- Advertisement -spot_img
HomeMovies"ఓం భీమ్ బుష్" చిత్రం రివ్యూ: "Om Bheem Bhush" movie review

“ఓం భీమ్ బుష్” చిత్రం రివ్యూ: “Om Bheem Bhush” movie review

- Advertisement -spot_img

చిత్రం: ఓం భీమ్ బుష్
రేటింగ్: 2.25/5
బాటమ్ లైన్: “సినిమా పెద్ద బుస్ కామెడీ మాత్రం పైసా వసూల్”
నటీనటులు: శ్రీ విష్ణు, రాహుల్ రామకృష్ణన్,ప్రియదర్శి, ప్రీతి ముకుంన్, అయేషా ఖాన్, రచ్చ రవి తదితరులు
సంగీతం: సన్నీ ఎమ్మార్
నిర్మాత: సునీల్ బలుసు
దర్శకత్వం: హర్ష కొనుగంటి
విడుదల: 22 మార్చి 2024

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ స్టార్ట్ చేసి ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు టైర్-2 హీరోస్ లో ఒకరిగా ఎదిగాడు శ్రీ విష్షు. ఈ మధ్యకాలంలో వరుస బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ తో మినిమం గ్యారంటీ హీరోగా నిర్మాతలకి భరోసా ఇచ్చాడు. అలాంటి శ్రీ విష్ణు ఇప్పుడు కొత్తగా ఓం భీమ్ బుష్ అంటూ ఈ వారం ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. మరి సినిమా ఎలా ఉందో ఇప్పుడు మన విశ్లేషణలో చూద్దాం.

కధ:
కృష్ణ కాంత్( శ్రీ విష్ణు),వినయ్ (ప్రియదర్శి), మాధవ్(రాహుల్ రామకృష్ణ) ముగ్గురు ఆకతాయిలు. ఓ కాలేజీ ప్రిన్సిపాల్ ని మోసం చేసి P.H.D చేయడానికి జాయిన్ అవుతారు. అక్కడ చిత్రవిచిత్రమైన వీరి ప్రవర్తనతో కాలేజీ ప్రిన్సిపాల్ ని ఇబ్బంది గురిచేస్తారు. వీరి అల్లరిని తట్టుకోలేని కాలేజీ ప్రిన్సిపాల్ బలవంతంగ P.H.D పూర్తిచేసినట్టు సర్టిఫికెట్ ఇచ్చి పంపించేస్తాడు. అలా P.H.D పూర్తిచేసిన వీరి ముగ్గురు భైరవపురం అనే ఊర్లోకి ఎంటర్ అవుతారు. ఆ ఊరి బలహీనతలను క్యాచ్ చేసుకొని తాంత్రిక విద్యలు చేసే ఒక ముఠా డబ్బులు సంపాదించడం చూస్తారు ఈ ముగ్గురు. వీళ్ళు కూడా ఆ ఊరి బలహీనతలను క్యాచ్ చేసుకొని డబ్బులు సంపాదించాలనుకుంటారు. అలా ముగ్గురు సైంటిస్ట్స్ అని చెప్పి విచిత్రమైన గెటప్స్ లో “బ్యాంగ్ బ్రోస్” గా దిగుతారు. ఇప్పుడున్న టెక్నాలజీ తో ఏవేవో మాయలు చేసి అక్కడున్న వారి సమస్యలు పరిష్కరించి మొత్తానికి అక్కడున్న జనాన్ని నమ్మిస్తాడు. అది చూసి తట్టుకోలేకపోయిన ఆ తాంత్రిక ముఠా ఆ ఊరిని ఎప్పటినుంచో పట్టి పీడిస్తున్న సంపంగి అనే దెయ్యం ఉండే కోటలో నిధి ఉందని. దాన్ని ఈ ముగ్గురు తీసుకొని రావాలని ఊరందరి ముందు సవాల్ విసురుతారు. ఆ సవాల్ స్వీకరించిన ఈ ముగ్గురు నిధి కోసం ఆ దెయ్యం ఉండే కోటకి వెళ్తారు. అలా వెళ్లిన ఆ ముగ్గురు ఆ నిధిని ఎలా తీసుకొని వచ్చారు. ఆ దెయ్యం బారిన నుంచి తప్పించుకొని ఎలా బయట పడ్డారు అనేది అసలు కథ.

విశ్లేషణ:

ఈ సినిమా టీజర్, ట్రైలర్ బయటకి వచ్చినప్పుడే చాలా మందికి అర్దమైయింది. ఇది ఒక నాన్-సింక్ సినిమా అని. లాజిక్స్ అన్ని పక్కన పెట్టి కేవలం కామెడీ కోసం వెళ్తే విపరీతంగా ఎంజాయ్ చేయొచ్చు అని ఆడియన్స్ ముందే ప్రిపేర్ అయ్యి ఈ సినిమా చూడడానికి వచ్చారు. అందుకు ఆడియన్స్ ని అసలు డిస్స్పాయింట్ చేయదు. “జాతిరత్నాలు” కూడా ఈ కోవకి చెందిన సినిమానే. ఈ సినిమా చూస్తున్నంత సేపు అసలు దర్శకుడు “జాతిరత్నాలు” సినిమా చూసే ఈ సినిమా కధ రాసాడేమో అనిపిస్తుంది. కాకపోతే దానికి దీనికి ఒకటే తేడా. అది క్రైమ్-కామెడీ చిత్రం ఐతే ఇది మాత్రం హారర్ కామెడీ చిత్రం. ఫస్ట్ హాఫ్ అంత ఈ ముగ్గురు ఊరిలో చిత్రవిచిత్రమైన విన్న్యాసాలతో నవ్వులు తెపిస్తే. సెకండ్ హాఫ్ మొత్తం హారర్ కామెడీ తో నవ్వులు తెప్పిస్తారు.

ప్లస్ పాయింట్స్:

ఈ సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్ కామెడీ. శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణన్ తో పాటు అందరు ఉన్నంత సేపు ఏంటో కొంత నవ్వించే వెళ్తారు. లాజిక్స్ అన్నీ పక్కనపెట్టి కేవలం కామెడీ మాత్రమే ఆశించి వెళ్తే మాత్రం సినిమా నిరాశపరచదు. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నవ్వుతూనే ఉంటారు. పెట్టిన టికెట్ కి ప్రతి రూపాయి కీ పైసా వసూల్ అవ్వడం ఖాయం. శ్రీ విష్ణు తనదయిన కామెడీ స్టైల్లో ప్రేక్షకులని నవ్విస్తాడు. రాహుల్ రవీంద్రన్, ప్రియదర్శి లు కూడా తమ కామెడీతో రెచ్చిపోయారు. నిజానికి సినిమా మొత్తం ఈ ముగ్గురు ఒకరితో ఒకరు పోటీ పడుతూ ఒకల్ని మించి ఒకరు ప్రేక్షకులని కడుపుబ్బా నవ్విస్తారు. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి. చాలా తక్కువ బడ్జెట్ అయినా నిర్మాతలు చాలా బాగా తీశారు. బాక్గ్రౌండ్ స్కోర్ కూడా పర్వాలేదనిపిస్తుంది.

మైనస్ పాయింట్స్:

ఈ సినిమాకి ప్రధాన మైనస్ పాయింట్ కధ. ఫస్ట్ హాఫ్ మొత్తం ఒక కథ సెకండ్ హాఫ్ మొత్తం ఇంకో కథ ఉంటుంది. దీనితో ఆడియన్స్ కి ఒకే టిక్కెట్ పై రెండు సినిమాలు చుస్తున్నామా అన్న భావన కల్గుతుంది. ఇంకో మైనస్ పాయింట్ హీరోయిన్ క్యారెక్టర్. చాలా తక్కువ నిడివి ఉన్న క్యారెక్టర్. మ్యూజిక్ కూడా పెద్ద మైనస్ ఈ సినిమాకి. ఉన్న పాటల్లో వెడ్డింగ్ సాంగ్ తప్పించి మిగిలిన ఏ సాంగ్ ఆకట్టుకోదు. ఇంకా ఈ చిత్రానికే అతి పెద్ద మైనస్ పాయింట్ దెయ్యం క్యారెక్టర్. దెయ్యంతో లవ్ స్టోరీ, దెయ్యాన్ని హీరో పెళ్లి చేసుకోవడం లాంటి సీన్స్ చూస్తే ఆడియన్స్ ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ వాట్ ఈస్ థిస్ నాన్-సెన్స్ అనుకుంటారు. ఆ సీన్స్ చూస్తే పిచ్చి సినిమా తీసిన డైరెక్టర్ క లేకపోతే సినిమా చూడడానికి వచ్చిన మనకా అనిపిస్తుంది. ఇంకొంత సేపు ఆగితే దెయ్యంతో ఫస్ట్ నైట్, హనీమూన్ లాంటివి ప్లాన్ చేసాడేమో అని బయమేసింది. కానీ మన అదృష్టం కొద్దీ అలాంటివి ఏం పెట్టనందుకు డైరెక్టర్ కి థాంక్స్.

సాంకేతిక విలువలు :

గ్రాఫిక్స్ పరంగా గ్రీన్ మ్యాట్ మీద , సెట్ లో తీసినట్టు క్లియర్ గా కనిపిస్తున్నాయి. గ్రాఫిక్స్ సరిగ్గా చేసి ఉంటే ఇంకా బాగుండేది. సంగీతం అంతగా ఆకట్టుకోలేదు. కొంతవరకు పరవాలేదు అనిపించినప్పటికీ పూర్తిస్థాయిలో చిత్రాన్ని నిలపలేకపోయింది. కథ రాసుకున్న విధానం ఇంకా మంచిగా ఉండాలి. మొదటినుంచి చూపించింది వేరు చివర్లో వేరుగా ఉంటుంది. కామెడీ పరంగా డైలాగ్స్ బాగున్నప్పటికీ , అది మొత్తంగా మెప్పించవు . సినిమాటోగ్రఫీ తో కొంతమేరకు మంచే జరిగినప్పటికీ, ఎడిటింగ్ కూడా తేలిపోయింది ఈ చిత్రానికి.

ఓవరాల్:

ఇంక ఫైనల్ గా చెప్పాలంటే కేవలం కామెడీ ఆశించి వెళ్తే రూపాయికి రెండు రూపాయలంత ఎంటర్టైన్మెంట్ లభించటం ఖాయం. అంతకు మించి ఇంకేం ఆశించి వెళ్లినా డిస్స్పాయింట్ అవ్వడం కూడా ఖాయం.

రివ్యూ బై : నవీన్ మాదినేని

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Stay Connected
44,085FansLike
65,000FollowersFollow
52,453SubscribersSubscribe
Must Read
- Advertisement -spot_img
Related News
- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

You cannot copy content of this page