఇన్స్పెక్టర్ గా వస్తాడు భీమా (గోపీచంద్). భవానిని భీమా ఊరిలోకి రాగానే తగులుకుని వార్నింగ్ ఇస్తాడు. ఏకుకి మేకై కూర్చుతాడు. తన రహస్య ట్యాంకర్ రవాణా మీద నిఘా పెడతాడు. ఇదిలా ఉండగా, భీమా ఆ ఊరి స్కూల్ టీచర్ అయిన విద్య (మాళవిక) ప్రేమలో పడతాడు. తన వలన రవీంద్ర వర్మ (నాజర్) అనే ఒక ఆయుర్వేద వైద్యుడిని కాలుస్తాడు. ఆయనకి ఆ ఊరిలో చాలా గొప్ప పేరు ఉంటుంది, ఎటువంటి జబ్బునైనా నయం చెయ్యగల సమర్థులు. రవీంద్ర వర్మ ఆ ఊరిలో ఉన్న ఒక గుడి సమస్య విషయంలో భీమా సహాయం అడుగుతారు. అక్కడనుంచి అసలు సమస్య మొదలవుతుంది. భీమా కి మధ్యలో వచ్చే రామా పాత్రకి సంబంధం ఏమిటి? ఆ ఊరి గుడికి ఏమయ్యింది ? పారు కి రామా కి సంబంధం ఏమిటి? ఆ గుడికి వచ్చిన సమస్య ఎటువంటిది? ఇవన్నీ తెలుసుకోవాలి అంటే భీమా చూడాల్సిందే.

విశ్లేషణ:

చూడటానికి ఇది ఒక సాధారణ కథా ప్రక్రియ. ఇది వరుకు మనం కొన్ని చిత్రాలలో ఇలాంటి కథాంశం ఉండటం గమనించాం. కాకపోతే కన్నడ దర్శకుడు అయిన హర్ష గారికి తెలుగు పాత చిత్రాల మీద అవగాహన ఉంది ఈ చిత్రం కథ రాసారో లేదో అనిపిస్తుంది. రామా పాత్ర అయితే ఇప్పటిదాకా అలాంటి పాత్ర ఎన్టీఆర్, అల్లు అర్జున్ ఇంకా చాలా మంది ప్రముఖ నటులు చేసేసినటువంటిది. విల్లన్ గా ముకేశ్ తివారి విల్లనిజం చూపిద్దామని ప్రయత్నించినప్పటికీ హీరో కి ఇచ్చిన మాస్ ఎలివేషన్ వలన అవన్నీ గాల్లో కలిసిపోతాయి. మొదటి భాగంలో వచ్చిన ప్రేమ సన్నివేశాలు కొన్ని వర్గ ప్రేక్షకులకి అయితే నచ్చని నచ్చవు. సరిగ్గా వెళుతోంది అనుకునే టైంకి హీరోయిన్ ఎంట్రీ ఇచ్చారు, తరువాత వాళ్ళ మధ్య వచ్చిన సన్నివేశాలు ఇబ్బందికరంగా మారాయి. ఇంటర్వెల్ పోర్షన్ చాలా బాగుంది, ప్రీ-క్లైమాక్స్ లో జరిగిన పోర్షన్ బాగుంది, క్లైమాక్స్ ఇంకా మంచిగా తీయొచ్చు అనిపించేలా ఉన్నది. మాస్ అభిమానులకి మంచి అనుభూతిని ఇస్తుంది ఈ చిత్రం. కానీ ఈ మధ్య వచ్చే మెడికల్ మాఫియా, చేతబడి, బలిదానం ఇలాంటి అన్నీ కలిపి కొట్టిన చిత్రం భీమా. అదొక్కటే నిరుత్సాహ పరిచింది.

నటీనటుల పనితీరు:

ఎప్పటికప్పుడు మంచి పాత్రలని పోషించే గోపీచంద్ గారు సరైన హిట్ పడక సతమతమవుతున్నారు. భీమా పాత్రకి ఆయన తప్ప ఇంకెవ్వరూ న్యాయం చెయ్యలేరు అనిపించారు. చిన్న పాత్ర అయినప్పటికీ మాళవిక, ప్రియా భవాని శంకర్ అలరించారు. మాళవిక అందాలని ఒక మోస్తాదులో ఆరపోశారు, ప్రియా గారు పొందికైన ఆడపిల్లలాగా కనువిందు చేసారు. నాజర్ గారి పాత్రకి ఒక ప్రత్యేకత ఉంది. స్టోరీ పరంగా మంచిగా రాసుకున్నప్పటికీ తీసే విధానంలో అక్కడక్కడా లయ తప్పింది. రవి బాబు, చమ్మక్ చంద్ర తో చూపిద్దామనుకున్న కామెడీ అంతగా ఆకట్టుకోలేదు. వెన్నెల కిషోర్ చేసిన కామెడీ కూడా అంతంతమాత్రమే. నరేష్ గారి పాత్ర చిన్నదయినప్పటికీ ఒక మోస్తరులో బానే ఉంది అనిపిస్తుంది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఇంకాస్త మంచిగా తీసి ఉంటే ఇంకా అద్భుతంగా పండేది చిత్రం.

సాంకేతిక విభాగం పనితీరు:

ఈ చిత్రానికి పోరాటాలు, సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ చాలా బలాన్ని చేకూర్చాయి. కన్నడ మ్యూజిక్ డైరెక్టర్ రవి తన వంతు పాత్ర మంచిగా పోషించారు, ప్రతి ఎలివేషన్ సీన్ కి మంచి మ్యూజిక్ ఇచ్చారు. హీరో ఇంట్రడక్షన్ సాంగ్ కూడా బాగుంది, కానీ అంతగా ప్రజలలోకి వెళ్లేలా అయితే లేదు. పోరాట సన్నివేశాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ చాలా బలాన్ని ఇచ్చింది. ఎక్కువగా రాత్రి పూట సన్నివేశాలు ఉండటం వలన ఆయనకి పని ఎక్కువనే పడింది. ప్రతీ సన్నివేశంలో ఒక కొత్త థ్రిల్లర్ ఎలిమెంట్ పెట్టారు. చివరిదాకా కారణం తెలియదు చూసేవాళ్ళకి. చివర్లో చూపించిన విధానం డైరెక్టర్ ని మెచ్చుకోవచ్చు. తెలుగు ఆడియన్స్ పల్స్ తెలుసుకుని పని చేసారు. కానీ ఆ పల్స్ ఇంకా సరిగ్గా తెలుసుకుని ఉంటే ఇంకా బాగుండేది చిత్రం రిసల్ట్. దర్శకుడు హర్ష తెరకెక్కించిన విధానం అభినందనీయం. నిర్మాణ విలువలు పుష్కలంగా ఉన్నాయి, నిర్మాత ఎక్కడా కూడా వెనుకడుగు వెయ్యలేదు అని స్పష్టంగా తెలుస్తోంది.

ఓవరాల్: మాస్ ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకుని తీసిన చిత్రం భీమా. శివరాత్రికి మంచి శివుడి రిఫరెన్స్ ఉన్న చిత్రం చూశామని ఫీలింగ్ మాత్రం వస్తుంది.

రివ్యూ బై : సాయిరాం తాడేపల్లి

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Stay Connected
44,085FansLike
65,000FollowersFollow
52,453SubscribersSubscribe
Must Read
- Advertisement -spot_img
Related News
- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

You cannot copy content of this page