- Advertisement -spot_img
HomeUncategorized"ఆ ఒక్కటి అడక్కు" టీజర్ రివ్యూ: "Aa Okkati Adakku" teaser review

“ఆ ఒక్కటి అడక్కు” టీజర్ రివ్యూ: “Aa Okkati Adakku” teaser review

- Advertisement -spot_img

నట కిరీటి రాజేంద్రప్రసాద్ గారి సూపర్ హిట్స్ చిత్రాలలో ఒకటైన చిత్రం “ఆ ఒక్కటి అడక్కు”. ఈ చిత్రానికి అల్లరి నరేష్ తండ్రి E.V.V. సత్యనారాయణ గారు దర్శకత్వం వహించారు. రాజేంద్రప్రసాద్, రంభ హీరోహీరోయిన్స్ గా నటించిన ఈ చిత్రం ఒక కల్ట్ క్లాసిక్. మళ్లీ ఇదే టైటిల్ పెట్టుకొని ఈసారి అల్లరి నరేష్ రాబోతున్నాడు. కెరీర్ ఆరంభం నుంచి హాస్యాస్పద చిత్రాలతో మినిమం గ్యారెంటీ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న అల్లరి నరేష్. ఆ తర్వాత ఈ ఫ్లో ని కొనసాగించలేకపోయాడు. దీనితో మధ్యలో కొన్నాళ్ళు ఈ కామెడీ ట్రాక్ నుంచి బయటకొచ్చి నాంది, మారేడుమిల్లి నియోజకవర్గం వంటి సీరియస్ సినిమాలు చేసి మంచి విజయాలు సైతం అందుకున్నాడు. మళ్లీ ఇన్నాళ్లకు ఆ ఒక్కటి అడక్కు తనకి అచొచ్చిన కామెడీ ఫార్మట్లోకే వచ్చారు. అల్లరి నరేష్ “జాతిరత్నాలు” ఫేమ్ ఫరియా అబ్దుల్లా హీరోహీరోయిన్స్ గా చేసిన ఈ చిత్రానికి సంభందించిన టీజర్ని ఈరోజు రిలీజ్ చేశారు. టీజర్ అమాంతం సరదాగా సాఫీగా సాగిపోయింది. చాలాకాలం తర్వాత అల్లరి నరేష్ తన ఫేవరెట్ ట్రాక్లో ఇరగదీసాడు. పెళ్లి కాని యువకుడి పాత్రలో మరోసారి నవ్వులు పూయించడానికి రెడీ అయ్యాడు. ఈ సినిమాతో మల్లి అంకం అనే ఒక నూతన దర్శకుడు పరిచయం కాబోతున్నాడు. గోపి సుందర్ ఈ సినిమాకి సంగీతం సమకూరుస్తున్నారు. ఆధ్యంతం నవ్వులు పూయించారు టీజర్ లో. నరేష్ తో పాటుగా వైవా హర్ష, వెన్నల కిషోర్ కామెడీ టైమింగ్ చాలా బాగుంది. పెళ్లి చేసుకోవాలనే తపన, దానికోసం ఒక యువకుడు పడిన పాట్లు కామెడీ గా చూపించే ప్రయత్నం చేసారు దర్శకులు. చాలా సంవత్సరాల తరువాత అల్లరి నరేష్ గారు, తనకి ఎంతగానో అనుకూలమైన కామెడీ పధంలో అడుగుపెట్టారు. ఈ వేసిన అడుగు తనకి మంచి విజయాన్ని చేకూరుస్తుంది అని ఆశిద్దాం. వేసవి సేవల హంగామాతో ఈ చిత్రం మన ముందుకి రాబోతోంది.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Stay Connected
44,085FansLike
65,000FollowersFollow
52,453SubscribersSubscribe
Must Read
- Advertisement -spot_img
Related News
- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

You cannot copy content of this page