- Advertisement -spot_img
HomeUncategorizedఘనంగా మృణాల్, విజయ్ పెళ్లి పాట: ది ఫామిలీ స్టార్ నుంచి పెళ్లి పాట విడుదల

ఘనంగా మృణాల్, విజయ్ పెళ్లి పాట: ది ఫామిలీ స్టార్ నుంచి పెళ్లి పాట విడుదల

- Advertisement -spot_img

ఫ్యామిలీ మూవీస్ దర్శకత్వంతో పాపులర్ అయిన దర్శకుడు పరశురామ్. గీత గోవిందం చిత్రంతో రౌడీ హీరో విజయ్ దేవరకొండ కి మంచి హిట్ ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ ఆయనతోనే సినిమా చేస్తున్నారు. అదే “ది ఫామిలీ స్టార్” చిత్రం, మృణాల్ ఠాకూర్ నాయికగా చేస్తున్నారు, దిల్ రాజు , శిరీష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు ఈ చిత్రాన్ని. గోపి సుందర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుంచి ఒక పెళ్లి పాట విడుదల అయ్యింది. మోగ్లీ, కార్తీక్ పాడిన ఈ పాటని అనంత్ శ్రీరామ్ గారు రచించారు. ఇది ఒక ఘనమైన రీతిలో జరిగే పెళ్లి దృశ్యం, ఆ పెళ్లి కార్యక్రమాలు జరుగుతున్న వేళ, చేసిన సందడి, కోలాహలం చాలా బాగా చూపించారు. ఈ సాంగ్ లిరిక్స్ కూడా ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. “కళ్యాణి వచ్చా వచ్చా” అంటూ సాగే ఈ పాటకి మోగ్లీ వాయిస్ చాలా బాగా కుదిరింది. ఎప్పుడూ హుషారుగా ఉండే పాటలు పడే మోగ్లీ ఇలాంటి పెళ్లి తరహా పాట పడటం ఒకింత ఆశ్చర్యాన్ని గురించేసినప్పటికీ తన వాయిస్ కుదిరింది. మృణాల్ ఇంకా విజయ్ వేసిన స్టెప్స్ ఈ పాటకి మంచి ఊపుని ఇస్తాయి. పాట చాలా బాగున్నప్పటికీ ఒకప్పటి మణిశర్మ గారి పెళ్లి పాటల టేస్ట్ కనిపిస్తోంది ఈ పాటలో. ఎక్కువసార్లు వింటే మణిశర్మ గారు మహేష్ బాబు గారి ఒక్కడు చిత్రంలో అందించిన పెళ్లి పాట గుర్తొచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ చూడముచ్చటగా ఉన్నారు విజయ్ ఇంకా మృణాల్.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Stay Connected
44,085FansLike
65,000FollowersFollow
52,453SubscribersSubscribe
Must Read
- Advertisement -spot_img
Related News
- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

You cannot copy content of this page