- Advertisement -spot_img
HomeMoviesక్రిష్ దర్శకత్వంలో అనుష్క శర్మ లేడీ ఓరియెంటెడ్ మూవీ "Ghaati"

క్రిష్ దర్శకత్వంలో అనుష్క శర్మ లేడీ ఓరియెంటెడ్ మూవీ “Ghaati”

- Advertisement -spot_img

సౌత్ ఇండియాలో ప్రతీ కుటుంబానికి ఇష్టమైన హీరోయిన్ ఎవరు అంటే మొదట చెప్పే పేరు “అనుష్క శర్మ”. అందరం ముద్దుగా స్వీటీ అని పిలుచుకుంటాం. స్వతహాగా కన్నడ పిల్ల అయిన స్వీటీ, నాగార్జున గారి సూపర్ అనే చిత్రం ద్వారా వెండి తెరకి పరిచయం అయ్యింది. ఆ తరువాత వరుస అవకాశాలతో తిరుగులేని మహారాణిగా వెలసింది. అరుంధతి చిత్రంతో తన దశ మారింది. బాహుబలి లో దేవసేన పాత్రలో తనని తప్పా ఇంకెవ్వరినీ ఉహించుకోలేము. సైజ్ జీరో చిత్రం వలన కొంచం బొద్దుగా అయిన ఈ ముద్దుగుమ్మ, తరువాత ఎంత తగ్గాలని ప్రయత్నించినా అవ్వలేదు. చివరికి ఒక మోస్తరుగా తగ్గారు. క్రితం సంవత్సరం మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి చిత్రంతో అందరినీ అలరించిన స్వీటి మళ్ళీ ఒక లేడీ ఓరియెంటెడ్ మూవీ తో మన ముందుకి రాబోతున్నారు. ఈ చిత్రాన్ని దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నారు. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఆయన పవన్ కళ్యాణ్ గారితో చేస్తున్న “హరిహర వీరమల్లు” వాయిదా పడగా, ఈలోపు ఈ చిత్రాన్ని పూర్తిచేసే ప్రయత్నంలో ఉన్నారు క్రిష్. ఈ చిత్రానికి “GHAATI” అనే టైటిల్ ఫిక్స్ చేసారు. ఈ చిత్రం ఒక మహిళ చుట్టూ తిరుగుతుంది. అనుకోని విధంగా ఒక మాదకద్రవ్యాల వలయంలో చిక్కుకుని, ఆ వ్యాపారంలో దిగిన ఒక మహిళ కథ అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మిగతా వివరాలు తెలియాల్సి ఉన్నాయి. ఈ చిత్రాన్ని థియేటర్ విడుదల తరువాత అమెజాన్ ప్రైమ్ లో చూడవచ్చు అని, ఆ కంపెనీ వాళ్ళు అధికారకంగా ప్రకటించారు. వేచి చూద్దాం చిత్ర బృందం నుంచి వచ్చే అధికారిక ప్రకటన కోసం.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Stay Connected
44,085FansLike
65,000FollowersFollow
52,453SubscribersSubscribe
Must Read
- Advertisement -spot_img
Related News
- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

You cannot copy content of this page