గత కొంతకాలంగా ప్రభాస్ సినిమాలు ఏదొక విధంగా వాయిదా పడుతూనే ఉన్నవి. ప్రభాస్ నటించిన చివరి 5 సినిమాలు చుస్తే అన్ని చెప్పిన డేట్ కంటే వాయిదా పడ్డవే. బాహుబలి 1,2 రాజమౌళి పుణ్యామా అని చెప్పిన దానికంటే రెండేళ్లు ఎక్కువ సమయమే పట్టింది రిలీజ్ కావడానికి. తర్వాత సాహో సినిమా తొలుత 2019 ఆగష్టు 15న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ఫైనల్ అవుట్ పుట్ ఇంకా రెడీ కాకపోవడంతో చెప్పిన డేట్ కంటే 15రోజులు వాయిదా పడి ఫైనల్ గా 2019 ఆగష్టు 30న రిలీజ్ చేశారు. ఆ తర్వాత రాధేశ్యామ్ సినిమాకి కరోనా ఎఫెక్ట్ గట్టిగా పడింది. 2021 లో రావాల్సిన సినిమా 2022 లో వచ్చింది. ఇంక ఆదిపురుష్ సినిమాని తొలుత 2023 సంక్రాంతికి రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ టీజర్లోని V.F.X వర్క్ కి వచ్చిన విమర్శలకు కంగుతిన్న ప్రభాస్, స్వయంగా తానే విజువల్ ఎఫెక్ట్స్ ఇంప్రూవ్మెంట్ ఒక ఆరునెలలు పోస్టుపోన్ చేయించాడు. దీనితో 2023 పొంగల్ కి రావాల్సిన సినిమా 2023 జూన్ 16న రిలీజ్ అయ్యింది. ఇంక రీసెంట్ గా వచ్చిన సలార్ సినిమా సైతం తొలుత 28 సెప్టెంబర్ 2023 న రిలీజ్ డేట్ ప్రకటించారు. కానీ C.G. వర్క్ ఇంకా పూర్తి కాకపోవడంతో 22 డిసెంబర్ 2023 కి వాయిదా వేశారు. ఇప్పుడు మరోసారి ప్రభాస్ తదుపరి సినిమా వాయిదా పడేలానే ఉంది. దానికి కారణం ఆంధ్ర ప్రదేశ్ లోని అసెంబ్లీ ఎలక్షన్స్. ప్రభాస్ ప్రస్తుతం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్-K (కల్కి 2989-AD ) అనే సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే మే 9 న ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించారు. ఐతే పలుమార్లు ఈ సినిమా పోస్టుపోన్ అవుతుందంటే న్యూస్ వచ్చాయి. దీని పై చిత్రయూనిట్ స్పందించక పోయినప్పటికీ . ఎక్కడో చిన్న అనుమానం ఉండేది ఈ సినిమా పోస్టుపోన్ అవుతుందని. కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ షెడ్యూల్ తో ఈ సినిమా పోస్టుపోన్ అవ్వడం దాదాపు ఖాయంగానే కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో ఎలక్షన్స్ మే 13న జరగనున్నట్లు ఈరోజు ప్రకటించారు. ఐతే ముందే అనుకున్న డేట్ కి రిలీజ్ చేస్తే ఈ సినిమా కలెక్షన్స్ పై గట్టి ప్రభావం పడడం ఖాయం. దీనితో ఇప్పుడు చిత్రయూనిట్ మరో కొత్త రిలీజ్ డేట్ వెతుక్కోవలసిన పరిస్థితి నెలకొంది. ఏది ఏమైనప్పటికీ ఇది ప్రభాస్ ఫాన్స్ కి మాత్రం కాస్త బాధ కలిగించే అంశమే.