భారతదేశంలో ఎన్నో చిత్రం పరిశ్రమలు ఉన్నా భారతీయ సినిమాలు అంటే ఎక్కువ హిందీ సినిమాలే ప్రాచుర్యం పొందాయి. హిందీ సినిమాల తర్వాతే తెలుగు,తమిళ్,కన్నడ,మలయాళం సినిమాలు వస్తాయి. అందుకే హిందీ చిత్ర పరిశ్రమ మార్కెట్ తో పోలిస్తే సౌత్ మార్కెట్ చాలా తక్కువ. కానీ ఇది దశాబ్దం క్రిందటి మాట. ఎప్పుడైతే బాహుబలి వచ్చిందో. అప్పటి నుంచి తెలుగు సినిమా రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. బాహుబలి సిరీస్, ఆర్.ఆర్.ఆర్,పుష్ప,సలార్,హనుమాన్ వంటి చిత్రాలతో తెలుగు సినిమా మార్కెట్ పతాక స్టాయికి చేరిపోయింది. ఆ తర్వాత సౌత్ లోని మిగితా ఇండస్ట్రీస్ తమిళ్,మలయాళం,కన్నడ చిత్ర పరిశ్రమల నుంచి వచ్చిన చిత్రాలు కె.జి.ఫ్, విక్రమ్ , లియో, దృశ్యం సిరీస్, కేరళ ఫైల్స్ వంటి చిత్రాలు వరుసగా బాలీవుడ్ పై దండెత్తడంతో హిందీ పరిశ్రమ ఒక్కసారిగా కుదేలైయిపోయింది. ఎంతలా అంటే బాలీవుడ్ కి మేజర్ పట్టు అయిన నార్త్ ఆడియన్స్ హిందీ చిత్రాల కోసం కాకుండా సౌత్ సినిమాల కోసమే ఎక్కువ ఎదురు చూస్తున్నారు అంటే అర్ధం చేసుకోవచ్చు సౌత్ మార్కెట్ ఏ రేంజ్ కి వెళ్లిపోయిందో. బాలీవుడ్ సూపర్ స్టార్స్ కూడా ఇప్పుడు సౌత్ దర్శకుల మీద ఆధారపడే స్టాయికీ వచ్చారు. సౌత్ సినిమాల నుంచి మేజర్ మార్కెట్ తెలుగు సినిమా అవ్వగా .ఆ తర్వాత స్థానం మాత్రం మలయాళం సినిమాలదే. అవును ఒకప్పుడు కేరళ సినిమాలంటే ఎక్కువుగా నీలి ఫిలిమ్స్ అనే గుర్తొచ్చేవి. ఎంతలా అంతే ఆ ఇండస్ట్రీ లోని సూపర్ స్టార్స్ అయిన మమ్ముట్టి, మోహన్ లాల్ సినిమాలకంటే ఈ నీలి చిత్రాలే బాగా ఆడేవి. ఇది ఒక్కపటి మాట. గడిచిన కొన్నేళ్ల నుంచి ఈ పరిశ్రమ నుంచి కూడా దేశాన్ని దున్నేసే సినిమాలొస్తున్నాయి. ముఖ్యంగా క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ కి మాలీవుడ్ బ్రాండ్ అంబాసిడర్ గా నిలుస్తుంది. అందుకు ఉదాహరణ ఈ పరిశ్రమ నుంచి వచ్చిన దృశ్యం సినిమా అంతర్జాతీయ గుర్తింపు పొందడం. ఇటీవలే వచ్చిన మరో మలయాళీ చిత్రం ప్రేమలు కూడా దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. సినిమాల పరంగానే కాకుండా ఆ చిత్రపరిశ్రమ నుంచి మంచి మంచి కధానాయికలు కూడా వస్తున్నారు. అనుపమ పరమేశ్వరన్,సాయి పల్లవి,నిత్య మీనన్,నివేత థామస్ వంటి పలువురు కధానాయికలు దేశవ్యాప్తంగా తమ సత్తా చాటుతున్నారు. అలా ఒకప్పుడు అసహించునే స్థాయి నుంచి ఈరోజు దేశంలో నే నెంబర్.1 పరిశ్రమలలో ఒకటిగా ఎదిగిన తీరు చుస్తే అమోఘం,అద్భుతం,ప్రశంసనీయం.