మహేష్ బాబు కు ఎప్పుడు గ్యాప్ దొరికినా తన ఫ్యామిలీ తో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. ఆకాశం బద్దలయిన, భూమి కంపించిన మహేష్ బాబు కు ఏం పట్టదు. తాను కుటుంబంతో కలిసి విహారయాత్రలకు వెళ్లడం మాత్రం ఆపడు. వర్క్ విషయంలో కూడా అంటే డెడికేటెడ్ గా ఉంటాడు. ఎన్ని అడ్డంకులు వచ్చిన తన సినిమాని అనుకున్న డేట్ కి ఫినిష్ చేసేస్తాడు. అందుకే మహేష్ బాబు ఎన్ని సార్లు ఫ్యామిలీ తో కలిసి బయటికి వెళ్లిన ఎవరూ కంప్లైంట్ చెయ్యరు. ప్రతి సంవత్సరంలో కనీసం రెండుమూడు సార్లు అయినా విదేశాలకు వెళ్తారు. ఐతే ఇక పై ఇది కుదరకపోవచ్చు. ఎందుకంటే “గుంటూరు కారం” తర్వాత మహేష్ బాబు పూర్తిగా రాజమౌళి చేతిలోకి వెళ్ళిపోబోతున్నాడు. రాజమౌళి చేతిలోకి వెళ్లిన ఏ హీరో అయినా సరే ఒక రెండుమూడేళ్ల పాటు ఫ్యామిలీ తో కలిసి టైం స్పెండ్ చేయడం, విహారయాత్రలకు వెళ్లడం లాంటివి మర్చిపోవాల్సిందే. తన సినిమా విషయంలో అంత స్ట్రిక్ట్ గా ఉంటాడు రాజమౌళి. అలా ఉంటాడు కాబట్టే ఆయన నుంచి “బాహుబలి”, “ఆర్. ఆర్ . ఆర్” లాంటి గొప్ప చిత్రాలు వచ్చాయి. రాజమౌళి తో సినిమా చేయగానే అందులో నటించే నటీనటులకు ఒకేసారి పదింతలు ఇమేజ్ వచ్చి పడుతుంది. అందుకే ఆయన సినిమాలో నటించే నటీనటులు కూడా ఆయన పెట్టే కండీషన్స్ కి ఎవ్వరూ పెద్దగా అభ్యంతరం చెప్పారు. ప్రభాస్,ఎన్టీఆర్ , రాంచరణ్ వంతు అయిపొయింది. ఇప్పుడు మహేష్ బాబు వంతు వచ్చింది. ఆల్రెడీ షూటింగ్ పూర్తయ్యే వరకు ఏ వాణిజ్య ప్రకటనలలో నటించకూడదు అని మహేష్ బాబు తో రాజమౌళి ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. దానికి తోడు రేపు ఉగాది కి ఈ సినిమా అనౌన్స్మెంట్ అనే ప్రచారం జోరుగా సాగుతుంది. వన్స్ సినిమా అనౌన్స్ అయితే షూటింగ్ స్టార్ట్ అవ్వడానికి ఎంతో సమయం పట్టదు. అందుకే రాజమౌళి సినిమా స్టార్టింగ్ కి ముందు దొరికిన ఈ ఖాళీ సమయాన్ని ఫ్యామిలీ తో కలిసి గడపాలని డిసైడ్ అయ్యాడు. అందుకే మరోసారి తన ఫ్యామిలీ తో కలిసి విదేశాలకు వెళ్ళాడు. సినిమా సెట్స్ పైకి వెళ్లే ముందు రీఫ్రెష్ అవ్వలని మహేష్ బాబు ఆలోచన.