- Advertisement -spot_img
HomeMoviesకాలభైరవుడు మళ్లీ వస్తున్నాడు!

కాలభైరవుడు మళ్లీ వస్తున్నాడు!

- Advertisement -spot_img

రాంచరణ్ కెరీర్లోనే కాకుండా తెలుగు సినిమా చరితలోనే వన్ ఆఫ్ బిగ్గెస్ట్ హిట్స్ లో ఒక్కటిగా నిలిచిన చిత్రం “మగధీర”. 2009వ సంవత్సరంలో వచ్చిన ఈ చిత్రం కలెక్షన్స్ విషయంలో అప్పటివరకు ఉన్న అన్ని పాత రికార్డ్స్ తుడిచిపెట్టి కొత్త రికార్డ్స్ సృష్టించింది. టాలీవుడ్లో ఫస్ట్ 100క్రోర్స్ గ్రాస్, ఫస్ట్ 50క్రోర్స్ షేర్ సాధించిన సినిమాగా అరుదయిన ఘనత సాధించింది. దర్శక దిగ్గజం రాజమౌళి ఈ సినిమాతోనే దర్శక ధీరుడు, జక్కన్న అనే బిరుదుని పొందాడు. ఈ సినిమాతోనే రాంచరణ్, కాజల్ అగర్వాల్ స్టార్ యాక్టర్స్ అయ్యారు. సుమారు 35కోట్ల రూపాయలతో తెరకెక్కిన ఈ చిత్రం. 70కోట్లకు పైగా షేర్ సాధించి నిర్మాత అల్లుఅరవింద్ కీ కాసుల వర్షం కురిపించింది. రాంచరణ్ కెరీర్లో రెండవ చిత్రంగా వచ్చిన ఈ చిత్రం ఎంత పెద్ద హిట్ అంటే ఇప్పటికి ఈ సినిమా పై ఉన్న కొన్ని రికార్డ్స్ చెక్కుచెదరలేదు. అలాంటి సినిమా మళ్ళీ వస్తోంది. ఈ మధ్య వరుస రి-రిలీజ్ చిత్రాలకు ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టడంతో. ఇప్పుడు ఈ సినిమాని కూడా రి-రిలీజ్ చేయడానికి చిత్ర నిర్మాత అల్లుఅరవింద్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మార్చి 27న రాంచరణ్ పుట్టిన రోజును పురస్కరించుకొని మార్చి 26న మగధీర సినిమాను రి-రిలీజ్ చేసి మెగా అభిమానులకి మంచి ట్రీట్ ఇవ్వబోతున్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Stay Connected
44,085FansLike
65,000FollowersFollow
52,453SubscribersSubscribe
Must Read
- Advertisement -spot_img
Related News
- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

You cannot copy content of this page