- Advertisement -spot_img
HomeMovies"గ్లాస్" వార్నింగ్ తో దుమ్ములేపిన "భగత్స్ బ్లేజ్": "Bhagath's blaze" review

“గ్లాస్” వార్నింగ్ తో దుమ్ములేపిన “భగత్స్ బ్లేజ్”: “Bhagath’s blaze” review

- Advertisement -spot_img

పవన్ కళ్యాణ్ అభిమానులు పండగ చేసుకునే విశేషం “భగత్స్ బ్లేజ్” రూపంలో రానే వచ్చింది. మాస్ దర్శకుడు హరీష్ శంకర్ తన అభిమాన నటుడిని దర్శకత్వం వహించే అవకాశం మళ్ళీ రావటంతో మాస్ అంశాలని గట్టిగా దంచి కొడుతూ తెస్తున్న చిత్రం “ఉస్తాద్ భగత్ సింగ్ ” నుంచి విడుదల చేసిన టీజర్ “భగత్స్ బ్లేజ్”. పవన్ కళ్యాణ్ ఒక ఫైర్ బ్రాండ్ పోలీస్ ఆఫీసర్ గా చేస్తున్నారు, అందాల భామ శ్రీలీల ఆయన సరసన నటిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. గబ్బర్ సింగ్ తరువాత అలాంటి మాస్ హిట్ నోచుకోని తన అభిమాన, దైవంతో సమానమైన పవన్ కళ్యాణ్ గారిని సరైన పద్దతిలో తనదైన శైలిలో చూపించే ప్రయత్నం చేసారు దర్శకులు. ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికలని దృష్టిలో పెట్టుకుని, కళ్యాణ్ గారి పార్టీ గుర్తు అయిన గాజు గ్లాస్ ని ముఖ్య ఆధారంగా వాడుతూ, దానియొక్క విలువని, తన జన సైనికుల్ని ఆ గ్లాస్ అంశాలతో పోల్చిన విధానం అందరినీ ఆకట్టుకుంది. దర్శకుడు ఎలక్షన్ ని దృష్టిలో పెట్టుకుని, పవన్ గారి స్టామినాని దృష్టిలో పెట్టుకుని అలాంటి కటౌట్ కి తగ్గ పవర్ ఫుల్ డైలాగ్స్ రాసారు. ఎక్కువశాతం యాక్షన్ అంశాలు చూపించినప్పటికీ, గ్లాస్ కి ఉన్న విలువని తెలియ చేస్తూ చూపించిన సన్నివేశాలు ఈ glimpse లో అందరినీ అలరిస్తాయి. ఎన్నికలు అయ్యేంతవరకు ఈ డైలాగ్స్ యొక్క ప్రభావం గట్టిగానే పడేటట్టు ఉంది ప్రజలమీద. DSP అందించిన బాక్గ్రౌండ్ మ్యూజిక్ మాంచి క్లాస్సి టచ్ ఇస్తూ మాస్ టచ్ ఇచ్చింది, రైటర్ దశరథ్ అందించిన స్క్రీన్ ప్లే కూడా బాగుంది, బోస్ గారి కెమెరా పనితనంతో ఎలేవేషన్స్ అదిరిపోయేలా చూపించారు ఎడిటర్ ఉజ్వల్ కులకర్ణి. మొత్తానికి ఫాన్స్ కి పండగ చేసుకునే glimpse వదిలారు దర్శకులు హరీష్ శంకర్. ఈ డైలాగ్స్, ఈ మాస్ వార్ణింగ్స్ ఏమేరకు అభిమానులకి, ప్రజలకి ఉపయోగపడుతాయి అనేది వేచిచూడాలి.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Stay Connected
44,085FansLike
65,000FollowersFollow
52,453SubscribersSubscribe
Must Read
- Advertisement -spot_img
Related News
- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

You cannot copy content of this page