- Advertisement -spot_img
HomeMoviesఅక్క కోసం ఎంతకైనా తెగిస్తాను అంటున్న "తమ్ముడు": నితిన్ కొత్త చిత్రం ప్రారంభం

అక్క కోసం ఎంతకైనా తెగిస్తాను అంటున్న “తమ్ముడు”: నితిన్ కొత్త చిత్రం ప్రారంభం

- Advertisement -spot_img

మన తెలుగు సినీ అభిమానులందరికీ బాగా ఇష్టమైన నటులలో ఒకరు నితిన్. విభిన్నమైన కథలే కాకుండా, లవర్ బాయ్ పాత్రని కూడా చాలా నేర్పుతో చేస్తారు ఆయన. మధ్య సరైన హిట్ లేక సతమవుతున్నప్పటికీ తన అభిమానులకోసం మంచి కథలని ఎంచుకునే ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ఇప్పుడు అదే పంథాతో వస్తున్నారు. ఈసారి అక్కా తమ్ముడి కథనంతో మన ముందుకి రాబోతున్నారు. అక్కకోసం ఎంత దూరం అయినా వెళ్లే తమ్ముడి పాత్రలో నితిన్ నటిస్తున్నారు. అక్క కోసం ఎంతకైనా తెగిస్తాడు. ఇలాంటి యాక్షన్ ఎలెమెంట్స్ తో రాబోతోంది ఈ చిత్రం. పోస్టర్ చూస్తుంటే నితిన్ ఒక sniper గన్ పట్టుకున్నట్టు ఉంది. యువ దర్శకుడు వేణు శ్రీరామ్ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వరా ఆర్ట్స్ బ్యానర్ ద్వారా దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి తన అభిమాన ఆరాధ్య దైవం అయిన పవన్ కళ్యాణ్ గారి సూపర్ హిట్ చిత్రం యొక్క టైటిల్ నే ఎంచుకున్నారు నితిన్. తన నూతన చిత్రానికి “తమ్ముడు” అనే టైటిల్ ని ఖరారు చేసారు. నితిన్ సరసన సప్తమి గౌడ అనే కన్నడ నటి నటిస్తున్నారు, అక్క పాత్రలో ఒకప్పటి టాప్ సౌత్ హీరోయిన్ అయిన లయ నటిస్తున్నారు. వేణు శ్రీరామ్ గారు రెండు సంవత్సరాల క్రితం పవన్, రానా కాంబినేషన్ లో భీమ్లా నాయక్ అనే చిత్రం దర్శకత్వం వహించారు. ఇప్పుడు మళ్ళీ తమ్ముడు అనే చిత్రంతో మళ్ళీ మెగా ఫోన్ పట్టారు. ఈరోజు నుంచి ఈ చిత్రం యొక్క షూటింగ్ మొదలవుతోంది. తదుపరి వివరాలు త్వరలో చిత్ర బృందం నుంచి వెలువడతాయని ఆశిద్దాం.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Stay Connected
44,085FansLike
65,000FollowersFollow
52,453SubscribersSubscribe
Must Read
- Advertisement -spot_img
Related News
- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

You cannot copy content of this page